Monday, April 18, 2011

అలా మొదలయింది - నందినీ ఆరంగేట్రం


"ఈ సినిమా బాగుంది చూడండి" అని కత్తి మహేష్ కుమార్ గారు నవతరంగంలో చెప్పారు. ఆ వార్త తెలిసి కాలాస్త్రిలో చూద్దామనుకునేసరికి కాలాస్త్రి నుండి ఈ కత్తి లాంటి సినిమా ఎత్తేసారు. తిరప్తి దాకా సినిమా కొసం వెళ్ళడం వీలుకాక అప్పట్లో చూడలేకపోయాను. ఎండాకాలం సెలవులకి మేనకోడళ్ళు ఇంటికి వస్తే ఇంట్లో సీడీ వేసుకుని  చూసా. ఇంతకు ముందే సినిమా చూసిన మేనకోడలు కథ చెపుతూ ఉంటే ఫాలో అవుతూ సినిమా చూసాం. సీడీ సరిగ్గా లేక సినిమాని పూర్తిగా ఎంజాయ్ చెయ్యలేకపోయాను. అప్పటికే నెల్లూరు పెద్దారెడ్డి ఈ సినిమా రెండు సార్లు చూసి ఉన్నాడు."నువ్వు గే అని చెప్పాలే" అని ముద్దు,ముద్దుగా పలికే నిత్యా మీనన్ గురించి తెగ చెప్పేవాడు.


రెండు రోజుల ముందు తీన్ మార్ చూసి ఆ హాంగ్ ఓవర్ తగ్గించుకుందామని ఈ సినిమాకి ఈరోజు వెళ్ళా.


సుందర్ డీలక్స్ ని ఎపుడు పడగొట్టారో తెలియదు, అక్కడ ఇపుడు సిరి అని ఒక మల్టిప్లెక్స్ మొలిచింది. సినిమా మొదట నుండి చివరాకరవరకు చాలా సరదాగా ఉంది ఈ సినిమా. నిత్యా మీనన్ అయితే ముద్దుగా,బొద్దుగా చాలా బాగుంది. ఈ సినిమాకి అమే మాటలు చెప్పుకోవడం, కొన్ని పాటలు కూడా పాడడం విని "ఈమె మమతా మోహన్ దాస్ స్కూలు లాగుందే" అని మామయ్య కామెంటారు.


యంగ్ నటులతో సినిమా ఫ్రెష్ గా ఉంది. నాని గాడు కూడా కొంచెం పరిపక్వం చెందాడు ఈ సినిమాతో. నేను కూడా నాని లాగే గడ్డం పెంచుకుందామనుకున్నా ఆ మధ్య! నా గడ్డం అశోక చెట్టు లాగా గుబురుగా పెరిగింది కానీ నాని గాడి గడ్డం లుక్కు మాత్రం రాలేదు. జల్సా సినిమా విడుదల అయినపుడు మా స్నేహితుడు పవర్ స్టార్ ఫోటో ఒకటి తీసుకుని ఇలా నాకు కటింగ్ కొట్టు" అని డెట్రాయిట్ లో కటింగ్ చేసుకున్నాడు. నేను కూడా నాని ఫోటో ఒకటి పెట్టుకుని అలా గడ్డం పెంచుకోవాలి.


ఈ అద్భుత సినిమా తీసినందుకు నందినీ రెడ్డిని మెచ్చుకోవాలి. పోయిన వారం ఈమె మా టీవీలో ప్రకాష్ రాజ్ షో లో పాల్గొన్నపుడు బాగా తెలివితేటలు ప్రదర్శించింది. ఈ బ్లాగు రాసేటపుడు ఫేస్ బుక్లో ఒకరు కామెంటు పెడుతూ "ఈ సినిమా వెన్ హార్రీ మెట్ సాలీ నుండి గ్రహించబడింది" అని చెప్పారు.


పాపం, కాపీ చేసినా "బాగా చేసావ్ అమ్మాయ్!" అని నందినీకి నా కితాబు!


3 comments:

శరత్ 'కాలమ్' said...

ఆ సినిమాకి నేనింకా మొదలేకాలేదు. థియేటరులో సినిమా మిస్సయ్యా. సిడి వచ్చాక చూడాలి. మీనన్ చూస్తుంటేనే నచ్చుతోంది.

Indian Minerva said...

"నువ్వు గే అని చెప్పాలే"

ఈ డైలాగ్ వచ్చేసమయానికి నేను నీళ్ళుతాగుతున్నాను. నవ్వాపుకోలేక చచ్చాను. కరెక్ట్ కాపీకొట్టినా ఇలా అందంగా వుండాలి.

శ్రీ said...

@ శరత్, తప్పక చూడండి.

@ మినర్వ, అవును.