Friday, April 29, 2011

నేను, నా రాక్షసి - ఈసారి పూరి కరకరలాడింది






హమ్మయ్య...చాలా రోజుల తర్వాత పూరీ మళ్ళీ ఒక సక్సెస్ సినిమా తీసాడు. ప్రభాస్ తో సినిమాలు తీసి, తీసి క్రుంగి కృశించి పోయి రేవులో ఇంకో తాటి చెట్టయిన రాణాతో మంచి సినిమానే తీసాడు. రాణా కూడా మొదటిసినిమా కంటే ఈ సినిమాలో బాగా చేసాడు. అతని బాడీ లాంగ్వేజికి సరిపోయే పాత్రని పెట్టడంలో పూరీ ఫలించాడు. సినిమాకి హైలెట్ అంతా ఇలియానానే! ఇన్ని రోజులూ ఈమెకి బాక్ మాత్రమే ఉందనుకున్నా, ఈ సినిమాతో విషయం కూడా ఉందని నిరూపించింది.   నేనింతే సినిమాలో సుబ్బరాజుకి, ముమైత్ ఖాన్ కి పూరీ మంచి పాత్రలే ఇచ్చాడు. కానీ ఆ సినిమా అంత బాగా ఆడలేదు, ఈ సినిమాలో కూడా ఇద్దరికీ పూరీ మంచి పాత్రలే ఇచ్చాడు. ఇద్దరూ కూడా తమ పాత్రలకి బాగా న్యాయం చేసారు. పూరీ సినిమాలో ఆలీకి ఒక స్పెషల్ ట్రాక్ నడుస్తుంది, ఈ సినిమాలో కూడా అందరినీ నవ్వించే పాత్రలో ఆలీ మనల్ని అలరిస్తాడు. రక్త చరిత్రలో బుక్క రెడ్డిగా నటించిన అభిమన్యు సింఘ్ దీంట్లో విలన్ గా నటించాడు. అతని పాత్రని అతను శుభ్రంగానే తోముకున్నాడు.




సినిమా అంతా ఆత్మహత్యల నేపథ్యంలో నడుస్తుంది. అతడులో మహేష్ బాబు లాగా రాణా ఒక కిరాయి గూండా. ఇలియానా ఒక కోఫీ బార్ లో పని చేస్తూ ఉంటుంది. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళంతా చనిపోయే ముందు తాము ఎందుకు చనిపోవాలనుకుంటున్నారో చెప్పి చనిపోతూ ఉంటారు. ఈ వీడియోలనంతా యూ ట్యూబులో ఎక్కిస్తూ ఉంటారు. ఈ వీడియోలని తీస్తున్న వాళ్ళని పట్టుకోవడానికి సుబ్బరాజు (పోలీస్) ప్రయత్నిస్తూ ఉంటాడు. నిండు నూరేళ్ళు నడవాల్సిన జీవితాన్ని మధ్యలోనే ఎందుకు తుంచవలసి వస్తుందో తెలపడానికి చేసిన ప్రయత్నమే ఈ సినిమా.  




సినిమాలో పాటలు బాగున్నాయి. బాక్ గ్రౌండ్ సంగీతం అదిరింది. కామెడీ ట్రాక్ బాగనే కుదిరింది. మొదటి సగం ఆసక్తికరంగా సాగుతుంది. రెండో సగం కొంచెం స్లో అయ్యి అలీ కామెడీతో, ముందే ఊహించిన క్లైమాక్సుతో ముగుస్తుంది.  ఎప్పటిలాగే బాంకాక్ వెళ్ళకుండా ఈసారి వెనిస్ వెళ్ళి మంచి పని చేసాడు. బాంకాక్ లో పూరీ పెద్దమ్మ ఉంటుందని మా ఫ్రెండు చెప్పాడు, పెద్దమ్మ తిట్టిందేమో ఎపుడూ ఇక్కడే తిరుగుతుంటావ్ అని! 




న్యూ జెర్సీలో విపరీతమయిన వాన, గాలుల వలన సినిమా బాక్సు చాలా వూళ్ళకి చేరలేదు. నేను కూడా డెట్రాయిట్ వెళ్ళలేక జెర్సీలోనే ప్రీమియర్ చూసా. చాలా రోజుల తర్వాత రేపు సాయంత్రం మా వూరెళ్ళిపోతున్నా.



10 comments:

Indian Minerva said...

"పెద్దమ్మ తిట్టిందేమో ఎపుడూ ఇక్కడే తిరుగుతుంటావ్ అని!" :D

Should try it then.

ఆ.సౌమ్య said...

నాకు పాటలు నచ్చాయి...ఎందుకో పాటలు వినగానే సినిమా మీద హోప్స్ పెరిగిపోయాయి...అయితే బావుందన్నమాట!...నేనెప్పుడు చూస్తానో :(

గిరీష్ said...

అప్పుడే చూసేశారా.. గుడ్ :),
నేను రేపటికి బుక్ చేశా..

శ్రీ said...

@ మినర్వ, --)

@ సౌమ్య, పాటలు వినడానికి, చూడడానికి బాగున్నాయి

@ గిరీష్, ఈస్ట్ విండ్సర్ లో అందరికంటే మొట్టమొదటి ప్రీమియర్ షో జరిగింది.

రవి said...

హమ్మయ్య. మీకూ నాకూ మరోమారు భావసారూప్యం కుదిరింది. నాకూ కరకరలాడింది. ఒక్క ఆలీ ఎపిసోడ్ తప్ప. ఆలీ ఎపిసోడ్ మొదట్లో బావున్నా, తర్వాత అసభ్యంగా ఉంది.మీ రిబ్యూ మాత్రం చదివి సినిమా చూసినందుకు మంచిదయింది.

క్రితం వారం నవతరంగంలో తీన్ మార్ రివ్యూ చదివి సినిమాకెళ్ళా. వీరబాదుడు. మీ బ్లాగో మారు చూసి ఉంటే పీడతప్పి ఉండేది.

శ్రీ said...

హమ్మయ్య..మీకు కూడా నచ్చిందనమాట. అలీ కామెడీ రోడ్ ట్రిప్ సినిమా నుండి కాపీ చేసాడు, అది కొంచెం మన నేటివిటీకి సరిపోలేదు.

రివ్యూలలో రాసిన వాళ్ళంతా ఈ సినిమా ఇంటెలెక్చువల్స్ కి నచ్చ్తుంది అని రాసారు. అంటే మీరూ,నేను ఇంటెలెక్చువల్స్ అనమాట.

సుజాత వేల్పూరి said...

సినిమా బాగుంది. స్క్రీన్ ప్లే చక్కగా ఉంది . ముఖ్యంగా ఇలియానాకి కాస్త నటించే కారెక్టర్ దొరికింది.

కథకు సంబంధం లేని కామెడీ ట్రాక్ ని చొప్పించడం పూరీ మానుకుంటే మంచిది.

పాప (సుబ్బరాజు కూతురు) రోగం స్టోరీ ఎందుకో అర్థం కాలేదు.

మొమైత్ ఖాన్ కి డబ్బింగ్ చెప్పినమ్మాయి పేరు భార్గవి పిళ్ళై అట...యూరోపియన్ శ్లాంగ్ బాగా చెప్పింది కదా!

రవి said...

>>అంటే మీరూ,నేను ఇంటెలెక్చువల్స్ అనమాట.

శ్రీ..:))))

శ్రీ said...

@ సుజాత, పాపకి రోగం రాణాలో మార్పు కోసం కదా.. మూమైత్ అమే డబ్బింగ్ చెప్పిందనుకున్నా, భార్గవి పిళ్ళై చెప్పిందా! బాగా సరిపోయింది.

@ రవి, --)

శ్రీ said...

@ సుజాత, మీకు చెప్పడం మరచిపోయా, మీరూ ఇంటెలెక్చువల్లే!