Thursday, June 2, 2011

మణిరత్నం పుట్టిన రోజు సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు




ఘర్షణ సినిమా రిలీజ్ అయినపుడు నేను నెల్లూరులో ఇంటర్ చదువుతూ ఉన్నా. అప్పట్లో మనకి మొదటిరోజు సినిమా చూసే సీన్ లేదు. ఒక రెండు రోజులయ్యాక నా ఫ్రెండు చిలకా శ్రీధర్ ఇంటికెళ్తే వాడు అప్పటికే సినిమా చూసి పిచ్చెక్కి పోయాడు.


"ఒరే! మొదటి పాట ఉందిరా? ఆ పాటకి అందరూ లేచి డాన్స్ చెయ్యడం మొదలుపెట్టారు!"


ఇలా చెప్పేసరికి ఎలాగోలా రాఘవా సినీ కాంప్లెక్సులో ఆ సినిమా చూసేసా. సినిమాలో పాటలు కానీ, ఇళయరాజా సంగీతం కానీ, కొత్త రకం లైటింగుతో మణిరత్నం సినిమా అదరగొట్టేలా తీసాడు. ప్రతి సీన్ ఒక గ్రీటింగ్ కార్డులాగా ఉందేలా పీ.సీ.శ్రీరాం కెమెరా పనితనం సినిమా అంతా కనిపిస్తుంది. సరదాగా, చిలిపిగా సాగే కొత్త తరహా డైలాగులతో సినిమా పిచ్చెక్కిస్తుంది.


ఈ సినిమా ముందు నాయకుడు చూసాను కానీ, మౌనరాగం చూడలేకపోయాను. సుందర్ డీలక్సులో నాయకుడు చూసేటప్పటికి మనకి గాడ్ ఫాదర్ సినిమా పరిచయం జరగలేదు. చిన్న కమలాహాసన్, పెద్ద కమలాహాసన్ ప్రేక్షకులతో కబడీ ఆడుకున్నారు. ఇళయరాజా గురించి చెప్పక్కరలేదు, పాటలతో యువతని ఉర్రూతలూగించాడు.  రొటీన్ గా వచ్చే సినిమాలా కాకుండా తమిళ సినిమాలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు. ఘర్షణ సినిమాలో నిరోషా గాలిలో ఐ లవ్ యూ చెప్పినపుడు కానీ, గీతాంజలిలో గిరిజా లేచిపోదామా? అని పిలిచినపుడు కానీ యువత తట్టుకోలేకపోయారు.


దళపతి సినిమా ఎక్కడ చూసానో గుర్తు లేదు. తమిళ్, మళయళ సూపర్ స్టార్లతో ఈ సినిమా కూడా మంచి హిట్. మహాభారతం లో కథనే ఇక్కడ వాడుకుని ప్రేక్షకులతో ఆడుకున్నాడు. రోజా సినిమా రిలీజ్ అయ్యేసరికి నేను వాకాడులో ఉన్నాను. సినిమా చూడాలంటే నెల్లూరు కానీ, గూడూరులో కానీ చూడాలి. మణిరత్నం సినిమా అంటే నాణ్యత ఉన్న థియేటర్ లోనే చూడాలి. మళ్ళీ నెల్లూరులోనే ఈ సినిమా కూడా చూసాను. మధుబాల అమాయకత్వం, అరవింద స్వామి పెంకిత్వం కలగలిపి దేశభక్తి మీద ఈ సినిమా నడుస్తుంది. ఇక్కడ నుండి మణిరత్నానికి రెహ్మాన్ దొరికాడు. మణిరత్నం సంప్రదాయానికి అడ్డు రాకుండా ప్రేక్షకులకి అదే సంగీత అనుభూతిని అంధించాడు.


బొంబాయి సినిమా వచ్చేసరికి మా కుటుంబం సూళ్ళూరుపేటకి వచ్చేసాం. మనోహర్ థియేటర్లో "అది అరబిక్ కడలందం" పాట చూసి మస్తాన్ అనే మిత్రుడు డాన్స్ స్కూలు ఒకటి తెరిచి దాంట్లో సెట్ అయిపోయాడు. ఆ మధ్యలోనే వచ్చిన అంజలి, దొంగ దొంగ సినిమాలు మిస్ అయ్యి మళ్ళీ నిదానంగా ఎపుడో చూసాను. ఇలా ప్రతి సినిమాలో తనదయిన శైలిలో ప్రేక్షకులకి ఏదో కొత్తదనం, తియ్యదనం అందిస్తూ సినిమాలు తీస్తూనే ఉన్నాడు. మణిరత్నం సినిమా వస్తుంది అంటే కనీసం విజువల్స్ కోసమనా వెళ్ళాలి అని వెళ్తూ ఉంటా.


4 comments:

Praveen Mandangi said...

ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ఇట్లు నిర్వాహకులు

శ్రీ said...

ఈ-మెయిలు కొట్టాను.

Venkat said...

Great memories about Mani Rathnam movies ..I also liked Nayakudu a lot

Venkat Aekka

శ్రీ said...

Thanks Venkat garu