Wednesday, June 8, 2011

రంగం - బాగా కాపీ కొట్టాడు
సోమవారం అనుకుంటా, ఆఫీసు నుండి ఇంటికొచ్చిన తమ్ముడు అండ్రాయిడ్ లో ఏవో పాటలు వింటున్నాడు.

"ఏమి పాటలు రాకేష్" అని అడిగా.

"ఏదో కొత్త సినిమా అంట అన్నయ్యా, పాటలు మస్తు ఉన్నయట! ఇందాకే దోస్తు చెప్పిండు"

పాట వినగానే అవి ఈ మధ్య విడుదల అయిన రంగం సినిమా అని చెప్పా.

నేను యూ ట్యూబులో పాటలు చూడడం మొదలుపెట్టా.

రంగం సినిమా ఇంకా డీవీడీ రాలేదు కాబట్టి తమిళ్ చూద్దామని తయారయ్యాం.

"అన్నయ్యా! నాకు అరం రాదు" అన్నాడు.

"పరవాలేదు! నేను ఉళ్ళా ఈడ! మేనేజ్ చేస్తాలే" అని చెప్పా.

****** ఫ్లాష్ బాక్ ******


పది రోజుల క్రితం సరకుల అంగడిలో మా దోస్తు కనిపిస్తే " ఈమధ్య తెలుగు సినిమాలు ఏవి బాగున్నాయి" అని అడిగా.

"రంగం బాగుందండీ, ఆ సినిమాలో ఇదీ సస్పెన్సు!" అని నాకు చెప్పి నవ్వాడు.

అతని సెన్సాఫ్ హ్యూమర్ కి ఇంక సినిమా చూడాలనిపించలేదు!


****** ఫ్లాష్ బాక్ ******సినిమాలో డైలాగులు అర్ధం కాకపోవడం ఎక్కడా అనిపించలేదు. కథ మీద గ్రిప్ బాగా ఉండి, ఇద్దరం సీట్ అంచులమీద కూర్చుని చూసాం.


"బాగ తీసిండన్నయ్యా" అంటున్న రాకేష్ తో నిజమే, బాగనే ఉళ్ళా! అని నాకు అనిపించింది.

రెండో హీరో సీ.ఎం అయిన తర్వాత సంఘటనలు చూసి "కెవ్వ్" మన్నాడు.

"ఏంది అబయా? అట్ట అరిచినావా?" అన్నా.

"అన్నయ్యా, ఈ సినిమా నాకు తెలుసన్నయ్యా! నేను ఇంతకు ముందు చూసా" అంటున్నాడు.

"నాకు తెలుసు, నువ్వు మళ్ళీ పుడతావురా కాళబైరవా?" అని గట్టిగా అరిచా.

"చీ..చీ, అది కాదన్నయ్యా. నువ్వు కాలాస్త్రిలో ఉన్నపుడు నేను ఇక్కడ ఒక అంగ్రేజీ సినిమా చూసినా. దీని కథ అంతా అట్లే ఉంది, మస్తు కాపీ కొట్టిండు" అని అవేశంతో అరుస్తున్నాడు.

'సినిమా పేరు గుర్తుకు రావడంలేదన్నయ్యా" అని నాకు రెండు,మూడు క్లూస్ ఇచ్చాడు.

నేను ఆ క్లూస్ తో వీకీపీడియా లో చూసి 2009 లో వచ్చిన సినిమా పేరు చెప్పా.

అదే అన్నయ్యా, స్టేట్ ఆఫ్ ప్లే!"  

ఏ సినిమా చూసినా ఏమున్నది గర్వ కారణం! 
మన సినిమాలు సమస్తం పర భాషా కాపీయనం!!
14 comments:

పుట్టపర్తి అనూరాధ said...

కాపీ కొట్టడం అనేది ఇప్పటి మాట కాదండీ..కాకపోతే ఎంత కళాత్మకంగా కాపీ కొట్టాడూ..ఎంత డిఫరెంట్ గా కాపీ కొట్టాడూ..అన్న విషయానికి మార్కులు వేయాలి మనం..

శ్రీ said...

చివరికి మిగిలింది ఇదన్నమాట.

వాస్తవాన్ని నాకు మళ్ళీ గుర్తు చేసినందుకు మీకు నెనర్లు!

కనకాంబరం said...

I accept with Anuradha jee.....sreyobhilaashi Nutakki.(Kanakaambaram.)

శ్రీ said...

మీ కామెంటుకి నెనర్లు!

వనమాలి said...

All the kings men ఇంకో హోలీ వుడ్ క్లాసిక్ ఉంది, దానికి రంగంకి ఏమైనా పోలికలున్నయేమో, రంగం చూసి తేల్చండి.

శ్రీ said...

netflix లో దొరికితే తప్పక చూస్తాను. Sean Penn సినిమా కాబట్టి బాగనే ఉండచ్చేమో చూద్దాం. మీ కామెంటుకి నెనర్లు!

thrill said...

anuradha garu chala baga chepparandi .....

శ్రీ said...

త్రిల్లు గారు, మీరు కూడా పరవాలేదు. బాగనే చెప్పారు.

నాగప్రసాద్ said...

హ హ హ అయితే బాగా కాపీ కొట్టాడు కదా.... ఇంటెల్లిజెంట్ బాయ్.. (బెమ్మీ స్టైల్లో చదువుకోండి) :-))

శ్రీ said...

అవును, బాగా కొట్టాడు. మంచి ఫలితాలు కూడా లభిస్తున్నాయి.

కొత్త పాళీ said...

కాపీ కొడితే కొట్టాడు. ఆ కొట్టేదైనా నీట్ గా కొడితే .. మెచ్చుకోవలసిన పరిస్థితిలో ఉన్నాం.
ఏడాది కిందట రవితేజ శివశంభో చూసి బలైపోయా. మొన్నీమధ్యన ఒక తమిళ మిత్రుడు డిస్క్ ఇస్తే నాడోడికళ్ చూడ్డం మొదలెట్టా. ఒక పదినిమిషాల సినిమా అయ్యేప్పటికి వెలిగింది ఇది అదే సినిమా అని - కానీ ఎంత తేడా వొరిజినల్ కీ, డూప్లికేట్‌కీ!! కాపీకొట్టినా, రీమేక్ చేసినా అదికూడా తిన్నగా చెయ్యరు మనజనాలు.

శ్రీ said...

కాపీ, అవినీతి మనకి అలవాటైపోయాయి. వాటిని బాగా ఆక్సెప్ట్ చేసేంత విశాలహృదయం మనకి కలిగింది.

నాడోడిగల్ నేనూ చూసాను, ఒరిజినల్ కీ, కాపీకి చాలా తేడా.

Praveen Sarma said...

రంగం సినిమా శ్రీకాకుళంలో 80 రోజులు ఆడింది. ఇక్కడ జనం తెలుగు సినిమాలే సరిగా చూడకుండా టివిలకి అతుక్కుపోతారు. అటువంటప్పుడు తమిళ డబ్బింగ్ సినిమా 80 రోజులు ఎలా ఆడిందా అని ఆశ్చర్యపోయాను. నేను సినిమా చూడలేదు కానీ పోస్టర్లు చూస్తోంటే హీరోయిన్ బెల్లీ డాన్సులు చూడడాని వెళ్ళారనిపిస్తోంది.

శ్రీ said...

సినిమా మన నేటివిటీకి బాగా లాక్కొచ్చాడు. ప్రజల టాక్ సినిమాకి టానిక్ అయింది.