నేను అప్పుడు రాపూరులో తొమ్మిదో తరగతి చదువుతున్నా. ఏడో తరగతి తర్వాత పది లోకి చేరేంత వరకు చదువు కొంచెం పక్కన బెట్టి మిగతావాటి మీద బాగా ఆసక్తి చూపిస్తూ ఉండేవాడిని. క్లాసులో ఎక్కువ సేపు కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అందుకే మధ్యమధ్యలో బయటకి వెళ్ళడానికి ఉంటుందని స్కౌటింగ్ లో చేరాను. ఒక రోజు ఇలాగే క్లాసులో బోరుగా ఉంటే నేనూ, నా స్నేహితుడు శేఖర్ ఇద్దరం నీళ్ళు తాగాలని బయటకి వచ్చాం. ఇద్దరం పోటీగా బోరింగ్ పంపు దగ్గరకి చేరుకోవాలని పరిగెత్తాం. ఆ సమయంలో కొందరు స్నేహితులు హై జంప్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. శేఖర్ నాకంటే ముందు పరిగెత్తి హై జంపు లొకి వెళ్ళి దూకేసాడు. నేను అలా దూకేలోగా అక్కడ ఉన్న పిల్లలు నన్ను ఆట పట్టిస్తూ పోల్ పైకెత్తేసారు. నేను గాలిలొకి ఎగిరి పోల్ కి అడ్డం తగిలి కింద ఇసుకలో పడేసరికి కుడి చెయ్యి కలుక్కుమంది.
బస్సులో ఇబ్బంది అవుతుందని నాన్న రాజ్ దూత్ లో నన్ను వెనకాల కూచోపెట్టుకుని మెకానిక్ ఖాదర్ బాషాని తో పాటు నెల్లూరు కి తీసుకు వెళ్ళాడు. అక్కడ పెంచల రెడ్డి, ఎండీ చేసిన ఎముకల డాక్టరు, చాలా జాగ్రత్తగా కట్టు కట్టాడు. ఉదయం బయలుదేరిన వాళ్ళం సాయంత్రానికంతా రాపూరు చేరిపోయాము. కుడి చేతికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో బాండేజ్, క్లాసులో అందరూ నన్ను కొంచెం సానుభూతిగా చూసేవాళ్ళు. సిగ్గుతో ఎపుడూ పలకరించని లక్ష్మీ ప్రసన్న, వెంకట సుబ్బమ్మ ఇలా అమ్మాయిలంతా కూడా ఈ వంకతో పలకరించేవాళ్ళు. ఎడమ చేత్తో రాయడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు. పరీక్షలు కూడా దగ్గరలో లేకపోయేసరికి పెద్దగా ఇబ్బంది పడలేదు.
నెల రోజులయ్యాక కట్టు విప్పుకుందామని మళ్ళీ నెల్లూరు బయలుదేరాం. ఈసారి నేను, నాన్న మాత్రమే రాజ్ దూత్ లో వెళ్ళాం. కట్టు విప్పేసాక నెల్లూరులోనే హాస్టలులో డిగ్రీ చదువుకుంటున్న మా పెద్దక్కని కలిసాం. ముగ్గురం కలిసి రాధా థియేటర్లో చంటబ్బాయ్ సినిమా చూసాం. సితారలో చిరంజీవి ఈ సినిమాకి వేసిన వేషాలన్నిటి గురించి రాసి ఫోటోలు కూడా వేసారు. అవన్నీ చదివి ఈ సినిమాకి వెళ్ళాలని ముందే ప్లాన్ వేసుకున్నా. సినిమా ఎలా ఉంటుందో మీకు నేను కొత్తగా చెప్పక్కరలేదు. ఈ సినిమా షూటింగ్ అపుడు గుంపుగా ఉన్న జనం లోంచి బ్రహ్మానందం చిరంజీవిని చూస్తూ ఉండేవాడట. అపుడు చిరంజీవికి పరిచయమై తరువాత జంధ్యాల సినిమా అహ నా పెళ్ళంటతో బ్రహ్మానందం మనకి వెండి తెర మీద పరిచయమయ్యాడు. వెండి తెర అని ఎందుకు అన్నానంటే బ్రహ్మానందం బుల్లి తెర ద్వారా కొంచెం ముందుగానే "ఆనందో బ్రహ్మ" ద్వారా మనకి పరిచయం కదా!
రాపూరులో ఎపుడూ మా నాన్నతో కలిసి సినిమాలు చూసినట్టు నాకు గుర్తు లేదు. అమ్మ, అక్కలు, చెల్లెలుతో కలిసి నేను ప్రతి సినిమా చూసేవాడిని. నా చిన్నపుడు, అంటే స్కూలుకి వెళ్ళనపుడు నెల్లూరులో బాలాజీ నగరులో ఉండేవాళ్ళం. నాన్నతో ఒక ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళా. ఆ సినిమా నాకు చాలా బాగా గుర్తు. ఆ సినిమాలో హీరోకి కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. అతనికి ఎరుపు రంగు కనిపించిందంటే ఆ పవర్స్ పోతాయ్. ఇలా కామెడీగ ఉంటుంది ఈ సినిమా. ఆ సినిమా పేరు గుర్తు ఉండేది కాదు. గత సంవత్సరం అనుకుంటా, యూ ట్యూబులో ఈ సినిమా కోసం వెతికా. ఆ సినిమా పేరు సూపర్ ఫజ్, 1980 లో ఈ సినిమా విడుదల అయింది. నెట్ ఫ్లిక్సులో ఈ సినిమా తెప్పించుకుని చూసా. భలే సరదాగా ఉంటుంది ఈ సినిమా. ఒక న్యూక్లియార్ మిసైల్ పేలి ఆ పౌడర్ హీరో మీద పడడం, దాని వల్ల ఇతనికి సూపర్ పవర్స్ రావడం జరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడగలరు.
నేను ఇంటరుకి వచ్చేసరికి ఇద్దరం ఒకరికి తెలియకుండా ఒకరం లీలా మహల్ లో ఇంగ్లీషు సినిమాలు చూసేవాళ్ళం. ఒకసారి ఇలాగే షార్ట్ సర్క్యూట్ సినిమాలో కలిసి ఇద్దరం ఒకే రిక్షాలో ఇంటికి వెళ్ళాం. నాన్న సూళ్ళూరుపేటలో పని చేసేటపుడు నేను వాకాడులో చదువుకుంటూ ఉండేవాడిని. స్నేహితులతో కలిసి కోట, గూడూరు, నెల్లూరులో సినిమాలు చూస్తూ ఉండేవాడిని. నాన్న రిటైరయ్యి కాలాస్త్రికి చేరాక నేను ఇటుపక్క గడ్డి పచ్చగా ఉంటుందని అమెరికా చేరాను. అపుడు నాన్న మా మేనల్లుడు సంజుతొ కలిసి కాలాస్త్రిలో సినిమాలు చూసేవాడట.

4 comments:
nice remembrance.
నేను మా నాన్నగారితో కలిసి ఆఖరుగా చూసిన సినిమా యశోదకృష్ణ (మీరు పుట్టి ఉండకపోవచ్చు!)
నెనర్లు కొత్తపాళీ గారు.
పుట్టాను, నేను అప్పటికి పుట్టి మూడు సంవత్సరాలు అయింది. కొంచెం పెద్దయ్యాక ఈ సినిమా చూసా.
నేను నాన్నతో కలిసి సినిమా చూసింది లేదు :((
మీ 'చంటబ్బాయి' కబుర్లు బాగున్నాయి.. ఒకప్పుడు ఈ సినిమా నాకు బాగా నచ్చేది. అయితే ఈటీవీ అనేది మొదలయ్యాక, దాదాపు రోజూ ఏదో వంకన ఇందులో కామెడీ సీన్స్ వేసీ వేసీ ఈ సినిమా అంటే కొంచం విరక్తిలాంటిది వచ్చేలా చేశారు వాళ్ళు..
నేను ఈటీవీ చూడనందుకు నాకు ఇంకా చంటబ్బాయి మీద మంచి ఫీలింగ్సే మిగిలాయి --)
మీ కామెంటుకు నెనర్లు.
Post a Comment