Tuesday, September 27, 2011

పుడింగి - జూ.ఎంటీఆర్ తో శ్రీను వైట్ల తీస్తున్న కొత్త సినిమా



తెలుగు సినిమా చరిత్రలో ఒక పెద్ద సంచలనం అందించిన శ్రీను వైట్ల తన తదుపరి చిత్రం జూ.ఎంటీఆర్ తో చేయాలని నిశ్చయించుకున్నాడు. సరయిన కథ తయారు చేసుకుని అతనికి వినిపించడానికి జూ.ఎంటీఆర్ నివాసం  చేరుకున్నాడు. 

శ్రీను వైట్ల: ఈ సినిమాలో మీ పాత్ర చాలా వెరైటీగా ఉంటుంది, పరవాలేదా?

జూ.ఎంటీఆర్: భలేవాడివే శీనూ, నాకూ వెరైటీనే కావాలి.

శ్రీను వైట్ల: అలాగే! నీ పాత్ర ఇంచుమించు పది రసాలు పోషిస్తాడు. నేను మొన్న మహేష్ కి తొమ్మిదే ఇచ్చా, నీ కోసం చిక్కడపల్లి సెంటర్ నుండి కొత్త రసం తీసుకొచ్చా. అది నువ్వు మాత్రమే చెయ్యగలవు.

జూ.ఎంటీఆర్: సరే, ఇక కథ ఏమిటో చెప్పండి.

కథని పూర్తిగా వినిపించేసాడు శ్రీను వైట్ల.

శ్రీను వైట్ల: ఎలా అనిపిస్తుంది కథ? బాగా కొత్తగా ఉందా?

జూ.ఎంటీఆర్: అబ్బా...సింప్లీ సూపర్! విరగ దీసావ్!! కాకపోతే ఇంతకు ముందు ఇలాంటి కథే విన్నాను. కాదు, కాదు చూసాను. నువ్వు చెప్పిన కథ ఢీ, రెడీ, కింగ్, దూకుడు సినిమాలలాగే ఉంది. నాకు కొత్తగా ఏమీ అనిపించడం లేదు.

శ్రీను వైట్ల:  నేను మహేష్ కి దూకుడు సినిమా కథ చెప్పేటపుడు కూడా అతను ఇలాగే అన్నాడు. సినిమా చూసావా? ఎంత హిట్ అయిందో? నా కథ విన్నాక అతను చెప్పిన డైలాగు సినిమాలో కూడా పెట్టించా. ఇపుడు నువ్వు చెప్పిన డైలాగ్ కూడా మన 'పుడింగి' సినిమాలో పెట్టించేస్తా. 

జూ.ఎంటీఆర్: మన సినిమా దూకుడు కంటే పెద్ద హిట్ అవ్వాలి. తెలుగు సినీ చరిత్రలో మన సినిమా పెద్ద పుడింగిలా మిగిలిపోవాలి.

శ్రీను వైట్ల: సినిమా మొదటి సగం నీకు నచ్చిన కంట్రీలో తీసేస్తా. లేకపోతే నువ్వు ఇంత వరకు ఎపుడూ వెళ్ళని కంట్రీ చెప్పు, అక్కడ మనం షూటింగ్ చేసేసుకుందాం.

జూ.ఎంటీఆర్: నేను ఒకసారి మా ఆవిడని, అత్తయ్యని, మామయ్యని, బాబాయిని ఆడిగి నీకు చెపుతా. 

శ్రీను వైట్ల: నువ్వు శక్తి సినిమాలో పోలీసుగా చేసావు కాబట్టి ఈ సినిమాలో నువ్వు ఒక గూండా దగ్గర పని చేస్తూ ఉంటావు. ఆ గూండా చెల్లెలితో ప్రేమలో పడతావ్. సినిమా చివరలో నువ్వొక అండర్ కవర్ ఐ.ఏ.ఎస్ ఆఫీసరని తెలుస్తుంది. ఇది మన సినిమాలో పెద్ద ట్విస్ట్.

జూ.ఎంటీఆర్: ట్విస్ట్ అదిరింది.

శ్రీను వైట్ల: ఈ డైలాగ్ కూడా సినిమాలో పెడతాను. ట్విస్ట్ అయిపోగానే నువ్వే చెప్పుకుంటావ్! నీకు కామెడీ చెయ్యడం రాదు కాబట్టి మన సినిమాలో బ్రమ్మీ, ఎమ్మెస్ మొదట నుండి చివరిదాకా ఉంటారు.

జూ.ఎంటీఆర్: భరత్ ని కూడా పెట్టుకో.

శ్రీను వైట్ల: వాడు లేకుండా నేను అసలు సినిమా ఎలా తీస్తాననుకున్నావ్?

జూ.ఎంటీఆర్: నాకు చాలా రోజులయింది హిట్ సినిమా వచ్చి, నువ్వు సినిమాని బాగా తీసి నాకు బాగా పేరు వచ్చేటట్టు చెయ్యాలి.

శ్రీను వైట్ల: దూకుడు చూసావ్ కదా, నువ్వు మన సినిమాలో ప్రతి ఫ్రేములో ఉంటావ్. నా సంత ఎలాగూ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు సినిమాని. నా సినిమాలో కథలు ఏమీ ఉండవు, అప్పటికప్పుడు నవ్విచ్చేస్తూ ఉంటా. జనాలకి ఇంత కన్నా ఏమి కావాలి? 

జూ.ఎంటీఆర్: నిజమే! దూకుడు సినిమా చూసి బయటకి వచ్చి కథ గురించి అలోచిస్తే ఏమీ గుర్తు రాలేదు.

శ్రీను వైట్ల: అసలు ఉంటే కదా, నీకూ ఇలాంటిదే ఒకటి తీసి పడేస్తాను.

11 comments:

xyz said...

వినోదం అందించే డైరక్టర్‌ఫై మీరు అందించిన వినోదం చాలా బాగుంది.

శ్రీ said...

థాంక్స్ అండి.

Yaganti Venkateswarlu said...

sooooooooooooooper

Yaganti Venkateswarlu said...
This comment has been removed by the author.
శ్రీ said...

థాంక్స్ వెంకటేశ్వర్లు!

వీరుభొట్ల వెంకట గణేష్ said...

తెలుగు సినిమా మీద మీ సెటైర్ అదిరింది!!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

తీసిందే తీయరా పాచి పళ్ళ దాసరీ. మేం కూడా చూసిందే చూస్తూ ఉంటాం అని ఒకసారి శ్రీను వైట్లతో చెప్పాలని ఉంది.

మహమ్మద్ షఫి said...

meeku ilanti aalochanalu yelavastayokaani...super sir

శ్రీ said...

థాంక్స్ వీరుభొట్ల!

కృష్ణ, బ్లాగులో రాసేయండి.

రసజ్ఞ said...

హహహ వ్యంగ్యాన్ని హాస్యంతో కలిపి పండించారు బాగుందండీ!

శ్రీ said...

థాంక్స్ అండి.