Thursday, October 6, 2011

ఊసరవెల్లి - పెద్ద కాట్రవెల్లి



సురేందర్ రెడ్డి ఇప్పటికి ఒక నాలుగైదు సినిమాలు తీసాడు. మొదటి సినిమా 'అతనొక్కడే' పరవాలేదు అనుకునేలా తీసాడు. జూ తో తీసిన అశోక్ కూడా ఓకే, అతిథి కొంత వరకు బాగనే తీసాడు. ఇక కిక్ సినిమాతో కొంచెం కామెడీ మిక్స్ చేసి ఒక మాదిరి హిట్ చేసాడు. ఇన్ని సినిమాలు చూసాక, నాకు తెలిసి రెడ్డి మీద ఎక్స్పెక్టేషన్స్ ఆంధ్ర దేశంలో ఎవరికీ ఉండవు.

సినిమా మొదటి సగం సరదాగా ఉంటుంది. ఇంటర్వెల్ లో మంచి ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ఇంటర్వెల్ ట్విస్టులు అతనొక్కడే సినిమా నుంచి అలాగే లాక్కొస్తున్నాడు. ఒక మంచి సీన్ పెట్టి సమోసా తినేటపుడు "అబ్బా...ఏముంది మామా, ఆ సీన్" అని మాట్లాడుకోవచ్చు. అంతవరకు ఎంత పులిహారా కలిపినా ఈ ఇంటర్వెల్ సీన్ బాగా డామినేట్ చేస్తుంది.

సురేందర్ రెడ్డికి సెకండ్ హాఫ్ తియ్యడం ఇంతవరకు రాలేదు. అతనొక్కడే సినిమాలో బాగనే పండింది, మొదటి సినిమా కాబట్టి చాలా రోజుల నుండి కథ గురించి అలోచించి ఉండచ్చు. అతిథిలో సెకండ్ హాఫ్ బాడ్, పాడు చేసాడు. కిక్ సినిమాలో కూడా ఇంటర్వెల్ తరువాత పిచ్చి, పిచ్చిగా తీసాడు. ఈ పిచ్చి రవితేజా బాడీ లాంగ్వేజికి సూట్ అయ్యింది కాబట్టి దానికి వర్క్ అవుట్ అయింది. ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బాక్ మనం ఊహించినట్టే పుచ్చింది.

జూ మన రెడ్డిని అడిగాడేమో "భయ్యా, నా నరుకుడు సెక్షన్ సినిమాలో పెట్టు భయ్యా" అని. సింహాద్రిలోలా కత్తి ఇవ్వకుండా రెడ్డి ఈతూరి (అంటే ఈసారి, అది మా చిత్తూరు యాస)  సుత్తి ఇచ్చాడు. నరసింహుడులో కూడా జూ సుత్తి పట్టుకుని మనుషుల్ని చంపుతాడు. జూకి కత్తి వర్క్ అవుట్ అయింది కానీ సుత్తి వర్క్ అవుట్ అవడం లేదు. తెలుగు సినిమాలో బాగా నరకడం చూపించేవాడు రాజమౌళి మాత్రమే! రాజమౌళి మనల్ని ఎమోషనల్ గా ప్రిపేర్ చేస్తాడు, సురేందర్ కి ఇంకా అలా తియ్యటం రాలేదు. నరికేటపుడు పాట నాకు నచ్చలేదు, కీరవాణి అయి ఉంటే ఏదోదో వాయించి మనల్ని బుజ్జగించేవాడు. మళ్ళీ చాలా రోజుల తర్వాత స్కార్పియోలు ఎగిరాయి, ఈమధ్య తెలుగు సినిమాలో ఇలా ఎగరడం లేదు అనుకున్నా. 

తమన్నా ఈ సినిమాలో ఎప్పటిలాగే మబ్బుగా (ఈ మాట తిరుపతిలో ఎక్కువగా అంటూ ఉంటారు) నటించింది. ఈ పిల్ల ఇంక హైదరాబాదుకు రావడం అనవసరం, ఇల్లు ఖాళీ చేసి చెన్నైలోనే ఉండచ్చు. ఎందుకు ఇక్కడ అనవసరంగా బాడుగ దండగ, ఊరికే అటూ, ఇటు తిరగడం ఎందుకు? తమిళ్ వాళ్ళయితే పాటలకి బాగా వాడుకుంటారు, ఏదో ఒకటి వర్క్ అవుట్ అవుతుంది ఆమెకి.


జూ కోసం ఈ సినిమా ఒకసారి ఖచ్చితంగా చూడచ్చు. అతిథి సినిమాలో లాగే ఫ్లాష్ బాక్ పక్కన పెట్టి చూస్తే సినిమా ఒకే అనిపిస్తుంది. కామెడీ మీద అబ్బాయ్ చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు, ఈ సినిమాలో నాకు పరవాలేదు అనిపించాడు. నేను అలవాటు పడిపోయానేమో! సినిమాలో ఇంక పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.


దసరాకి ఇంక పెద్ద సినిమా వేరేది లేదు కాబట్టి శ్రీరామరాజ్యం వచ్చేంత వరకూ దూకుడు డబ్బులు పిండుకోవచ్చు. ఈ సినిమా చూసి ఇంటికి వచ్చేటపుడు దారిలో అలోచనలో పడ్డాను. అలోచనలు సంతృప్తిగా సాగాయి, వచ్చే టపాలో వాటిని మనం చదువుకుందాం. 

12 comments:

రసజ్ఞ said...

ఇప్పుడే ఇంటికి వస్తూ అనుకున్నా ఎంటబ్బా ఈ సినిమా టాక్ అని! వచ్చి చూసేసరికి ఇక్కడ మీరు ఏకంగా చూసి టపా కూడా రాసేసారు. అయితే చుడక్కర్లేదనమాట సినిమా!

శ్రీ said...

ఒకసారి చూడచ్చు.

Aravind said...

First half bagane undi..second half worst..avg mve..okasari chudavacchu..

శ్రీ said...

Exactly! I had the same feeling.

శశి కళ said...

poneele..sree...jr ni batikinchaaru
okkasari choodamani...kada vraayalede.....koncham vraayakoodadaa?

శశి కళ said...
This comment has been removed by the author.
రవి said...

టికెట్లు దొరికితే చూస్తా. దూకుడు సినిమా బ్లాకులో చూసి వదిలించుకున్నా. (ఇక్కడ బ్లాకైనా బెంగళూరులో సగంకంటే తక్కువే) ఈ సారి ఆ రిక్సు చేయను.

గీతాచార్య said...

If he could have opted for straight narration, it would have become more better movie. Wrong placement did this film harm. But NTR rocks

గీతాచార్య said...

జూ మన రెడ్డిని అడిగాడేమో "భయ్యా, నా నరుకుడు సెక్షన్ సినిమాలో పెట్టు భయ్యా"

Zoo adige sariki Zoozoo cheseshaadu Reddy garu

శ్రీ said...

@శశికళ, మన సినిమాలలో కథ చెప్పుకోవడం ఎందుకని రాయలేదు.

@రవి, తొందర ఏమీ లేదు, నిదానంగా టిక్కెట్టు దొరికాక చూడండి.

@గీతాచార్య, సురేందర్ ఎపుడూ అంతేనండీ! జూ తప్పు లేదు, అతను బాగా చేసాడు.

@గీతాచార్య, జూ రొటీన్ సీన్ సరిగ్గా తీలేకపోయాడు.

R said...

Day wage laborers havent worked for a single day in the past one month. They dont want biryani or burgers..they just want to feed themselves and their kids..and are waiting for a day when they can merely work…and we, who have everything are really worried about whose movies are breaking records. Have we become so callous, so cold that it does not bother us at all any more?

I will tell you whats breaking a record. A guy who sells vegetables near dilshuknagar, had to take 300 rupees, from a microfinance company, because his cart was pushed aside and broken, by agitators. And the record is..since he couldnt repay the 300 in 2 weeks, he has to come up with 500 in the next 2 weeks…isnt that a record? Oh yeah..all this while we are busy discussing Dhukudu and Oosaravelli

-R

http://apivr.blogspot.com/

శ్రీ said...

ప్రస్తుతం ఈ టపా ఉద్దేశం ఊసరవెళ్ళి సినిమా గురించి. నేను మైక్రో ఫైనాన్స్ గురించి రాద్దామనుకున్నపుడు అలాగే చేద్దాం.