Sunday, December 11, 2011

పంజా - పులిది కాదు, పిల్లిది!


నేను ఇంటరు చదివే రోజుల్లో మొదటి సంవత్సరం చంద్రారెడ్డి & శ్రీనివాసులు రెడ్డి కోచింగ్ సెంటరులో ట్యూషన్ కి వెళ్ళేవాడిని. రెండో సంవత్సరం కీలకం కాబట్టి కోరాలో చేరాను. మా క్లాసులో అందరూ ఫస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చదివారనమాట. నేను, ఇంక కొంతమంది ఆశాజీవులు మాత్రం కోరాలో చేరాం. ప్రతి వారమో లేక నెలకో మాకు పరీక్షలు పెడుతుండేవాళ్ళు. రాజగోపాలాచారి అని మా మేష్టారు ఆర్గానిక్ కెమిస్ట్రీ విరగ చెబుతుండేవాడు. నాకు కూడా ఈ కెమిస్ట్రీ బాగా నచ్చేది. 

నాకెందుకో పరీక్షలంటే పెద్ద ఇష్టముండేది కాదు. అసలు మూడ్ వచ్చేది కాదు, మూడ్ వచ్చాక పరీక్షలు రాస్తే బాగుండేదేమో?  నేను చాలా క్రియేటివ్ అని మీకు తెలుసు కదా! అందరి లాగా కాకుండా సమాధానాలు కూడా కొంచెం కొత్తగా ఉండాలని తహతహ లాడేవాడిని. నా క్రియేటివిటీని సమాజం హర్షించేది కాదు. మేష్టారు కూడా సమాజంలో ఉండే ఒక జీవే కదా!

ఒక రోజు ఉదయం అందరికీ మార్కులు చెప్తూ నన్ను నిలబెట్టాడు.


"ఈ పిలకాయ్ ఏదో వూడబొడుస్తాడని మన కాడ చేరాడు. ఇట్టాంటి మార్కులు మనం యాడా చూడలేదు." అని యాష్ట బోయాడు.


"ఎహే..ఈనెప్పుడూ ఇంతే" అని ఆయన్ని నేను ప్రతి సారి లాగే లైట్ తీసుకున్నా. ఆరోజు అతని మాటలు నాకు అప్పుడు అర్థం కాలేదు. నిన్న పంజా సినిమా చూసాక మా మేష్టారే గుర్తుకు వచ్చాడు.


మన దగ్గర ఉన్న దర్శకులు కాకుండా విష్ణువర్ధన్ ఏదో ఊడబెరకతాడని తీసుకు వస్తే మన తెలుగు సినిమానే మళ్ళీ మనకి చూపించి భలే కామెడీ చేసాడు. 


అసలు రివ్యూ రాసేముందు విష్ణు, పవన్ మధ్య స్టొరీ డిస్కషన్ రాద్దామనుకున్నా, నా బ్లాగు మరీ తెలుగు సినిమాలాగా రొటీన్ అయిపోతుందని ఆ అవిడియాని తొక్కేసా.



మద్రాస్ సెంట్రలులో దిగి ఆటో మాట్లాడామనుకోండి, మనం తెలుగు వాళ్ళమని తెలిస్తే మనకి అవసరం లేకున్నా మద్రాస్ అంతా చూపించేస్తారు. వంద రూపాయల ట్రిప్పుకి ఆయిదు వందలు గుంజేస్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే "నా ఆటోవాడి హాట్ మెమొరీస్" అని పెద్ద పుస్తకమే అచ్చు వెయ్యచ్చు.


అసలీ తమిళ్ వాళ్ళున్నరే, తరతరాలుగా మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు.


అయినా మన బంగారం బాగుంటే వాళ్ళనీ, వీళ్ళనీ నానా మాటలు అనాల్సిన పని లేదు కదా!


ఆదివారం అనుబంధాలలో కొన్ని పజిల్స్ ఉంటాయి. రెండు బొమ్మలని పక్క, పక్కన పెట్టి ఆ రెండింటిలో ఒక అయిదు తేడాలు ఉన్నాయి. వాటిని మీరు గుర్తు పెట్టండి అని ఉంటాయి. అలాగే పంజా సినిమాని, బాలూ సినిమాని పక్క, పక్కన పెట్టి ఈ రెండింటిలో లేని అయిదు తేడాలని మీరు వెతకండి అంటే మన జుట్టు మనం పీకేసుకుని పవన్ కళ్యాణ్ గడ్డం పీకినా పజిల్ సాల్వ్ అవదు.


శని దేవుడు ఏడు సంవత్సరాల వరకూ ఉంటాడు. పవన్ కి కూడా జల్సా సినిమా ముందు ఏడు సినిమాలు ఫట్టయ్యాయి. ఈ సినిమాని కూడా ఆ లెక్కలో వేసుకుని, ఏడో సినిమా వరకూ మనకీ సినిమా కష్టాలు తప్పవు. ఈ లెక్కన మన తెలంగాణా స్టార్ నితిన్ ని ఎవరు పట్టుకున్నారో? ఎన్ని ఫ్లాపులయినా బ్రదర్ కి హిట్టు లేదు.


మీరు బాలు సినిమా చూడకపోతే ఈ సినిమాకి వెళ్ళండి. చూసి ఉంటే ఆ మచ్చలు చెరిపేసుకుని వెళ్ళండి, లేకపోతే వెళ్ళబాకండి.


ఫాన్స్ మాత్రం పాపం, మరో రెండు వారాలు టంకు వేసుకుని సైలెంట్ అయిపోవచ్చు. 


"అబ్బో...సినిమా బ్రమ్మాండం" అని యూనిట్ సక్సెస్ ట్రిప్ వేసుకుని విష్ణుకి ఆంధ్ర చూపించచ్చు.



13 comments:

రసజ్ఞ said...

hahaha

శ్రీ said...

థాంక్స్ రసజ్ఞ

Bhãskar Rãmarãju said...

విష్ణు కూడకా తెలుగోడేబ్బా!!

SRAVAN BABU said...

నీలాంటి మోహ‌న్ బాబు ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ మీద ఆ మాత్రం క‌సి ఉండ‌టం న్యాయ‌మేలే అబ్బాయా!

వీరుభొట్ల వెంకట గణేష్ said...

___________________________________
మన దగ్గర ఉన్న దర్శకులు కాకుండా విష్ణువర్ధన్ ఏదో ఊడబెరకతాడని తీసుకు వస్తే మన తెలుగు సినిమానే మళ్ళీ మనకి చూపించి భలే కామెడీ చేసాడు.
___________________________________

I completely agree :-)

Unknown said...

Mahesh
Pavan Panja ki Gollu Levu levani Bhaga Cheppavanna

శ్రీ said...

@ భాస్కర్ రామరాజు, అవునా?

@ తేజస్వి, మోహన్ బాబు ఫానా? నేనా? ఎలా..ఎలా. ఎల ఎలా...?

@ వీరూ భొట్ల, థాంక్స్

@ మహేష్, థాంక్స్

@ సుబ్బు, అసభ్యంగా రాసినందుకు కామెంటు తొలగించడమయినది.

Kottapali said...

నిన్న టీవీలో పవన్ పాత సినిమా ఏదో వచ్చింది. చూసినంతసేపూ ఆశ్చర్యపడుతూనే ఉన్నా, ఇతగాడు హీరో ఎలాగయ్యాడా, ఇతనికి ఇంతమంది పంకాలు ఏంటా అని.

Rama Prasad said...

Fawan Fans Chooste mee meedaku panjaa visradamu khaayam !

శ్రీ said...

@కొత్తపాళీ గారికి, ఏమిటోనండి! సగం, నా గారాబం వళ్ళే అతగాడు అలా తయారయ్యాడు.

@ రాం ప్రసాద్, మాష్టారూ, ఉదయాన్నే ఒక ఫాన్ బండ బూతులు తిట్టాడు. వాటిని తుడిపేసా!

Anonymous said...

పవన్ కి కూడా అభిమానులా ? అనడిగితే చెప్పడానికి చాల యవ్వారముంది.

సినీ కథానాయకుల పట్ల అభిమానానికి దురదృష్టవశాత్తూ ఈమధ్య ఒక కొత్త (చెత్త) కోణం జతయింది. అది కళాభిమానం కాదు. కులాభిమానం. ఈ "నవతరం" అభిమానుల్ని చూస్తూంటే, మా చిన్నప్పుడు మేము మా కులం కానటువంటి నటీనటుల్ని ఎలా వేలంవెఱ్ఱిగా అభిమానించామా ? అని మా గుఱించి మాకే ఆశ్చర్యం వేస్తుంది.

HKP said...

శ్రీ గారు-
ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పేది రాజగోపాల రెడ్డి గారు కదా ? ఆయన టీచింగ్ నాకు అప్పట్లో కొత్తగా వుండేది . "బోర్డు మీద ఈక్వేషన్ రాసిన తరువాత తలెత్తకుండా నోట్స్ లో రాసుకోవటం" లాంటివి ! మా వేంకటగిరి ఆర్.వి. యం హైస్కూల్ లో బోర్డు మీద వున్నది వున్నట్టు రాసుకోవాలి మఱి! నోట్స్ లో వున్నది వున్నట్టు రాస్తేనే మార్కులు!

మీరు కోరా కి వెళ్ళేటప్పుడు అది టేక్కేమిట్ట లోనే ఉండేదా?. అప్పట్లో వినయబాబు ఐవోరు పక్కన బిల్డింగ్ చూపించి "ఇక్కడే కళ్యాణ్, మా తమ్ముడు వాళ్ళు రూం తీసుకొని వుండేవాళ్ళు " అనేవాడు. అందువల్ల అప్పటి నుంచి నాకు కూడా కళ్యాణ్ బాబు అంటే ముదిగారం..జాస్తి !

-హరికిషన్

శ్రీ said...

అవును తాడేపల్లి గారు. ఏమిటో పిచ్చి జనం!

హరికిషన్, రెడ్డే ఏమో! మనకి గుర్తు లేదు. మన రాజా గారి స్కూలులో చదివారనమాట! వెంకటగిరి ఒక తమాషా ఊరు.

కస్తూరి బాయి కాలేజీకి ఎదురుగా ఉండేది, అప్పట్లో రేకులు! తర్వాత పెద్ద బిల్డింగులు లేపారు.

కళ్యాణ్ బాబు ఎవరు?

ముదిగారం - మన నెల్లూరు మాట, హాయిగా ఉంది.

అబ్బయీ చంద్ర! నీ ఆటో ముచ్చట్లు బాగున్నాయి. నీకెవరో బాషా లాంటి డ్రైవరు దొరికినట్టున్నాడు.

ఈసారి కామెంటు తెలుగులో రాయడానికి ప్రయత్నించు. లేఖిని (www.lekhini.org)వాడు, బాగుంటుంది.