Monday, June 18, 2012

తెలుగువాడి (రెడ్డి) ఆత్మ గౌరవంకొన్ని దశాబ్దాల క్రిందట నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గుండె నొప్పి చికిత్సకి అమెరికాకి వెళ్ళడం, ఈలోపల కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడి నాదెండ్ల భాస్కర రావుని గద్దెనెక్కించడం మీకందరికీ గుర్తు  ఉండే ఉంటుంది.  చికిత్స అనంతరం అన్నగారు తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ ప్రజల లోకి వచ్చి మళ్ళీ ఎన్నికలలో గెలవడం జరిగింది. ఆనాడు దక్కిన తెలుగు వాడి ఆత్మ గౌరవం మళ్ళీ ఈనాడు దక్కిందని నా అభిప్రాయం. కాకపోతే ఈసారి అది ఒక సామాజిక వర్గానికే పరిమితమయింది.


2009 ఎన్నికల ఫలితాలప్పుడు కాంగ్రెస్  ఎలా సీట్లని ఊడ్చిందో ఇపుడు కూడా అలాగే ఊడ్చింది.  ఎన్నికల ముందు వరకు రాజశేఖరుడి అవినీతి గురించి అందరికీ తెలిసేటట్టు మీడియా అందరి చెవుల్లో తుప్పు రేగేట్టు చెప్పింది. అయినా, శేఖరుడే మళ్ళీ గెలిచాడు. అవినీతే ఆయన్ని మళ్ళీ గెలిపించిందా? లేక అతను అందించిన పధకాలే అతన్ని గెలిపించాయా?  అపుడు ఎన్నికలలో నీతికి కట్టుబడి ఉన్న (ఉంటాడేమో) దేవుడేచంద్రబాబు నాయుడు ఎందుకు గెలవలేదు?


రాజశేఖరుడు పైకి తీసుకువచ్చిన నాయకులందరూ హాయిగా పదవినట్టే పెట్టుకుని మొన్నటివరకు ఆయనే మా దేవుడని నెత్తిన పెట్టుకున్నారు.  ప్రజలందరికీ అర్ధమయిన అవినీతి ఢిల్లీకి చేరేసరికి మూడు సంవత్సరాలు పట్టింది, అది కూడా తమాషాగా ఉప ఎన్నికల  ముందే అవడం కాకా-తాళీయం.


2009 లో ఎన్నికల ఫలితాల ముందు రాజశేఖరుడు రెండవసారి గెలవడేమో అనుకున్నా. అలాగే ఈసారి కూడా జగన్ పార్టీ ఇన్ని సీట్లు గెలుచుకుంటుందని కూడా నేను ఊహించలేదు. ఏదో తల్లి, బిడ్డ న్యాయం అన్నట్టు అన్ని పార్టీలూ కొన్ని, కొన్ని సీట్లు గెలుచుకుంటాయేమోనని అందరిలాగే అభిప్రాయపడ్డాను.


అవినీతి కేసుల్లో కటకటాల వెనకాల ఉన్న జగన్ కి ప్రజలెందుకు వోటేసారు? జగన్ నీతిపరుడనా? సానుభూతి పవనాలే ఈ విజయానికి కారణమా? సానుభూతి పవనాలని సృష్టించిందెవరు? హై కమాండా? అసలు దొంగని పట్టుకున్నారు కదా? పోలీసులకే వోటు ఎందుకు వెయ్యలేదు? అవినీతి అని మసి పూసారు కదా? నీతిగా ఉంటారు కదా అని మిగిలిన పార్టీలకి ఎందుకు వోటు వెయ్యలేదు? విజయమ్మ అన్నట్టు ఆ దేవుడే ఈ విజయానికి కారణమా?

5 comments:

Anonymous said...

బాబు నీతికి కట్టుబడి ఉన్నాడా? రెండెకరాల ఆసామి మొన్న ఉప ఎన్నికలలో 200 కోట్లు ఎలా ఖర్చు పెట్టాడు చెప్మా ? కళ్ళు ఆర్పకుండా అబద్దాలు చెప్పేవాళ్ళు ఉంటారు అని వినటమే కానీ బ్లాగు లోకం లో ఇప్పుడే చూస్తున్నాను ..

Anonymous said...

మీరు గమనించాల్సింది ఏమిటంటే డ్రామా కంపనీ పార్టీ లకి జనాలు వోట్లు వేసే రోజులు పోయినవి, చిరంజీవి అయిన ,తెలుగు దేశం అయిన షెడ్ కి పోవడమే. మామూలు ప్రజలని ఈ ఫలితాలు పెద్ద ఆశ్చర్య పరచలేదు. వాళ్లకి ముందే తెలుసు ,మీరు జనాల నాడి పట్టలేక పోయారు అంతే..

Anonymous said...

అవినీతి అందరూ ఓ లెవెల్లో చేశారు. అయితే అవినీతి కష్టాలు జైల్లో స్వయంగా అనుభవించిన ఈయన దానికో రాజ్యాంగబద్ధత కల్పిస్తాడనే ఆశాభావం, ప్రజల్లో చైతన్యం తెచ్చిందనుకోవచ్చు. Snkr :P

Anonymous said...

ఏమయా కాళాస్త్రీ, ఇవాళేమో బాబు నీతికి కట్టుబడి ఉన్నాడని అంటున్నావు, రెడ్లమీద విరుచుకుపడున్నావ్. మొన్నేమో మెగా పిలకాయలు కోతిమూక అన్నావు...దీనిని బట్టి నువ్వేంటో మాకు కమ్మగా అర్థమయిందిలే.

Sujata said...

జగనన్న వస్తే దోచుకుంటే కొంటాడు గానీ మన మొహాన ఏదొ ఒకటి కొట్టే తీరతాడు అనే నమ్మకం జనానికి కలిగింది. జగన్ గెలవడానికి కారణం ఏదో ఒకటి, కొత్త పధకమో, ఏదో, మొదలు పెడతాడనే ఆశ. 108 లకి పెట్రోలు లేదని, 104 లు ఎత్తేసారనీ వీటన్నిటికీ, కాంగ్రేసే కారణమనీ బాగా హైలైట్ చేసారు వై.కా.పా వాళ్ళు. ఇదే కారణం అనుకుంటా.