Thursday, July 5, 2012

మనం పుట్టిన రోజు ఎలా చేసుకోవాలి? - జొన్నవిత్తుల గారి సందేశం




గత వారం నాటా సభల్లో శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు మాట్లాడుతూ తెలుగు వాళ్ళు పుట్టిన రోజు ఎలా చేసుకోవాలో చెప్పారు. మీతో ఆ సందేశం ఇక్కడ పంచుకుంటాను.

ప్రస్తుతం మనం పుట్టిన రోజు ఎలా జరిపిస్తున్నాం?  కేకు మీద  కొన్ని కొవ్వొత్తులు వెలిగించి వాటిని ఆర్పి 'హాపీ బర్త్ డే' పాట పాడుకుని కేకు తినేస్తాం.  భారతీయ సంప్రదాయం ప్రకారం దీపాలు ఆర్పకూడదు. అందుకే మనం ఇంట్లో పూజలు చేసుకున్నా హారతి కొండెక్కాలే కానీ, మనం ఎపుడూ ఆర్పం. ఈ జన్మలో మనం దీపలు ఆర్పితే వచ్చే జన్మలో మనం గుడ్డివాళ్ళుగా పుడతారని మన పురాణాలు చెపుతున్నాయని జొన్నవిత్తుల గారు అన్నారు.

కాబట్టి మనం పుట్టిన రోజు చేసుకున్నా,  పిల్లలకి చేపించినా కొవ్వొత్తులు ఆర్పకూడదు. మీకు ఎన్ని సంవత్సరాలు నిండాయో అన్ని కొవ్వొత్తులతో అఖండ జ్యోతిని వెలిగించండి. ఈ సందేశాన్ని మనందరికీ తెలియజేయాలని జొన్నవిత్తుల గారు "పెళ్ళం పిచ్చోడు" సినిమాలో ఒక సన్నివేశం ద్వారా చెప్పారు. ఈ సినిమా 2005 లో విడుదల అయింది, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాకి ఉత్తమ తెలుగు సినిమా అవార్డుని ఇచ్చి సత్కరించింది. భారీ తారాగణం లేదు కాబట్టి మనం ఈ సినిమాని ఆదరించలేకపోయాం. ఈ సినిమా తెలుగు వన్ ద్వారా యూ ట్యూబులో ఉంది, వీలయితే చూడండి.

మీరందరూ కూడా పైన చెప్పినట్టు మన భారతీయ సంప్రదాయం ప్రకారం పుట్టిన రోజు జరుపుకోండి, జరిపించండి.


No comments: