ఉత్తర
టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య
వేదిక సమర్పించిన "నెల
నెలా తెలుగు వెన్నెల"
76 వ
సదస్సు శనివారం, నవంబరు
23 వ
తేది India Association of North Texas
కార్యాలయములో
సాహిత్యవేదిక
సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి
శారద గారి అధ్యక్షతన
నిర్వహించబడినది. ప్రవాసంలో
నిరాటంకంగా 76 నెలల
పాటు ఉత్తమ సాహితీ వేత్తల
నడుమ సాహిత్య సదస్సులు
నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డాల్లస్
ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ
ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత
ఆసక్తితో ఈ సమావేశానికి
విచ్చేసారు.
సాహిత్య
వేదిక సమన్వయకర్త శ్రీమతి
సింగిరెడ్డి శారద తమ
స్వాగాతోపన్యాసంలో ప్రతి
నెలాజరపు కొనే నెల నెలా తెలుగు
వెన్నెల కార్యక్రమానికి
అందరికీ స్వాగతం తెలిపారు.
సంగీత
గారు తెలుగు భాష గొప్పదనం
గురించి తెలియజేస్తూ చంద్రబోస్
గారు రాసిన పాటను పాడి
కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
శ్రీమతి
బాల తృపుర సుందరి గారు గణపతి
వందనం ప్రార్ధన చేసారు.అన్నమయ్య
కీర్తనలలోని సాహిత్యాన్ని
గురించి యుగంధర స్వామిగారు
అందరికీ వివరించారు.
మద్దుకూరి
చంద్రహాస్ గారు పదం,
పాట
గురించి నాలుగు మాటలు సభికులతో
పంచుకున్నారు.డా.జువ్వాది
రమణ గారు ఆపద్భాందవుడు చిత్రములో
బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన
పద్యం చక్కగా పాడి వినిపించారు.
శ్రీ
బసాబత్తిన గారు ప్రముఖ రచయిత
శ్రీ కొడవటిగంటి కుటుంబరావు
గారు రచించిన “పట్నవాసం”
కథాసంపుటిని
సభకు పరిచయం చేశారు.
చాలా
సంవత్సరాల క్రితం పల్లె నుండి
పట్నానికి వెళ్ళిపోయిన
చెల్లెలుని వెతుక్కుంటూ
వెళ్ళిన అన్న ఎలుక కథని అందరికీ
పరిచయం చేసారు.
పల్లెకూ,
పట్నానికి
ఉన్న తేడాలను ఎలుక ద్వారా
రచయిత సరదాగ చెప్పించారని
అన్నారు.
మాసానికో
మహనీయుడు భాగం లో నవంబరు
నెలలో కీర్తిశేషులయిన
త్రిపురనేని గోపీచంద్ ను
గుర్తుకు చేసుకున్నారు.భారతీయ భాషలలో అంత్యాక్షరి బాగా ప్రాచుర్యం పొందింది. ఒక అక్షరం తో కీర్తనలు పాడే "అధ్యాక్షరి" సంప్రదాయాన్ని శ్రీ పిస్కా సత్యనారాయణ గారు మొదలుపెట్టారు. సత్యనారాయణ
గారు
సభికులు
అడిగిన అక్షరంతో
అన్నమయ్య, త్యాగరాజు, భద్రాచల
రామదాసు, జయదేవుడు మరియూ క్షేత్రయ్య
కీర్తనలు పాడి అందరినీ
అలరించారు.
శ్రీమతి
కడిమిశెట్టి పూజిత అన్నమయ్య
కీర్తనలను చక్కగా పాడి
వినిపించారు. పున్నం సతీశ్ గారు కార్యక్రమాన్ని చక్కగా చిత్రీకరించి యూ ట్యూబులో పెట్టారు.
ముఖ్య
అతిథిని ప్రసంగానంతరం జ్ఞాపికతో,
శాలువాతో
టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు
శ్రీ కాకర్ల విజయమోహన్,
ఉపాధ్యక్షుడు
శ్రీ ఉరిమిండి నరసింహా రెడ్డి
గారు మరియు కార్యదర్శి శ్రీ
జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం
గారు సంయుక్తంగా సత్కరించారు.
టాంటెక్స్
కార్యదర్శి శ్రీ జొన్నలగడ్డ
సుబ్రహ్మణ్యం,
కార్యవర్గ
సభ్యులు శ్రీ వీర్ణపు
చినసత్యం, శ్రీ
చామకూర బాల్కి ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు
సాహిత్య వేదిక కార్యవర్గ
బృందం వందన సమర్పణ చేస్తూ"నెల
నెలా తెలుగు వెన్నెల"
76 వ
సదస్సులో ముఖ్య ప్రసంగం చేసిన
శ్రీ పిస్క
సత్యనారాయణ గారికి
కృతఙ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమానికి
విచ్చేసిన వివిధ సాహితీ
ప్రియులకు, ప్రసార
మాధ్యమాలైన టీవీ5
లకు
కృతఙ్ఞతా పూర్వక అభివందనములు
తెలియజేసారు.
కృతజ్ఞతలు: పోటోల సహకారం: శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు. వీడియోల సహకారం: శ్రీ పున్నం సతీశ్
No comments:
Post a Comment