Monday, January 11, 2016

పెళ్ళి పుస్తకం - 1


జనవరి 11వ తేది అంటే నాకు ఒక చేదు జ్ఞాపకం. నిండుగా ఉన్న పెళ్ళి పుస్తకంలో ఇంకా పేజీలు ఉన్నా మోడయిన రోజు. పూర్ణ చంద్రుడిని రాహుకేతువులు గుటకాయస్వాహా చేసిన రోజు.


అపుడెపుడో చిన్నపుడు చదివిన మేర్లపాక మురళిగారి నవలలో లాగా "మచ్చల పాము అమాయకమైన లేత కప్పని ఆకలితో చప్పరించినలాంటి రోజు"! కాలకేయులు చూడ ముచ్చటగా ఉన్న మాహిష్మతి సామ్రాజ్యంపై దండెత్తినలాంటి రోజు. మళ్ళీ ఆ చేదు నిజం గుటక వేసే రోజు!


పసివాడి ప్రాణం సినిమాలో చిరంజీవి కొత్త వాళ్ళకి "మీకు నవంబర్ 18 ఏమి జరిగిందో తెలుసా?" అని అంటూ ఉంటాడు. జనవరి 11 అంటే నాకు అలాంటిది అనమాట!


ఏమిటో ఆరోజు ఆకాశం విరిగి కింద పడలేదు. భూమి బద్దలవుతుందనుకున్నా, కానీ అవలేదు. ప్రపంచమే ఆగిపోతుందనుకున్నా. అది కూడా జరగలేదు. ముందు రోజు బాంబు దాడులు జరిగినా ఏమీ పట్టనట్టు మళ్ళీ రైళ్ళెక్కి పని కోసం వెళ్ళిన ముంబై వాసులులాగా అందరూ ఎవరి పనిలో వాళ్ళున్నారు.


నిజమే! చట్టం తన పని చేసుకుపోతున్నట్టు కాలచక్రం కూడా తన దారిన దొర్లుకు పోతుంది.


కొత్త సంవత్సరం తెచ్చే ఆనందం కంటే మళ్ళీ 11వ తేది ఎదురవుతుందన్న ఆందోళన నాలో ఎక్కువ. ఆ జ్ఞాపకాలకి ఈసంవత్సరంతో పన్నెండేళ్ళు నిండాయి. అతడు సినిమాలో నాజర్ చనిపోయిన తన కొడుకు గురించి ఒక మాట అంటాడు. వాడు పోయి చాలా సంవత్సారాలయినా ఇంకా మర్చిపోలేదని " మర్చిపోవడానికి అదేమన్న చిన్న విషయమా? చెట్టంత జ్ఞాపకం" అని అంటాడు.


యాదే సినిమాలో ఒక మంచి పాట ఉంటుంది.


"మాటలు మర్చిపోతాము
జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి
ఈ జ్ఞాపకాలు, ప్రియురాలు వెళ్ళిపోయాక
తిరిగి వస్తాయి!"


చివరగా మా సూళ్ళూరుపేటలో పుట్టిన మనసు కవి ఆత్రేయ గారి పాట కూడా ఒకసారి చూద్దాం.

పోయినోళ్ళందరూ మంచోళ్ళు...
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు!మళ్ళీ కలిసేంతవరకూ ఈ విరహాన్ని భరించాల్సిందే...2 comments:

bathi said...

మనసు చెమర్చింది.......
మనసు ఙ్నాపకాలు మన సు ఙ్నాపకాలు.......
అనుకున్నామని జరగవు అన్నీ....
అనుకోలేదని ఆగవు కొన్ని.....
జరిగేవన్నీ మంచికనీ.....
అనుకోవడమే మనిషి....మనసు పనీ......

Unknown said...

ఫేస్బుక్ గ్రూప్ : https://www.facebook.com/groups/telugubloggeradda

తెలుగు బ్లాగర్ కోసం చేయబడిన " బ్లాగర్ అడ్డా " మన తెలుగు బ్లాగర్ అందరిని ఒకదగ్గర చేసే ప్రయత్నం .. ఈ గ్రూప్ లో జాయిన్ మీరు బాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం ... ఈ గ్రూప్ లో బ్లాగు రాసేవారికి సలహాలు , సూచనలు , బ్లాగు ని అందం గా తయారు చేసుకోవడానికి సలహాలు , సూచనలు ... ఉత్తమ బ్లాగు ని ఎంపిక చేయడం ... అన్ని విషయాలు ఈ గ్రూప్ లో చర్చించుకొందాం ... మీ స్నేహితులకు బ్లాగు ఉన్నా ... ఈ గ్రూప్ లో వారి పేరు మరియు బ్లాగు లింక్ వేయడం మరిచిపోవద్దు ...

https://www.facebook.com/groups/telugubloggeradda