నా చిన్నప్పటినుండి వింటూ ఉన్నానీమాట,ఇప్పటికి కుదిరింది.నెల్లూరు దగ్గర మైపాడు సాగరతీరం చాలా సుందరమయిన ప్రదేశం.కృష్ణపట్నం పోర్టు రావడం వల్ల ఇక్కడ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కుడా బాగా వస్తాయి. కృష్ణపట్నం అనగానే మేము చిన్నపుడు దీనికి దగ్గరలోని మైపాడు కి వెళ్ళిన సంగతి గుర్తొస్తుంది. నా జీవితంలో మొట్ట మొదటసారి సముద్రం చూసింది ఇక్కడే!
నేను ఇంటరు నెల్లూరు సర్వోదయా కాలేజ్ లో ఇంటరు చదువుతున్న రోజుల్లో నా పాత స్నేహితులు రాయవరపు కోటేశ్వర్ రావు,చిలకా శ్రీధర్ రెడ్డి కలిసి వెళ్ళాం! కోటేశ్వరరావు(ఇతన్ని కోటీ అని పిలుస్తాము)వాళ్ళ నాన్న మైపాడుకి దగ్గరలో విలేజ్ అసిస్టెంటుగా పని చేసారు ఇంతకు ముందు.కోటీ వాళ్ళ నాన్న కోటీ చదువుల కోసం నెల్లూరు మూలాపేట కి వచ్చేసారు. శ్రీధర్,నేను కుడా రాపూరు నుండి చదువుల కోసం నెల్లూరు వచ్చి మేము మూలాపేటలో,వాళ్ళు ఫతేఖాన్ పేటలో ఉండేవాళ్ళం. అపుడు ఎండాకాలం సెలవులు అనమాట,అందరం వరికుంటపాడు వెళ్దామని కోటి అన్నాడు.అలాగే అని అందరం ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకుని మరుసటిరోజు బయలుదేరాం!నేను,శ్రీధర్ వెంకటరమణ హోటెల్ కి వెళ్ళి "సింగపూర్ పరోటా" పార్శిల్ కట్టించుకుని ఆత్మకూర్ బస్స్టాండ్ వెళ్ళి మైపాడు బస్ ఎక్కాం.నెల్లూరు నుండి ఒక గంట ప్రయాణం అనుకుంటా,మధాహ్నం సమయంలో వరికుంటపాడు దిగాం.కోటి కి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం.వాళ్ళ ఇంటికి వెనకవైపునే సముద్రం!అక్కడ టీ తాగి సముద్రం వైపు పరిగెత్తాం!సముద్రం దగ్గరవుతన్నంత సేపూ విపరీతమయిన శబ్దం,దూరంలో గోధుమ వర్ణంలో ఇసుక,దాని చివర ఉరకలేస్తూ నురగలు కక్కుతున్న బ్రమ్హాండమయిన సముద్రం! అలా పరిగెడుతూ సముద్రం లోకి దూకేసాం అందరం.వచ్చే అలతో పాటూ రావడం,మళ్ళీ అలతో పాటూ తిరిగి వెళ్ళడం ఇలా సరదాగా ఆడుకున్నాం నేనూ,కోటి,శ్రీధర్.మా ముగ్గురికీ ఈత రాదు,అందుకని ఒడ్డుకి దగ్గరలోనే ఉండి సముద్రంతో ఆ రోజు గడిపాం. సూర్యాస్తమయం వరకు ఉండి సముద్రానికి వీడుకోలు చెప్పి నెల్లూరికి బయలుదేరాం.
6 comments:
నేనూ వేళ్లేను స్నేహితులతో కలిసి నెల్లూరు నుంచి సైకిలు మీద. మధ్యలో తమలపాకు తోటలు కూడా వస్తాయని జ్ఞాపకం.ఆ ప్రాంతాన్ని "నవలాకు తోట" అంటారనుకుంటాను.
మిత్రమా. వ్యాసమంతా మైపాడు గురించి రాసి హెడ్డింగ్ కృష్ణపట్నం అని పెడ్తే ఎలా? కృష్ణపట్నం గురించి నేను రాసిన వ్యాసాలు దిగువన ఇస్తున్నా. ఆసక్తికలవారు చూడవచ్చును.
నా నెల్లూరు పర్యటన -6
నా నెల్లూరు పర్యటన -7
Mee kotta Templete baavundi. mee papa mee xerox copy ne ! acchu meelane undi. :D
చిన్నమయ్య గారికి, నేను నవలాకుల తోట గురించి విన్నాను,ఇపుడు అది స్మశానం అనుకుంటా!
సీబీరావు గారికి,మీ వ్యాసం ఎపుడో చదివేసా!మీ నెల్లూరు పర్యటన చాలా వివరంగా రాసారు!మీరు నా టపా చదివినందుకు ధన్యుణ్ణి!మీరు నేలపట్టు గురించి కుడా రాసినట్టున్నారు,నేను సుళ్ళూరుపేటలో ఉన్నపుడు చాలా సార్లు చూసాను.అది కుడా ఇంకొక టపా లో రాస్తాను.
సుజాత గారికి, థాంక్స్ సుజాత గారు!కొంతమంది మా అమ్మాయి మా ఆవిడ లాగా కుడా ఉందని అంటారు!
హ్హ మీది నెల్లూరే, మాది నెల్లూరే
హ్హే మనది నెల్లూరే..
మిత్రమా,
మా తాతయ్యా వాళ్ళు మైపాడు పక్కనే ఉన్నా కొరుటూరులో ఉండే వాళ్లు. చిన్నప్పుడు అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఉదయాన్నే 4 గం" కళ్ళ లేచి సూర్యోదయం కల్లా మైపాడు బీచ్ ని చేరుకొనే వాళ్ళం.
అక్కడ నిజంగా సూర్యోదయం ఎంత బావుండేదో. మళ్లీ ఇంటికి రావడానికి మనసొప్పేది కాదు. అక్కడ ఏరుకున్న గవ్వలు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అవన్నీ నిజంగా మరచిపోలేని జ్ఞాపకాలు నాకు.
హె హే హెహ్హే!నా టపా మీ పాత జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు సంతోషం!నేను మైపాడు తర్వాత సముద్రం చూసింది తూపిలి పాళెంలో!,ఇది వాకాడు దగ్గర ఉంటుంది.
Post a Comment