Tuesday, August 19, 2008

చిరంజీవి రాజకీయరంగ ప్రవేశ ప్రకటన


హమ్మయ్యా! ఇన్నాల్టికి చిరంజీవి నోరు విప్పాడు.ఇంతవరకు సమ్యమనం పాటించమన్న అభిమానులందరికీ ఇది నిజంగా ఒక శుభవార్త.గత కొద్ది రోజులముందు ప్రారంభించిన పార్టీ కార్యాలయం,26న తిరుపతిలో జరగబోతున్న బహిరంగ సభ గురించి మీడియా కానీ,చిరంజీవి అభిమానులు కానీ విపరీతంగా మాట్లాడుకోవడం మీకందరికీ తెలిసిందే!వీటన్నిటికీ తెర దించి ఆదివారం జరిగిన ప్రెస్ మీట్ లో తను రాజకీయరంగ ప్రవేశానికి కారణభూతులయిన పరిస్థితులని వివరించాడు. అబ్దుల్ కలాం,స్వర్గీయ నందమూరి తారక రామారావు తనను ఎలా ప్రభావితం చేసారో చెప్పదం జరిగింది.విలేకరులు అడిగిన సున్నిత స్వభావం,పొలిటికల్ వాక్యూం,లెఫ్టిస్ట్ ప్రశ్నలకి బాగా సమధానమిచ్చాడు.



ఈ ప్రెస్ మీట్ జరిగిన వేదిక మీద అంబేద్కర్,గాంధి,మదర్ థెరెసా పక్కన ఒకాయన,ఎవరబ్బా..ఇతను అని మా ఆవిడ అడిగితే లాలా లజపతి రాయ్ ఏమో అని చెప్పా.తర్వాత చిరంజీవి మాటల్లో చెప్పాడు ఇతను "మహాత్మ జ్యొతి రావు ఫూలే" అని.ఇతనెవరబ్బా అని గూగుల్ లో వెతికితే మంచి వివరాలు దొర్కాయి.ఫూలే మహరాష్ట్రలో అంటరానితనం పోగొట్టడం,మహిళలకు చదువు చెప్పడం వంటి మరెన్నో విషయాలలో బాగా కృషి చేసాడట.అందుకే ఇతన్ని "మహాత్మ" అని మంచి గౌరవం కుడా లభించింది.ఇతన్ని ఆదర్శంగా తీసుకుని చిరు మంచి మార్కులే కొట్టాడు నా దగ్గర!




మొత్తానికీ ఆంధ్రరాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వాతావరణం ఏర్పడబోతున్నది.ఒక రకంగా చూస్తే ఇది మన రాష్ట్రానికి సుభ పరిణామం.ఎందుకంటే స్వర్గీయ ఎంటీఆర్ రాజకీయాలలోకి వచ్చినపుడు అంతకు ముందు ప్రభుత్వం కాంగ్రెస్ కంటే కొన్ని మంచి పనులే చేసాడు/చేయవలసి వచ్చింది.ఇలా కొత్త పార్టీలు వాళ్ళ ఉనికిని కాపాడుకొనేటపుడు ప్రజలకి కొంత మంచి జరుగుతూ ఉంటుంది.అలాగే చిరంజీవికి కుడా అధికారం వస్తే కొన్ని మంచి పధకాలు అమలులొకి వచ్చే అవకాశం ఉంది.




ప్రస్తుతం వై యెస్ పాలనలో వర్షాలు సక్రమంగా పడుతున్నాయి,ఇది రైతుల వోట్లు పొందడానికి మంచి అవకాశం.కాకపొతే రైతులు ఇప్పుడూ ఎరువుల విషయంలో కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు.ఎమ్మెల్యేలు,కార్యకర్తలకి చేతి ఖర్చులు ముట్టి బాగా సంతోషంగా ఉన్నారు.వచ్చే ఎన్నికలలో బాగా ఖర్చు పెట్టే స్థోమత అధికారవర్గానికి ఉంది.ఎటొచ్చీ తెలుగుదేశానికి పెద్ద దెబ్బ తగలనుంది,పార్టీ నుండి దూకేసిన అభ్యర్దులతో బాబు ఇప్పుడు కంగారు పడుతున్నాడు.రామారావు లాగా సుడిగాలి పర్యటనలు చేసినా చిరంజీవికి 70-80 పైన సీట్లు రావడం చాలా కష్టం.సగటు వోటరుని చిరంజీవి ఎంత వరకు ఆకర్షిస్తాడో వేచి చూస్తే కానీ తెలియదు.

12 comments:

Unknown said...

ఏమాటకు ఆ అమాట పాపం చిరంజీవి నోట్లో నాలుక లేని వాడు. అసలెందుకు అతనికి ఈ రాజకీయాలు

srinivasrjy said...

చిరంజీవి రాజకీయాల్లో రాణించడం ఖష్టం...

Anonymous said...

చిరంజీవి రాజకీయాల్లో రాణించడం ఖష్టం...

శ్రీ said...

అశ్విన్ గారు,ఒక రాజకీయనాయకుడిగా కష్టం కానీ ఒక ప్రజా సేవకుడిగా రాణించగలడని నా నమ్మకం!

sundth,anonymous...వేచి చూద్దాం.

-- said...

rajakeeyam & praja seva - They are mutually exclusive ;)

--Cine Valley

Anil Dasari said...

కాంగిరేసోళ్లకన్నా వేరే ఎవరధికారంలోకొచ్చినా కొంత నయంగానే పని చేస్తారు. అందరూ తినేవాళ్లే అనుకోండి. కాంగిరేసోళ్లైతే అదనంగా పార్టీ ఫండు కోసం ఢిల్లీకి కూడా నెల నెలా మూటలు పంపాలి కదా. ప్రాంతీయ పార్టీలైతే ఆ ఖర్చు మిగుల్చుకుని రాష్ట్రంలో ఎన్నో కొన్ని పనులు చేసే ఛాన్సుంది. సిరంజీవొస్తే కొత్తలో కొన్ని మంచి పనుల్జేసే అవకాశం ఎక్కువుంది. పాతబడ్డాక ఈయనా ఆ తాను ముక్కే అవుతాడు. కానీ ఈయన గెలిచే అవకాశముందా? ఎవడికీ పూర్తి మెజారిటీ రాకుండా చేసే అవకాశం మాత్రం చాలా ఉన్నట్లుంది.

శ్రీ said...

అవును సినీవాల్లీ.చిరంజీవి ప్రజాసేవకుడిగా అందరికీ పరిచయమే!రాజకీయాల్లోకి వచ్చాక ఎంతవరకు ప్రజాసేవకుడిగా ఉంటాడో వేచి చూస్తే కానీ తెలియదు.

బాగా చెప్పారు అబ్రకదబ్ర గారు.ఎవరికీ మెజారిటీ రాదు అనేదానితో నేనూ ఎకీభవిస్తున్నాను.

Bhasker said...

అబ్రకదబ్ర గారు చెప్పింది విన్న తర్వాత నాకు ఒక ఉపమానం తోస్తుంది.
నేను ఇంజనీరింగు చదివే రొజుల్లో కుర్నూల్ లో స్టుడెంట్స్ కోసమని కొత్త కొత్త మెస్సులు వచ్చేవి. మెస్సు స్టార్టైన కొత్తలొ చాల అయిటంలతొ పాటు ఫ్రీగా ఎగ్గు, నెయ్యి పెత్తెవ్వలు. నీటు గా మయింటైన్ చెసేవాళ్ళు. ఒక మూడు నెలలు తిరిగే సరికి సద్ది కూరలు పడెసెవాళ్ళు. చిరు కొత్త ప్రభుత్వం కూడ అలాగే అయ్యే అవకాశాలు ఉన్నయి.

శ్రీ said...

భాస్కర్ గారు,
నేను వాకాడులో చదివినపుడు అక్కడకూడా 3,4 కొత్త మెస్సులు వచ్చాయి.2,3 మెస్సులు కొన్ని రోజుల తర్వాత మాములు మెస్సులుగా మిగిలిపోయాయి.మిగిలిన మెస్సులు కొత్తదనాన్ని కొనసాగించి ప్రమాణాలను పెంచాయి.

మోడ్రన్ చందమామ కథలు said...

sri garu..meeru chiranjeevi ki Media manager ga baaga workout avuthaaru anipisthundhi...political leader ga raaninchaleni vaadu asalu Prajaa nayakudu kaaledu...seva cheyataaniki rajakeyaalu yendhuku?

శ్రీ said...

మంచి ప్రశ్న వేసారు మనోజ్ గారు.సేవ చేయటానికి రాజకీయాల్లోకి రాక్కరలేదు,కానీ పాలసీలు మార్చాలంటే అధికారం అవసరం.

మోడ్రన్ చందమామ కథలు said...

No Mr.Sri.. i dont agree with what u said. Did u ever heard about ANNA HAZARAY, LOKNAYAK JAYA PRAKASH NARAYANA, Periyar Ramaswami,.... all the above said three personalities were prominent Leadres who worked for the people , Lead the people and used the Mass movements to persuade the Governments to change its policies according to the People's wish. I think you cant deny that Chiranjeevi dont know about this.Because he is been using the other prominent leaders names like Jyothiba Pulay, Mother theresa and Gandhi..whom they never participated in Power sharing Politics.