Saturday, October 4, 2008

చేనేత కార్మికులు - ఒక పరిశీలన

సిరిసిల్లలో చేనేత కార్మికుల వరుస ఆత్మహత్యల సందర్భంగా ఇక్కడ కొంచెం బ్లాగుతాను.

ఈమధ్య సిరిసిల్లలో ఎక్కువగా చేనేత కార్మికులు పనులు లేక,చేసే పనులు గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఆత్మహత్యతో గానీ, ఆకలి చావులతో గానీ మరణించిన వారి సంఖ్య 500 కి దాటింది. ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని సంవత్సారాలుగా మధ్య తరగతి జీవితాల జీవన ప్రమాణాలు మారాయి. చేతిలో బాగా డబ్బులు ఉండడం, ఆధునిక జీవన శైలికి అలవాటుపడుతూ ఉన్న ఈ రోజుల్లో సగటు చేనేత కార్మికుడి జీవితం ఎందుకిలా ఉందో ఒకసారి చూద్దాం!



సగటు చేనేత కార్మికుడు ఒక చీర మగ్గం మీద నెయ్యాలంటే 2,3 రోజులు పడుతుంది. ఈ చీర సగటు ధర 200 రూపాయలు, దీనిని మిగిలిన కూలీలతో పంచుకుంటే చీర నేసినతనికి 100 రూపాయలు, సహాయం చేసిన మిగతా ఇద్దరికీ మిగిలిన 100 రూపాయలు. ఈ లెక్కన అతను ఒక నెలకి 10 చీరలు నేసాడనుకుందాం, అంటే ఇతని నెల ఆదాయం 1000 రూపాయలు! ఇతనికి ఒక పెళ్ళం, ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి! అంటే ఈ వెయ్యి రూపాయల మీద నలుగురైదుగురు బతకాలనమాట!



రాష్ట్రంలో ఒక్క సిరిసిల్లలోనే చేనేత కార్మికులున్నారా? వెంకటగిరి, ధర్మవరం, పొద్దుటూరు, నారాయణవరం, శ్రీకాళహస్తి, మంగళగిరి ఇలా వివిధ ప్రాంతల్లో స్థిరపడిన చేనేత కార్మికులు మంచి చీరల వ్యాపారాలు చేస్తూ మంచి జీవితాన్నే కొనసాగిస్తున్నారు. మామూలుగా చీరల వ్యాపారులు తమకి కావలసిన చీరల వివరాలు తమకి అలవాటయిన "మాస్టర్ వీవర్" కి ఇస్తారు. ఈ మాస్టర్ వీవర్ అంటే మంచి పనితనం ఉన్న నేతగాడనమాట. ఇతను తన కింద కొంత మంది నేతగాళ్ళని పెట్టుకుని వాళ్ళ పనికి తగ్గ జీతం ఇస్తూ ఉంటాడనమాట. పండగ సీజన్లలో వీళ్ళకి బాగా పని ఉంటుంది, మాములు రోజుల్లో కొంచెం ఇబ్బందే! వెంకటగిరి, ధర్మవరం, పొద్దుటూరు , మంగళగిరి మరియు కాలాస్త్రి ప్రాంతాల్లో ఇటువంటి ఒప్పందాలు చీరల వ్యాపారులు, నేతగాళ్ళ మధ్య జరుగుతూ ఉంటాయి.



కొన్ని దశాబ్దాల ముందు మిల్లులు బాగా పుట్టుకొచ్చి మర మగ్గాలు వాడుకలోకి వచ్చినపుడు ఈ నేతగాళ్ళ పరిస్థితి దుర్భరంగా మారింది. యంత్రాలు వాడుకలోకి వచ్చినపుడు ఇటువంటి పరిస్థితి అన్ని చేతి వృత్తి పని వాళ్ళకి ఎదురయింది. మరమగ్గాల మీద కొన్ని ప్రత్యేకమయిన చీరలు నేయలేము, ఈ అవకాశాన్ని నేతగాళ్ళు వాడుకుని తమ ప్రత్యేకతని నిలుపుకున్నారు.




ఈ చేతి వృత్తి పనులు మనకి స్వాతంత్ర్యం ముందు వరకు బాగా ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే అపుడు మనకి చదువుకోవడానికి తగిన సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. స్వాతంత్ర్యం తరువాత చదువు మీద అవగాహన పెరగడం, దానికి తగిన సదుపాయాలు మెరుగుపడుతూ ఉండడం జరిగాయి. ఆర్ధికంగా కొంచెం ఫరవాలేదు అన్న కులవృత్తుల కుటుంబాల నుండి పిల్లలు చదువుకోవడం మొదలుపెట్టారు. ఇలా చదువుకున్న తరం కులవృత్తుల నుండి దూరమవడం మొదలుపెట్టింది. మరి కొంత మంది వ్యాపారాల్లో స్థిరపడి మంచి పేరు సంపాదించారు. ఇక చదువు అబ్బని వారు, తమ వృత్తి మీద నమ్మకం పోనివారు, చదువుకొనడానికి తగిన స్థోమత లేనివారు తమ కులవృత్తిలో కొనసాగారు. గిట్టుబాటు అవని ఈ కులవృత్తుల నుండి ప్రజలు బయటపడి వేరే రంగాల్లో జీవనోపాథి వెతుక్కోవడం మంచిదని నా ఉద్దేశ్యం.

6 comments:

Vamshi Pulluri said...

Congratulations (for maintaining the blog). I am new to the culture of blogs.

I have strong openions on your blog related to sirisilla. (can you read the following in "telugu" dilect, written in English)

Maarpu sahajam antaru. adhi kontha mandhike. Kaani kontha mondhiki adhi kruthikan, inkonthamandhiki vikrutham. gatha padhi savancharalalo India, maarpu nu ahvaninchi, prapancha medialo, forums lo, potilalo pramukyatha penchukundhi. Kaani vismarinchina vishayam, india lo enthamandhiki adhi avasaram, enthamandhi ki adhi anavasaram,

Siricilla ni, warangal shayampet, chirala inka manaki teliyani chaalchotla weevers paristhithi dharunam. veetini meeranna varitho polchalemu. endhukante avi appatike brand name sampachinchukoni, kontha mandhi private chethullo vellipoyayi. sare, meeranattu varu kalanugunanga maarali. Ela marali, varilki vere skill ledhe. Vandhala savnacharala culture ( janmindharu, rythu, shavukaru, vadrangi, kammari, kummari, chenetha, jalari ...) intha sudden ga ela marali. Marali sare, Solutions evi, sadhanalu evi.

Siftware rangamulo jobs pothunnayi. Adhi pedda vaartha. Kaani gatha rendu dashabdhalalo entha mandhi "uthpathi rangam lo" upadhi kolpayaru. Konni savancharalu oka factory lo panichesina vyakthi, retire kaboye time lo emi nerchukogaladu, ela maragaladu. varantha emayipoyaru. Vadrangulu, kammarivallu enthamandhi pani leka pasthuluntunnaru. velu kadhu, lakshalalo. Chduvukunnavaru, muppayi, nalabhayi vayusulo unnavaru margalaru, kotha skills nerchukogalaru. Kaani exposure leni varu, nalabhyi, yabhay, aravayi dhatina vaaru, mana kosam vachina marpu ku samdhaluga migulutharu.

Meeru rasina blog, meeku gala samajika konanni chupisthundhi. koncham angle marchi alochinchandi.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

చేనేతవారి పట్ల మీ concern కి నెనర్లు. కానీ కులవృత్తుల్ని వదిలిపెట్టడం దేనికీ పరిష్కారం కాదు. గతానుభవ రీత్యా అది సరికొత్త సమస్యలకి నాంది పలుకుతుంది. మన దేశపు నిరుద్యోగానికి సగం కారణం - అందఱూ తమ తమ కులవృత్తుల్ని వదిలిపెట్టి ఇంగ్లీషు చదువులోకి దూకడం.

వాటికి ప్రభుత్వం చట్టపరంగాను., ఆర్థికంగాను రక్షణ కల్పించాలి. ’చట్టపరంగ” అంటే - వారి సాంప్రదాయిక ఉత్పత్తుల్ని ఇతరులెవరూ యంత్రాల సహాయంతో తయారు చెయ్యకుండాను, అమ్మకుండాను, బయటినుంచి దిగుమతి చెయ్యకుండాను నిషేధం విధించాలి. ఇందునిమిత్తం సాంప్రదాయిక వృత్తికళల (పరిరక్షణ) చట్టం ఒకటి తేవాలి.

ఆర్థికంగా అంటే - వారికి తక్కువ వడ్డితో ఋణాలు, తేలికగా ముడిసరుకుల లభ్యత, వారి ఉత్పత్తులకి దేశీయంగా విపణింపు (మార్కెటింగ్) సదుపాయాలు ఏర్పఱచాలి. వృత్తికారులకి ప్రభుత్వమే ఇళ్ళు కట్టించి ఇవ్వాలి.

ఇవేవీ చెయ్యని ప్రభుత్వాల్ని, వాటి బాధ్యతారాహిత్యాన్ని క్షమించి వృత్తుల్ని మాత్రమే తప్పుపట్టడం సరికాదు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

వంశీగారు తెలుగులో రాయడానికి లేఖినిని ఉపయోగించండి.

Vamshi Pulluri said...

సుబ్రమణ్యం గారు, మీకు ముందుగా థాంక్స్, లేఖిని ని పరిచయం చేసినందుకు. గాంధీ గారి గ్రామస్వరాజ్యం అనే కాన్సెప్ట్ ఒక పెద్ద ఎకానామిక్ సిదాంతము.మన దేశనికి అది హచితంగా మిగితా అన్ని సిదాంతాల కన్న (మర్క్స్, గ్లోబలైజేసన్ ) అనువైనది.

Vamshi Pulluri said...
This comment has been removed by the author.
శ్రీ said...

ఈ టపా రాసినపుడు కామెంట్లు లేవు. ఇపుడు పాత టపాలు ఒకసారి చూస్తూ మీ కామెంటల్ను ఇపుడే చూసాను. ఆలస్యానికి మన్నించండి.

@ వంశీ,కాలంతో పాటూ మనం మారకపోతే మనుగడ లేదు.వెంకటగిరి,ధర్మవరం లాంటి చోట్ల కూడా కొంతమంది చేనేత కార్మికులకి రోజు గడవడం కష్టం!ఊర్లోకి ట్రాక్టర్లు,ఆధునిక పనిముట్లు వచ్చి వడ్రంగికి పనులు తగ్గాయి.

కుల వృత్తులు చేసుకోలేకపోతే వాటి నుండి బయటపడి చదువుకుని ఎదో ఒక ఉద్యోగం కానీ,వ్యాపారం కానీ చేసుకోవడమే మార్గమని నేననుకుంటున్నాను.

@ తాడేపల్లి గారు, ప్రభుత్వం చేనేత వారి కోసం ఆప్కో పెట్టింది. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఒక కారణం ఆప్కో సరిగ్గా పనిచేయకపోవడమే!

వృత్తి విద్యలు కూడా గిట్టుబాటు కాకపోతే మానేయాలి. తమిళనాడులో తిరుప్పూరు చూడండి, ఈ చిన్న ఊరు నుండి కొన్ని వందల దేశాలకు బట్టలు ఎగుమతి చేస్తారు. ఇక్కడ పని చేసేవారు చేనేత కులం వారు కాదు కూడా. తమిళనాడు తిరుప్పూరుకి బాగా సహాయం కూడా చేస్తుందనుకోండి.