భీమ్రావ్వాడలో నివసిస్తున్న ప్రజలందరూ ఇంచుమించు 100 సంవత్సరాల నుండీ ఉంటున్నారట.ప్రభుత్వం వీళ్ళందరికీ ఎక్కడో ఇల్లు కట్టించామని చెప్తున్నారు,అలా అయితే ఈ వాడలో ఉంటున్న ప్రజలందరినీ తట్టా,బుట్టతో సహా కొత్త ప్రదేశానికి తరలించి ఉంటే ఎంతో మర్యాదగా,సమర్ధంగా ఉండేది.అర్ధరాత్రి 12 గంటలనుండి మొదలయిన ఇళ్ళ నేలమట్టం కోర్టు తలుపులు తెరుచుకునేలోపల పకడ్బందీగా ముగించారు.అసలు కార్యం ముగిసాక కోర్టు కుడా స్టే ఇచ్చిందట! ఇంకేం చేసుకోను ఈ స్టే?
పీజేఆర్ బ్రతికున్నంతకాలం ఈ వాడని ప్రభుత్వం ఖాళీ చెయ్యకుండా అడ్డుకున్నాడని ఇక్కడి ప్రజలంటున్నారు.పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి ఆ అధికారం,రాజకీయానుభవం లేక చేతులెత్తేసినట్టున్నాడు.ఈమాత్రం దానికి ఇతన్ని సానుభూతితో గెలిపించింది ఎందుకో?
ఎన్నికల ముందు ప్రతిపక్షాలకి ఇదొక సదవకాశం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుమ్మేసుకోండి!
4 comments:
గరీబ్ కా మకాన్ హటావో
కాంగ్రెస్ కా దుకాన్ బనావో (నా హిందీ కరెక్టా ? :)
ఇది పేదల ప్రభుత్వం మరి !!! పేదల పార్టీ అయిన కాంగ్రెస్ మరి పేదల స్థలంలో కాక ఇంకెక్కడ కట్టాలి ఇందిర భవన్ చెప్పండి.
కరెక్ట్ గా చెప్పారు.
కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతుంది అనే నిర్ణయానికి వై ఎస్ రాజశేఖర రెడ్డి వచ్చేసి ఉంటాడు... అధికారంలో ఉండగానే అన్నీ సమకూర్చుకునే ప్రయత్నంలో పడ్డట్టుంది...ఎలాగైనా సరే..!
మీరనేదే నిజమయితే మనం చాలా అదృష్టవంతులం!
Post a Comment