కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా రెండవ సారి గెలవ లేదు. రెండవసారి నిలబడడానికి ప్రతిసారీ అసమ్మతి వర్గం అడ్డొచ్చేది. అన్ని రికార్డులు బద్దలు చేస్తూ రాజశేఖర రెడ్డి రెండవసారి బరిలోకి దిగేసాడు. చాలా తెలివిగా తనకి అడ్డు వచ్చిన అసమ్మతివర్గాలని లూప్ లైనులో పెట్టాడు. కొంతమందికి అదీ దక్కలేదు పాపం. ఈ ఎన్నికలలో కొన్ని నియోజక వర్గాలని కలిపి మంచి పని చేసారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాకి చెందిన రాపూరు నియోజక వర్గం వెంకటగిరిలో కలిసింది. ఇప్పటికి రెండు సార్లు గెలిచిన నేదురుమల్లి సతీమణి మూడవసారి మళ్ళీ పోటీ చేస్తుంది. రాపూరు, వెంకటగిరి మధ్యలో ఉన్న 27 కి.మీ రోడ్డుని మొన్నటివరకు బాగు చేయడానికి ఇద్దరు రాజకీయనాయకులకి కమీషన్ ఇవ్వడం కుదరక గుంతలమయంలో ఉంది. ఇపుడు ఆ అయోమయం లేదు, ఒక్క కమీషన్ తో రోడ్ ని బాగు చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక అద్భుతమయిన విజయం !
తెలుగుదేశం విషయానికి వస్తే నాయకులంతా సైకిల్ దిగి రైలెక్కారు. బాబు, చంద్ర బాబే కానీ మహేష్ బాబు కాదని ముందే గ్రహించినట్టున్నాడు. ఒక్కడితో పని కాదని గుంపుని వెనకేసుకుని బరిలోకి దిగాడు. బాబుకి ఉన్న నాయకత్వ మెలకువలు అందరితో పంచుకుని యూ ట్యూబులో పెడితే యువతకి ఎంతో మేలు జరుగుతుందని నా ఆశ. తాను తొక్కిన కుటుంబాన్నే తన కోసం వాడుకుంటున్న అపర చాణక్యుడు బాబు! చివరకి జూనియర్ ఎన్.టీ.యార్ కూడా బస్ వేసుకుని తిరిగాడు.అతనికి స్నేహితుడికి ఇస్తానన్న సీటుని ఇచ్చాడో, లేదో జూనియర్ కే తెలియాలి. పోయిన సారి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన కే.సీ.ఆర్ ఈసారి బాబుతో చేతులు కలిపాడు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి, అందుకే ఈసారి కొడుకు, కూతురు ని కూడా ఎన్నికలలోకి లాక్కొచ్చాడు. ఈసారి ఎన్నికలలో కే.సీ.ఆర్ బాబుని వదిలి ప్రజారాజ్యంలో చేరినా నాకు పెద్ద ఆశ్చర్యం కలగదు !
ఈసారి ఎన్నికలతో బరిలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి సామాజిక న్యాయం స్లోగన్ తో మన ముందుకు వచ్చాడు. తమ మొదటి టిక్కెట్టు నెల్లూరు జిల్లాకి చెందిన ఒక సాధారణ దళిత మహిళ తుపాకుల మణెమ్మకి ఇవ్వడం నన్ను నిజంగా కదిలించింది. ఇప్పటికే రెండు అగ్ర పార్టీలు ఉన్న మన రాష్ట్రంలో మూడవది ప్రజలకి అవసరమా, లేక చిరంజీవికి అవసరమా ? అన్న ప్రశ్నకి సమాధానం మనకి తొందరలోనే దొరకనుంది. కీర్తిశేషులు ఎన్.టీ.రామారావు రాజకీయాల్లోకి వచ్చినపుడు అప్పటికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. రెడ్డి రాజుల నాయకత్వాన్ని సవాల్ చేస్తూ దరిమిలా తన సామాజిక వర్గాన్ని ప్రమోట్ చేయడంలో రామారావు గారు కృతకృత్యులయ్యారు. రాయలసీమ, తెలంగాణా లో పెద్ద మార్పేమీ తీసుకురాలేక పోయింది తెలుగుడేశం పార్టీ. తమ ఆధిపత్యాన్ని ఆంధ్రా వరకే పరిమితం చేసింది. ఇపుడు కొత్తగా వెలిసిన ప్రజారాజ్యం పార్టీ కూడా ఇదే బాటలో వెళ్తూ తన సామాజిక వర్గానికి బలపరుచుకోబోతుంది. ప్రజారాజ్యం కూడా ఆంధ్రాకే పరిమితం కావడం తెలుగుదేశం దురదృష్టం. ఈసారి ఎన్నికలలోకి లోక్ సత్తా కూడా నిలబడడం ఒక విశేషం. ఆశయాలు బాగున్నా ఒక కులం వారినే దగ్గరికి తీయడం ఇతని మనుగడని ప్రశ్నిస్తుంది.
ఈ ఎన్నికలలో నాకు కొత్తగా పరిచయమయిన పార్టీ "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా". ఇది సహజంగా ఒక ధ్యాన కేంద్రానికి చెందిన సంస్థ. ఎన్నికలలో నిలబడి తద్వారా ధ్యానాన్ని ప్రజలకి గుర్తు చేద్దామని ఇంచుమించు అన్ని స్ధానాలకు వీరు పోటీ చేస్తున్నారు. వీరు 1999 ఎన్నికలనుండి ఇలా పోటీ చేస్తున్నారని తెలిసి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నికలలో గెలిస్తే ఏం చేస్తారో? అసలు వీరు గెలవడానికి అవకాశం ఉందో, లేదో చూడాలి?
కాళహస్తిలో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.వీ.సీ.నాయుడుకే టిక్కెట్టు దొరికింది. కాళహస్తిలో ఒక సారి గెలిచిన అభ్యర్ధి ఇంకొక సారి గెలవడం చాలా అరుదు. గత ఎన్నికలలో ఓడిపోయిన తెలుగుదేశం అభ్యర్ధి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కొత్తగా పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ సరి అయిన బీ.సీ నాయకుడికోసం వెతికి వెతికి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కి టిక్కెట్టిచ్చారు. తిరుపతిలో యూరాలజిష్టయిన సుబ్రహ్మణ్యం కాళహస్తి వాసులని ఎంతగా ప్రభావితం చేస్తాడో చూడాలి. ఇక లోక్ సత్తా ఇక్కడ పోటీ చేస్తుందో, లేదో నాకు తెలీదు.
***** ఫ్లాష్ న్యూస్ ***** ***** ఫ్లాష్ న్యూస్ ***** ***** ఫ్లాష్ న్యూస్ ***** *****
ఇపుడే గూగుల్ లో వెతికితే శైలేంద్ర కొలకలూరి లోక్ సత్తా తరపున పోటీ చేస్తున్నాడని తెలిసింది. తిరుపతిలో ఎం.సీ.ఏ చేసిన ఈ సాఫ్ట్ వేరు ఇంజినీరు ఎన్నికల బరిలో దిగడం నిజంగా హర్షణీయం. ప్రతిసారీ ఇద్దరి మధ్య ఉండే పోటీ ఇపుడు నలుగురి మధ్యలో జరుగుతుంది.
తెలుగుదేశం కి మద్దతుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికలు తమ వంతు సహాయం చేస్తున్నాయి. తమ పార్టీ ని దుమ్మెత్తి పోస్తుందని సొంత పత్రిక, టీ.వీ చానెల్ పెట్టుకున్న ఘనత మన రాజశేఖర్ రెడ్డికే తగింది. మా టీ.వీ లో వాటాలున్న చిరంజీవికి ఎన్నికల ప్రచారం కలిసొచ్చింది. ప్రతి వారం ఠాగోర్, స్టాలిన్ సినిమాతో చావగొడుతూ ఉంది మా టీవీ. రాం చరణ్ తేజ కొత్త పెప్సీ యాడ్ గురించి వార్తాల్లో చెప్పడం దీనికి పరాకాష్ట! అసలు విషయం తెలుసుకోవాలంటే రెండు, మూడు పత్రికలు చదివితే కానీ అంతుపట్టడం లేదు. ఏది ఏమయినా మజ్జిగ పలుచన చేయడానికి అన్ని పార్టీలు కంకణం కట్టుకున్నాయి.
8 comments:
నిష్పాక్షికంగా, చాలా మంచి విషయాలు తెలిపారు.
నెనర్స్.
>>అసలు విషయం తెలుసుకోవాలంటే రెండు, మూడు పత్రికలు చదివితే కానీ అంతుపట్టడం లేదు.
ఇది నిజం.. టి.వి కూడా అంతే 3 లేదా 4 చానల్స్ చూడాలి, చూడకుండా ఉండడం ఇంకా బెటర్
నేదురుమల్లి సతీమణి మూడవసారి మళ్ళీ పోటీ "చేస్తుంది"
Your language has not improved yet :-( cEstOMdi, it should be written as.
I can catch several such blunders. Please, please review before publishing :-( It looks like an 8th grade vyAsam with a B grade albeit with a good subject.
నాగన్న గారికి నెనర్లు.
@ చైతన్య ఎస్, బాగా చెప్పారు.
@ అనానిమస్, తప్పకుండా నా బ్లాగుని దర్శిస్తున్నందుకు చాలా సంతోషం. పాత తప్పునే మళ్ళీ చేసినందుకు మన్నించండి. నా భావాలు సరళ భాషలోనే సగటు తెలుగువాడికి చేరాలి.
ప్రతి సారీ నాలో రచనా పటిమ పెరగడానికి మీరు చేస్తున్న కృషి అమోఘం!
@ అనానిమస్ ... నా భావాలు సరళ భాషలోనే సగటు తెలుగువాడికి చేరాలి.tappulu rAsi saraLa BASha ani kappipuccukOvaDaM, sagaTu teluguvADi mIdaki neTTaDaM anyAyaM. kAnivvaMDi. mI blAgu mI iShTaM. tappu nAdE. Au revoir.
అరెరే..అలా చిన్నబుచ్చుకుంటావేం అనానిమస్సూ....
మీకు ఎలాగు తెలుసు కాబట్టి తప్పులు సరిదిద్దుకోగలరు. సగటు తెలుగువాడు ఇలా తప్పులు వెతకడు కదా! ఒకవేళ ఉన్నా విషయం గ్రహిస్తాడు.
see this one... Do not delude yourself about language. Write good language and do not have to blame anyone.
http://tethulika.wordpress.com/2009/04/15/1058/
మంచి లింకు ఇచ్చావు అనానిమస్సు.
Post a Comment