Thursday, September 17, 2009

డిజిటల్ సినిమాలు

2,3 సంవత్సరాల క్రిందట మేము ఒక తొట్టి థియేటర్ నడుపుతున్న రోజులవి. అదే కాంప్లెక్సులో ఇంకొక రెండు చిన్న థియేటర్లు ఉండేవి. చిన్న హాలుకి మంచి డీటీఎస్,డాల్బీ సౌండ్ ఉండేది.పెద్ద హాలులో సోనీ సౌండ్ మాత్రమే ఉండేది. అప్పట్లో మా ఊరులో తెలుగు సినిమాలు డీటీఎస్ లో ఆడేవి కావు. కొత్తగా ఉంటుందని చిన్న థియేటర్ లోని ఆడియో సిస్టం ని పెద్ద థియేటర్ కి మార్పించడానికి ఒక టెక్నీషియన్ ని పిలిపించాం. ఇతను మా ఊర్లో ఉన్న అన్ని సినిమా హాళ్ళకీ డీటీఎస్ బాక్సులు రిపేర్ చేస్తూ ఉంటాడు.


ఒక రోజంతా కష్టపడి డీటీఎస్ బాక్సుని మార్చి పెద్ద సినిమా హాలుని రెడీ చేసాడు. అతనితో కాసేపు ముచ్చటిస్తుండగా డిజిటల్ సినిమాల గురించి చెప్పాడు. డిజిటల్ ప్రొజెక్షన్ ద్వారా డీవీడీ లాంటి డిస్కులతో సినిమాలు వేయడం, డైరెక్టు ఇంటర్నెట్ నుండి సినిమా డౌన్లోడ్ చేసుకోవడం ఇలా వింటూ ఉంటే "ఆహా..మన తెలుగు సినిమాలకి ఈ భాగ్యం ఎపుడు కలుగుతుంది?" అని అనుకున్నాను. మన సినిమా బాక్సు ఇంచుమించు 80 పౌండ్ల బరువు ఉంటుంది. దాన్ని ఎత్తి,దించుతుంటే సినిమా చూడకుండానే సినిమా కనపడేది.


ఆనాటి కల కొన్ని నెలల ముందు "కొంచెం ఇష్టం,కొంచెం కష్టం" సినిమాతో తీరింది. అమెరికాలో డిజిటల్ ప్రింట్ తో ప్రదర్శింపబడిన మొదటి సినిమా ఇది. కాకపోతే అప్పటికి న్యూజెర్సీ,శాన్ హోసే లాంటి పెద్ద సెంటర్లలో మాత్రమే డిజిటల్ ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఆంజనేయులు సినిమాతో మా ఊర్లో కూడా డిజిటల్ సినిమాలు మొదలయ్యాయి. ఈ మధ్య వచ్చిన జోష్, బాణం కూడా డిజిటల్ సినిమాలే. ఈనాడు ఎలా వస్తుందో రేపటికి కానీ తెలియదు,ఎందుకంటే ఆ సినిమా రేపటికి కానీ విడుదల కాదు కాబట్టి. మగధీర కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండేది.


ఈ డిజిటల్ సినిమా వల్ల లాభాలేమిటో ఇపుడు చెప్పుకుందాం.

1)సినిమా బాక్సు బరువు 80 పౌండ్ల నుండి 1/2 పౌండ్ కి తగ్గడం. నేను బాక్సులు తీసుకు వస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలిసిన మొదటి ఉపయోగం ఇదే.

2)అమెరికాకి ప్రింట్ పంపాలంటే ఇంచుమించు ఒక రోజు పడుతుంది.ఇపుడయితే రిలీజ్ ముందర ఇంటర్నెట్ నుండి డైరెక్టుగా డిజిటల్ ప్రొజెక్టర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మా ఊర్లో ఇలా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం లేదు,కాబట్టి న్యూజెర్సీలో డౌన్ లోడ్ చేసి హార్డ్ డ్రైవ్ లోకి కాపీ చేసి మాకు షిప్ చేస్తే మేము హార్డ్ డ్రైవ్ లో నుండి చూసేస్తాం.

3)సినిమాని ఫిల్మ్ లో ముద్రించేకంటే డిజిటల్ ప్రింట్ చెయ్యడం వల్ల ఖర్చు చాలా తక్కువ. ఒక ఫిల్మ్ చెయ్యాలంటే కనీసం వెయ్యి డాలర్లు ఖర్చు పెట్టాలి. సినిమాని హార్డ్ డ్రైవ్ లో కాపీ చేస్తే $50 కూడా పట్టదు.దీనివల్ల వ్యాపారంలో కొంచెం మిగులుబాటు ఉంటుంది నిర్మాతకీ,డిస్ట్రిబ్యూటర్లకీ.

4)ఇంకొక ముఖ్యమయిన ఉపయోగం ఏమిటంటే సినిమా ఆడియో ఎలాగూ డిజిటల్ లో ఉంటుంది.దాన్ని ఫిల్మ్ లోకి కన్వర్ట్ చేస్తే, సినిమా ప్లే చేసేటపుడు ఫిల్మ్ లోని ఆడియో మళ్ళీ డిజిటల్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈ కన్వర్షన్స్ లేకుండా ఫ్రెష్ ఆడియో మనకి డిజిటల్ సినిమాలో ఉంటుంది. వీడియో కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. మొన్న ఆంజనేయులు సినిమా చూస్తే జీవా ఇంకా నల్లగా కనిపించాడు!

5)బాక్సులో సినిమా అంటే దాన్ని ప్రొజెక్టర్ కి చుట్టి వెయ్యాలి. ఈ పని చెయ్యడానికి కనీసం ఒకటిన్నర గంట పడుతుంది. ఇపుడయితే హార్డ్ డ్రైవ్ రాగానే సినిమా రెడీ.

6 comments:

Chari Dingari said...

mari Piracy sangatenti?

శ్రీ said...

మంచి ప్రశ్న డాక్టర్ గారు.

ఈ మధ్య కాలంలో డిజిటల్ సినిమా రాకముందే లాబ్ నుండి ఫిల్మ్ బయటకి వెళ్ళేటపుడు ప్రతి ప్రింట్ కి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. ఎవరన్నా సినిమాని థియేటర్లో వీడియో తీసి కాపీ చేస్తే ఆ వీడియోలో కోడుని బట్టి అది ఏ హాలులో కాపీ చేసారో తెలిసిపోతుంది. తద్వారా హాలుపై తగిన చర్యలు తీసుకొవచ్చు, ఇలా కొన్ని సంఘటనలు ఈ మధ్య జరిగాయి కూడా. ఈ డిజిటల్ కాపీ కి కూడా ఇది వర్తిస్తుంది.

శ్రీ said...

@ రాం,

ఏంది బా!
నువ్వు ప్రతి టపాకి చెప్పాలా?
అన్ని బ్లాగుల్లో రాస్తున్నావట??

ఏంది నీ కత ???

చదువరి said...

మొన్న ఆంజనేయులు సినిమా చూస్తే జీవా ఇంకా నల్లగా కనిపించాడు! :) మీ మార్కు వ్యాఖ్యానం ఇది!

నేను ఈ డిజిటల్ సినిమాల గురించే అనుకుంటూ ఉంటాను. ఏ రామోజీరావో, వై.ఎస్ రాజశేఖరరెడ్డో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన ఊళ్ళలోనూ ఓ 150-200 సినిమా హాళ్ళు కొనేసి పెట్టుకుంటాడు. ప్రతీ సినిమా హాలూ హై. ను కలుపుతూ ఒక లీజ్‌డ్ లైను (+ ఒక స్టాండ్‌బై) పెట్టుకుంటాడు. హై. లో సినిమా వేస్తూంటే లైవు ట్రాన్స్‌మిషన్ చేసుకుంటాడు. (లేదా రికార్డు చేసుకుంటారు.)

రాధిక said...

మగధీర కూడా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి.కానీ న్యూజెర్సీలో వర్కవుట్ కాలేదట.

శ్రీ said...

@ చదువరి,

నెనర్లు. ఇవన్నీ ఆడ్ లాబ్స్ చేసుకుంటూ వస్తుంది.

@ రాధిక,

ఓ...మగధీర డిజిటల్ ప్రింట్ వచ్చి ఉంటే బాగుండేది.