Sunday, August 29, 2010

తెలుగువారు - అంతర్గత కలహాలు



ఈ అంతర్గత కలహాలు ఒక్క తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం కాదు కానీ ప్రస్తుతం మన కలహాల గురించి కాసేపు 
మాట్లాడుకుందాం. ఒక రెండు, మూడు వారాలుగా కూడలిలో చూస్తూ ఉంటే ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ, 
కొట్టుకుంటూ అందరూ బాగానే కాలక్షేపం చేసినట్టున్నారు. ఎదో కాలక్షేపంగా నాలుగు రాతలు రాసుకోకుండా రోజంతా 
ఒకరిమీద ఒకరు దాడులు చేసుకోవడంలో మనకి ఒరిగేదేమిటి ? అని ఎవరన్నా ఆలోచిస్తున్నారో లేదో!




బ్లాగు రాసుకునే వారులో చాలా రకాలే ఉంటారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు రాసుకునే వీలుంది ఈ బ్లాగుల్లో. 
ఒకరినొకరు తిట్టుకోవడానికి కూడా వీలుంది అని నాకు ఇపుడే తెలుస్తుంది. బ్లాగుల్లో ఇలా తిట్టుకోవడం ఈమద్య మొదలయినట్టుగా లేదు, ఎప్పటినుండో ఈ కలహాలు రగులుతూనే ఉన్నాయి. ఈ మధ్య ఆ కలహాలు మరింతగా రగలడం నేను చూస్తున్నాను.




అసలు విషయానికి వస్తే మనం ఒకరినొకరు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ఉండలేము. ప్రపంచంలో ఎవరి చరిత్ర చూసినా ఒక దేశం మీద ఇంకొకడు యుద్ధాలు చేసుకుని తన్నుకు చచ్చిన వాళ్ళే! భారత దేశంలో మాత్రం మనందరం శాంతి కాముకులం కాబట్టి ఏ పక్క దేశం మీదా మనం దండయాత్రలు చేయలేదు, కాకపొతే మనలో మనం బాగా యుధ్ధాలు జరుపుకున్నాం. 




తెలుగువాళ్ళు ఒక 10 మంది ఒకచోట చేరితే రెండు, మూడు గ్రూపులుగా మారడం ఖాయం. అలా విడిపోయిన గ్రూపులు 
సఖ్యంగా ఉన్నారా అంటే అదీ లేదు! విడిపోయి శుబ్రంగా తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉంటాం.రాజకీయాలకి వస్తే అసెంబ్లీ తలుపులు తెరిస్తే చాలు రోజంతా తిట్ల పురాణంతో కాలం గడిపేస్తూ ఉంటారు. ఆఫీసుల్లో, సినిమా హాళ్ళల్లో, పార్కుల్లో చివరికి బ్లాగుల్లో మనకి అవకాశం దొరకడమే ఆలశ్యం!  




దీని ద్వారా తెలిసింది ఏమిటంటే మనం చెంఘిజ్ ఖాన్, అలెగ్జాండర్ కంటే పోటుగాళ్ళం. కాకపొతే వాళ్ళు కత్తి పట్టి 
యుద్ధాలు చేసారు, మనం ఒకరినొకరి జుట్టు పట్టుకుని యుధ్ధాలు చేస్తున్నాం. సూటిపోటి మాటలకి చంపేసే శక్తి ఉంటే ప్రంపంచం ఎపుడో మన గుప్పిట్లో ఉండేది అనుకుంటా!


5 comments:

Anonymous said...

nothing wrong !

భాస్కర రామిరెడ్డి said...

శ్రీ గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం

హారం

Anonymous said...

చెత్తగా ఉంది, అంతర్గత కలహాలు ఎక్కడ లేవు? అన్ని చోట్ల ఉన్నాయి, అదేదో పెద్ద విషయం అన్నట్టు దాన్ని ఎత్తి చూపే నీ చూపే బాగాలేదు. ముందు ఓ మంచి కంటి డాక్టర్ని సంప్రదించు.

Afsar said...

ayya baaboy, baaboy!

nenu chaalaa chaalaa laaa aaaa missayipoyaanu.

ee vaaram motta chadivi kondveeti veerataallu vestaa....

శ్రీ said...

అలాగే హై గురూ!