Sunday, January 9, 2011

రగడ - చెరుకు పిప్పి

రగడ స్టోరీ డిస్కషన్ గురించి దర్శకుడు వీరూ పోట్ల, నాగార్జున ఇంటికి చేరుకున్నాడు.

కథ మొత్తం విన్నాక ఇద్దరూ ఇలా మాట్లాడుకున్నారు.

వీరు..బిందాస్ చూసారా?

నాగ్..ఆ.. చూసా.బాగా తీసావ్.

వీరు..మీ మొన్న కింగ్ సినిమా లాగే ఈ సినిమాకి కూడా మీ  హీరోయిజం బాగా వాడుకుందాం.

నాగ్..అలాగే.ఆక్షన్ సీన్స్ బాగా పెట్టు. మహేష్ బాబు కొట్టినట్టు ఒక్క దెబ్బకే అందరూ కింద పడిపోవాలి.

వీరు..ఈమధ్య అందరికీ అవే పెడుతున్నాం. హీరోయిన్ గా ఎవరిని పెట్టమంటారు?

నాగ్..ఎవరయినా ఒకేయ్.నేనెలాగూ డాన్స్ చెయ్యను, ఎవరయినా బాగా డాన్స్ చేసే హీరోయిన్ ని పెట్టు.

వీరు..అలాగే, ఇపుడు అనూష్కా బాగా జోరుగా ఉంది కదా, అమెని ఒక హీరోయిన్ గా పెడదాం.

మన సినిమాలో ఒక ఐదు, ఆరు పాటలు ఉంటాయి. మీరు బట్టలు మార్చుకుని ఆ చివర నుండి ఈ చివర వరకు ఒకసారి నడవండి, లేకపోతే నిలబడండి. దానితొ మీ పాటల షూటింగ్ అయిపోతుంది. హీరోయిన్, గ్రూప్ డాన్సర్లతో నేను పాటల షూటింగ్ తీసుకుంటా.

నాగ్..నా ఇరవై అయిదు సంవత్సరాల చరిత్రలో ఇలాగే కదా చేస్తున్నాను.

వీరు...అవును కదా!

*** ఇంతలో తడిచిపోయిన జాగింగ్ సూట్లో నాగ చైతన్య ఇంట్లోకి వస్తూ వీళ్ళిద్దర్నీ చూసి పలకరించాడు ***

నాగ్..ఏమిట్రా? ఎలా జరుగుతుంది నీ ప్రాక్టీస్ ?

జూ.నాగ్..బాగనే ఉంది నాన్నా.ఇంక ఒక వారం రోజులు ఇలాగే చేస్తే చాలు.

*** ఒంటికి పట్టిన చమట తుడుచుకుంటూ స్నానం చెయ్యడానికి ఇంటి లోపలకి వెళ్ళాడు ***
*** అప్పటివరకు టెన్షన్ తో సతమతమవుతున్న వీరు, ఇక ఆగలేక ఇలా అన్నాడు ***

వీరు..ఏమి ప్రాక్టీస్ చేస్తున్నాడండీ అబ్బాయి?

నాగ్.. ఏమీ లేదండీ. బాగా పరిగెత్తడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇండస్త్రీలో మాస్ హీరో ఇమేజ్ రావాలంటే బాగా గ్రేస్ తో పరిగెత్తాలి కదా! మన తెలుగు సినిమాలలో మహేష్, జూ. ఎంటీయార్ బాగా పరిగెత్తుతారు కదా! అబ్బాయి అది బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.


వీరు..అబ్బాయి ముందు చూపు బాగుందండీ, ఈమధ్య వచ్చిన గాయం సినిమాలో జగపతి బాబు రోడ్ మీద పరిగెత్తుతుంటే కేమెరా లాంగ్ షాట్ కాకుండా క్లోజ్-అప్ లో చూపించాల్సి వచ్చింది.

నాగ్.. అవును, నేను కూడా పరిగెత్తడం చాలా రోజుల ముందే మానేసా.  


*** ఇక నేను డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా అని వాకింగ్ షూస్ వేసుకుని నడక మొదలుపెట్టాడు నాగ్ ***

12 comments:

Indian Minerva said...

:)

'''నేస్తం... said...

super

పరిమళం said...

:) :) Happy newyear!

ఆత్రేయ said...

మీవాడు మాత్రం ఎలా చేస్తాడు బాబూ?
మావాడి రికార్డ్లు మీవాడికున్నాయా?
కావాలంటే కాస్కో ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ సింగిల్ మాన్ మా నాగ్
(క్షమించండి ఇవి నా మాటలు కావు, అభిమాన పొరలు కప్పేసిన జనం లో ఒకడిది )
గీత లో పెద్దాయన ఏమన్నాడు ?
యాత్ర చిత్రంతు వ్యర్జితే: తత్ర లోకోహ వర్దితాహ:
ఎక్కడ సినిమాలు ఒదిలి పెడతారో అక్కడ జనం బాగుపడతారు అని అర్ధం

cbrao said...

చాలా వ్యాసాలపై వ్యాఖ్యానం చెయ్యలేకున్నాను.
http://kalas3.blogspot.com/2009/05/blog-post_31.html
లేదా http://kalas3.blogspot.com/2011/01/blog-post.html పై చిరునామాలలో వ్యాఖ్య వ్రాయటానికి లింకేది?

ఈ వ్యాఖ్య తెలుగు బ్లాగు గుంపు సహాయంతో
https://www.blogger.com/comment.g?blogID=7593582567700951163postID=9160175519510175476
లింక్ ద్వారా వ్యాఖ్య వ్రాస్తున్నాను. మీ బ్లాగు లో వ్యాఖ్య వ్రాయటానికి How to write a comment on this blog post? అనే పేరుతో ఒక tutorial వ్రాయగలరు.

కొత్త పాళీ said...

well done.
మీకు కృష్ణనగర రహస్యాలు బాగానే తెలుస్తున్నాయే!

శ్రీ said...

@మినర్వ,కమల్, థాంక్స్
@పరిమళం, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!
@ఆత్రేయ, --)
@సీ.బీ.రావు,నా బ్లాగ్ పోస్ట్ దగ్గర వీరతాళ్ళు అని ఉంటుంది చూసారా? అక్కడ కామెంటు రాయండి.
@కొత్తపాళీ,--)

cbrao said...

http://kalas3.blogspot.com/2009/05/blog-post_31.html
పై లింక్ ను ఒక సారి పరిశీలించండి. వీరతాళ్లకు దిగువన లింక్ మౌస్ అక్కడ కదిపితే మాత్రమే కనిపిస్తుంది. మౌస్ ప్రమేయం లేకుండా లింక్ కనిపించేలా పెడితే
పాఠకులకు సులువుగా ఉంటుంది.

శ్రీ said...

సీ.బీ.రావు గారు, ఈ వీరతాళ్ళమీద ఇప్పటికే పాఠకులకి చాలా ఇబ్బంది జరిగినట్టుంది. ఇకనుండి ఆ ఇబ్బంది మీకు ఉండకపోవచ్చు.

GKK said...

’ఫన్’టాస్టిక్

శ్రీ said...

థాంక్స్ తెలుగు అభిమాని

శిశిర said...

:)బాగుందండి.