Thursday, February 3, 2011

వైభవంగా జరిగిన శ్రీ వరదరాజ స్వామి తెప్పోత్సవం







ప్రతి సంవత్సరం తై అమావాస్య రోజు శ్రీకాళహస్తిలో వరదరాజ స్వామికి తెప్పోత్సవం జరపడం ఆనవాయితీ. తమిళ కాలెండరులో తై మాసం జనవరి మధ్య నుండి మొదలయ్యి ఫిబ్రవరి మధ్య వరకు ఉంటుంది. ఈ తై మాసంలో వచ్చే అమావాస్య రోజు మన పూర్వీకులని గుర్తు చేసుకుని ప్రార్ధించటం ఈరోజు ప్రత్యేకత.




శ్రీకాళహస్తిలో శివుడు గుడి మాత్రమే కాకుండా వరదరాజ స్వామి గుడి కూడా ఉంటుంది. తై అమావాస్య రోజు పూసల వీధిలోని వైష్ణవ పుష్కరణి (కోనేరు) లో శ్రీదేవి, భూదేవితో కలిపి తెప్పపై మూడు ప్రదక్షిణలు చేస్తారు. సాయంత్రం వరకు గుడిలో పూజలు జరిపిన తర్వాత ఎనిమిది గంటలపైన శ్రీకాళహస్తి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెప్పోత్సవం మొదలయింది. కోనేరుకి నాలుగు వైపుల భక్తులు కూర్చుని వరదరాజ స్వామిని దర్శించుకున్నారు. ప్రతి ప్రదక్షిణ తర్వాత కాసేపు బాణసంచా కార్యక్రమం పిల్లల్ని అలరించింది.          



No comments: