Tuesday, May 10, 2011

కారుని, మోటార్ సైకిల్ ని పుష్ స్టార్ట్ ఎలా చెయ్యాలి ?


రెండు వారాల ముందు కాలాస్త్రి నుండి పెద్ద బావని తిరప్తి తీసుకు వెళ్దామని కారు స్టార్ట్ చేస్తే మొండికేసింది. అంతకు ముందు ఒక వారం వరకు వర్షం పడింది. కారు కాలాస్త్రిలో గరాజ్ లో కాక బయటే ఉండేది. ఎండకి ఎండి వానకి తడిసి. అమెరికాలో అయితే కారు మొదలవకపోతే ముందు మనం చేసే పని ఏమిటంటే జంప్ స్టార్ట్. అందుబాటులో ఉన్న ఇంకో కారు నుండి మన కారు బాటరీకి కేబిల్స్ కలిపి ఒక పది, ఇరవై నిముషాలు ఇంజిన్ రన్నింగ్ లో ఉంటే మన కారు బాటరీ చార్జ్ అవుతుంది. కాలాస్రిలో మనకి కేబిల్స్ అందుబాటులొ లేవు, అక్కడ మనకి తెలిసిన ఈజీ పని తోసి స్టార్ట్ చెయ్యడం. 


తోస్తే ఎలా స్టార్ట్ చెయ్యాలో నాకు తెలియదు, అపుడు మా బావ నేర్పించాడు. కారు ఇగ్నిషన్ స్టార్ట్ చేసి సెకండ్ గేరులో కారు ఉంచుకోవాలి. కారే కాబట్టి ఒక ఇద్దరు తోస్తే చాలు. క్లచ్ నొక్కి, కారు కొంత స్పీడ్ అంటే ఒక పది కి.మీ/గంట దాకా అందుకోగానే క్లచ్ వదిలి స్టార్ట్ చెయ్యడానికి ప్రయత్నించాలి. మొదటి ప్రయత్నంలో మొదలవకపోతే రెండు, మూడు సార్లు తోసి రెండో గారులో కారు స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకసారి స్టార్ట్ అవగానే కనీసం ఒక అరగంట ఇంజిన్ రన్నింగ్ లో ఉంటే బాటరీ చార్జ్ అవడానికి అవకాశం లభిస్తుంది. 


బాటరీ బాగున్నపుడు మనం కారు ఇగ్నిషన్ స్టార్ట్ చెయ్యగానే ఇంజిన్ స్టార్ట్ అయ్యి చక్రాలని కదిలిస్తుంది. బాటరీ డెడ్ అయినపుడు మనం చక్రాలని కదిలించి ఇంజిన్ స్టార్ట్ అయ్యేటట్లు చేస్తాం. అంటే ఇలా తోసినపుడు కారుని మనం రివర్స్ మెకానిజం లో స్టార్ట్ చేస్తామనమాట.


కాలాస్త్రి నుండి డెట్రాయిట్ కి వస్తే ఇక్కడ వింటర్ అంతా గరాజ్ లో ఉన్న బైకు స్టార్ట్ అవలేదు.ఈ బైకుకి కూడా ఎలెక్ట్రిక్ స్టార్ట్ ఉంది, ఇన్ని రోజులూ స్టార్ట్ చెయ్యక పోవడం వల్ల బాటరీ డౌన్ అయింది. మాములుగా ఇక్కడ బైకర్లు వింటర్ మొదలవగానే బాటరీని బయటకు తీసి అడాప్టర్ ద్వారా చార్జ్ చేసుకుంటారు. లేదంటే మధ్య, మధ్యలో ఒకసారి బైకు స్టార్ట్ చేస్తూ ఉంటారు, దీనివల్ల కూడా బాటరీ డెడ్ అవకుండా ఉంటుంది. 


నా దగ్గర బాటరీ చార్జ్ చేసే అడాప్టర్ లేదు. ఒకవేళ బాటరీని తీస్తే మోటార్ సైకిల్ డీలర్ దగ్గరకెళ్ళి చార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే మన బండి చిన్నదే కాబట్టి మొన్న కాలాస్త్రిలో కారుని తోసినట్టే బైకుని కూడా స్టార్ట్ చేద్దామని తయారయ్యా. యూ ట్యూబులో కూడా ఒక రెండు వీడియోలు చూసి ధైర్యం తెచ్చుకున్నా. కారు కయితే ఇద్దరు, ముగ్గురు కావాలి కానీ బైకుని ఒక్కరు తోస్తే చాలు. మా కజిన్ వెనక తోస్తూ ఉంటే, బైకు ఒక అయిదు మైళ్ళు/గంట స్పీడు అందుకోగానే రెండో గేరు వేసి క్లచ్ వదిలా. ఇలా రెండు, మూడు సార్లు చేసేసరికి బండి స్టార్ట్ అయింది. ఒక అరగంట ఇంటి చుట్టుపక్కల చిన్న రోడ్లలో కాసేపు తిరిగి బాటరీని చార్జ్ చేసా. అంతే, ఇక సమ్మరంతా బండికి ఢోకా ఉండదు.



No comments: