ఆ మధ్యలో ఒక బ్లాగరు (బ్లాగు పేరు ఇపుడు గుర్తు లేదు) మైదానం చదివి అతని అభిప్రాయం రాసాడు. మన కొత్తపాళీ గారు 'చలం పుస్తకాలు ప్రతి పదేళ్ళకి చదవాలి, అపుడు పుస్తకం ఇంకొంచెం లోతుగా అర్ధం అవ్వచ్చు' అన్నట్టు కామెంటారు. పది సంవత్సరాల వరకు ఆగలేక బ్రాహ్మణీకం మళ్ళీ చదివాను. జగదేక వీరుడు-అతిలోక సుందరి సినిమా రెండోసారి చూసేటపుడు 'ఈసారి అయినా శ్రీదేవికి ఉంగరం దొరికితే బాగుణ్ణు' అనుకున్న ఆశావాదిని నేను. ఈ పుస్తకం రెండోసారి చదివేటపుడు 'చంద్రశేఖరానికి దొరకకుండా సుబ్బాయమ్మ తప్పించుకుంటే బాగుణ్ణు అనుకున్నా' మళ్ళీ. ఇన్నేళ్ళయినా నా ఆశ చావలేదు, అలాగే ఉండిపోయింది.
చలం కథల్లో విశేషం ఏమిటంటే అవసరం అనుకున్నపుడు చెప్పులు వేసుకుని, గడ్డం నిమురుకుంటూ మనతో మాట్లడడానికి వచ్చేస్తాడు. ఇక ఆయన చెప్పాలనుకున్నవి చెప్పేసి మళ్ళీ అట్ట మీదకి వెళ్ళిపోతాడు. ఒక్కసారి చలం మాటలు వినగానే మనం పెన్నూ, పేపరు తీసుకుని రాసుకుని అండర్ లైను చేసుకోవాలనమాట. ఈ చెప్పే మాటలు చద్ది అన్నం కన్నా చల్లగా ఉంటుంది, అందులో మిరపకాయ ఘాటు కూడా ఉంటుంది. ఏమిటి ఈ మనిషి, ఆ రోజుల్లో నాకన్నా బాగా అలోచించాడు? అని మన ఆత్మారాముడు విపరీతంగా ఫీల్ అవుతాడు.
అంతరాత్మ గురించి ఒకసారి మహోద్భుతంగా ఇలా చెప్తాడు.
అంతర్వాణిని 'ఈశ్వర వాణీ' 'నీతి' అని ప్రజలు నిర్ణయిస్తున్నారు. అంతరాత్మే ఈశ్వర వాణి అయితే ఈ ఈశ్వరుడు చాలా మూర్ఖుడయి ఉండాలి. ఆ ఈశ్వరుడికే అందని అగాధపు క్షుద్రత్వమూ, ఆ ఈశ్వరుడికే అర్హంగాని మహోన్నత ఉదారత్వమూ ఉన్నాయి మానవ హృదయంలో!
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన సుబ్బాయమ్మ కథ ఈ బ్రాహ్మణీకం. మొగుడు చనిపోవటంతో దిక్కు లేక మేనమామ ఇంటికి చేరుకుంటారు సుబ్బాయమ్మ, ఆమెకి అమ్మ. ఇద్దరికీ లోకం పోకడ తెలియదు. ఏదో పూజలు, మడీ అంటూ వాళ్ళ లోకంలో వాళ్ళుంటారు. పట్నంలో ఉన్న మేనమామకి ఆధునిక జీవనానికి అలవాటు పడి మూఢాచారాలని ప్రశ్నిస్తూ ఉంటాడు. మేనమామ దగ్గర వారాలు చేసుకునే చంద్రశేఖరం కన్ను సుబ్బాయమ్మ మీద పడుతుంది. ఒక బలహీన క్షణంలో ఇద్దరూ దగ్గరవుతారు. క్షణం బలహీనమయినా సుబ్బాయమ్మకి బలమయిన కడుపొస్తుంది. ఆదర్శవంతమయిన మేనమామ ఇద్దరికీ పెళ్ళి జరిపిస్తాడు.
వివాహం తరువాత చంద్రశేఖరం ప్రవర్తనలో మార్పు వస్తుంది. వితంతు వివాహం హర్షించని సమాజం సుబ్బాయమ్మని తనలో కలుపుకోకుండా దూరంగా ఉంచుతుంది. తన కష్టాలకి కారణం ఈ వితంతు వివాహం అని, దేవతలు తనని నిందిస్తున్నారనీ బాధపడుతూ ఉంటుంది సుబ్బాయమ్మ. పిల్లవాడి అనారోగ్యానికి కారణం కూడా తను చేసిన పాపమే అని కుమిలిపోతూ ఉంటుంది.
వితంతు వివాహాలు సమర్థించడానికి మేనమామ పాత్రని సృష్టించి రచయిత చలం మన మీదకి వదిలాడు. పెళ్ళి జరిపించి మామ సెలవు తీసుకుంటాడు. సమాజం కాకిలా పొడుస్తూ ఉంటే అందరికీ చెప్పడం కష్టమని సుబ్బయమ్మని ఇబ్బంది పెట్టాడు. బిడ్డ అనారోగ్యానికి గురి అయితే దేవుళ్ళని తృప్తి పరచడానికి గుడికొచ్చిన సుబ్బాయమ్మని పతివ్రతలు నానా మాటలంటారు.
మలీనా అనే ఇటాలియన్ సినిమాలో అందంగా ఉండే మోనికా బెల్లూచీపై ఊరిలోని ఆడోళ్ళందరూ అసూయ పడుతూ ఉంటారు. ఆమెకి అక్రమ సంబంధం అంటగడుతూ ఒకసారి అందరూ కలిసి ఆమె తాట తీస్తారు. ఆ సమయంలో మోనికాని చూస్తే నాకు సుబ్బాయమ్మే గుర్తుకు వచ్చింది.
పుట్టి పెరిగినప్పటి నుండీ మద్రాసులోనే ఉండడం వలన ఇతని పాత్రలు కూడా చివరలో విషాదానికే దగ్గరవుతాయి (మన తమిళ సినిమాల్లో కూడా చాలా వరకు ముగింపు విషాదంగా ఉంటుంది కదా).
వితంతు వివాహాలు సమర్థించడానికి మేనమామ పాత్రని సృష్టించి రచయిత చలం మన మీదకి వదిలాడు. పెళ్ళి జరిపించి మామ సెలవు తీసుకుంటాడు. సమాజం కాకిలా పొడుస్తూ ఉంటే అందరికీ చెప్పడం కష్టమని సుబ్బయమ్మని ఇబ్బంది పెట్టాడు. బిడ్డ అనారోగ్యానికి గురి అయితే దేవుళ్ళని తృప్తి పరచడానికి గుడికొచ్చిన సుబ్బాయమ్మని పతివ్రతలు నానా మాటలంటారు.
మలీనా అనే ఇటాలియన్ సినిమాలో అందంగా ఉండే మోనికా బెల్లూచీపై ఊరిలోని ఆడోళ్ళందరూ అసూయ పడుతూ ఉంటారు. ఆమెకి అక్రమ సంబంధం అంటగడుతూ ఒకసారి అందరూ కలిసి ఆమె తాట తీస్తారు. ఆ సమయంలో మోనికాని చూస్తే నాకు సుబ్బాయమ్మే గుర్తుకు వచ్చింది.
పుట్టి పెరిగినప్పటి నుండీ మద్రాసులోనే ఉండడం వలన ఇతని పాత్రలు కూడా చివరలో విషాదానికే దగ్గరవుతాయి (మన తమిళ సినిమాల్లో కూడా చాలా వరకు ముగింపు విషాదంగా ఉంటుంది కదా).
14 comments:
http://patrika.teluguwebmedia.in/2010/07/blog-post_09.html గత ఏడాది నేను వ్రాసాను.
బాగుంది, నేను చదివినట్టు గుర్తు.
"చలం కథల్లో విశేషం ఏమిటంటే అవసరం అనుకున్నపుడు చెప్పులు వేసుకుని, గడ్డం నిమురుకుంటూ మనతో మాట్లడడానికి వచ్చేస్తాడు. ఇక ఆయన చెప్పాలనుకున్నవి చెప్పేసి మళ్ళీ అట్ట మీదకి వెళ్ళిపోతాడు. ఒక్కసారి చలం మాటలు వినగానే మనం పెన్నూ, పేపరు తీసుకుని రాసుకుని అండర్ లైను చేసుకోవాలనమాట. ఈ చెప్పే మాటలు చద్ది అన్నం కన్నా చల్లగా ఉంటుంది, అందులో మిరపకాయ ఘాటు కూడా ఉంటుంది. ఏమిటి ఈ మనిషి, ఆ రోజుల్లో నాకన్నా బాగా అలోచించాడు? అని మన ఆత్మారాముడు విపరీతంగా ఫీల్ అవుతాడు."
..............
అద్భుతంగా రాసారు. నాకు చాలా నచ్చిన పుస్తకం బ్రాహ్మణీకం. మైదానంకన్నా ఇదే ఎక్కువ ఇష్టం నాకు. నా చలం టాప్ టెన్ లో ఇది ఉంటుంది.
నువ్వు మైదానం చదివావంటే నాకు నమ్మశక్యంగా లేదు. మైదానం నవలలో రాజేశ్వరి తన కంటే వయసులో చిన్నవాడైన మీరాతో సెక్స్ చేస్తుంది. అదే థీమ్‌తో నేను కథలు వ్రాస్తే పైత్యం అంటావు. నీ మైండ్‌లో ఏముంది అసలు?
http://patrika.teluguwebmedia.in/2010/06/blog-post_25.html మైదానం నవల పై నేను వ్రాసిన రివ్యూలలో ఇదొకటి. విదేశాలలోనూ లింగ వివక్ష ఉంది కానీ అక్కడ పెళ్ళైన స్త్రీని ఒకలాగ, పెళ్ళికాని స్త్రీని ఒకలాగ చూసే సంకుచిత నమ్మకాలు లేవు.
నాకైతే అన్నిటికంటే మైదానం నవలే బాగా నచ్చింది. బ్రాహ్మణీకం, అనసూయ నవలలు పెళ్ళి విషయంలో స్త్రీ-పురుషలకి సమానహక్కులు ఉండాలని చెపుతాయి కానీ మైదానం నవల సెక్స్ విషయంలోనూ స్త్రీ-పురుషులకి సమాన హక్కులు ఉండాలంటుంది. పెళ్ళి అనేది అందరూ చేసుకునేదే. భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకున్నా నా దృష్టిలో అది సాధారణ విషయమే. కానీ సెక్స్ విషయంలో మూఢనమ్మకాలే ఇంకా పోలేదు ఈ సమాజంలో. అందుకే బ్రాహ్మణీకం, అనసూయల కంటే మైదానమే నన్ను ఎక్కువగా ఆకర్షించింది.
థాంక్స్ సౌమ్య గారు. చలం పుస్తకాల్లో మైదానం అందరికీ నచ్చుతుంది. నాకు బాగా ఇష్టమే.
మీ అభిప్రాయాలు బాగున్నాయి ప్రవీణ్.
ఆ మధ్య కత్తి మైదానం నవల గురించి ఏదో వ్రాసాడు. కత్తికి మైదానం అర్థం కాలేదనే నేను అనుకుంటాను కానీ లేచిపోవడాన్ని అడ్వొకేట్ చేసే కథలని జస్టిఫై చేస్తున్నావంటూ కొందరు కత్తిని తిట్టారు. నా దృష్టిలో లేచిపోవడం తప్పు కాదు. బలవంతంగా ఇష్టం లేని కాపురం చెయ్యడమే తప్పు. లేచిపోవడం అనే కాన్సెప్ట్ గురించి ఇక్కడా వ్రాసాను http://patrika.teluguwebmedia.in/2010/03/blog-post_2392.html
శ్రీ గారు, నా బ్లాగ్‌లో మీ వ్యాఖ్య ఇందాకే చదివాను. పురుషాహంకార మనస్తత్వం గల మగవాళ్ళు పెళ్ళి విషయంలో వయసు, ఎత్తు, కన్యత్వం, వైధవ్యం లాంటి అనవసరమైన పట్టింపులకి పోతారు కానీ అక్రమ సంబంధాల విషయంలో అలాంటి పట్టింపులు ఉండవు. నాకు తెలిసి ఒక భర్త చనిపోయిన స్త్రీని ఆమె సొంత మేనల్లుడే లొంగదీసుకున్నాడు. హిపోక్రిసీ అనేది అలా ఉంటుంది.
సక్రమంగా చేస్తే అది అక్రమ సంబంధం ఎలా అవుతుంది ప్రవీణ్?
సక్రమ సంబంధాలకి రహస్యాలు ఉండవు కదా. రహస్య సంబంధాలనే అక్రమ సంబంధాలు అంటారు. రహస్య సంబంధాలకి లేని వయసు, ఎత్తు, కన్యత్వం, వైధవ్యం లాంటి అనవసరమైన పట్టింపులు బహిరంగ సంబంధాలకి ఎందుకు? రహస్యంగా ఏమైనా చెయ్యొచ్చు కానీ బహిరంగంగా ఇది చెయ్యకూడదు, అది చెయ్యొచ్చు అని నియమం ఎందుకు? బ్రాహ్మణీకంలో హీరోయిన్ భర్త అలా అనుకున్న వంచకుడే కదా.
నువ్వన్నది నిజమే ప్రవీణ్.
amma sowmymma emi cotation talli,malli chalanni chadivinattundi,mee lanti vallandaru p00nukoni appudappudu kasta malantivallaku acchatenugunandicchandi,
కోట్ రాసింది నేను చిరూ!
Post a Comment