చిన్నపుడు నేను, శేఖర్ సినిమాలు చూసి స్కూలులో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. మాకిద్దరికీ హీరోలకంటే విలన్లే ఎక్కువగా నచ్చేవాళ్ళు. కన్నడ ప్రభాకర్, సత్యరాజ్, సుదర్శన్ ఇలా వెరైటీగా ఉండే విలన్లని బాగా ఆదరిస్తూ ఉండేవాళ్ళం. గబ్బర్ సింగ్ లో పవన్ కూడా ఇలాంటోడే! చిన్నపుడు షోలే విరగ చూసి గబ్బర్ మీద మమకారం పెంచుకుంటాడు.
నాకు ఇంతవరకు రీమేక్ సినిమాలు ఎపుడూ నచ్చేవి కావు. అసలు రీమేక్ సినిమాలు ఎందుకు తీస్తారు? అని గణేషుతో చాలా సార్లు గొడవ పడుతూ ఉండేవాడిని. 'లవ్ ఆజ్ కల్ ని పాడు చేసాక నా వాదనకి మరింత బలం పెరిగింది. దబాంగ్ చూసినపుడు బీహారీ యాస మనకి పెద్దగా అర్ధం కాలేదు. అర్థం కాని భాష, కాక్ టైల్ ఘోషలో సినిమా మత్తుగా జారి పోయింది. ఇది కూడా గబ్బర్ సింగ్ విజయానికి కారణం కావచ్చు.
ఇక నా గొడవ వదిలి సినిమాకి వస్తే పవన్ అంకుల్ (వయసు పిలుస్తోంది, పాపం!) పవర్ హవా బాగా నడిచింది. సినిమాని మొత్తం బాబాయే నెత్తిన పెట్టుకుని నడింపించాడు. సినిమాకి డవిలాగులు రాసిన హరిష్ శంకర్ ని అభినందించాల్సిందే! అపుడపుడూ పాత సినిమా డైలాగులు వాడుకుంటూ పంచ్ లతో పంచెలు లాగేసాడు. శృతి హాసన్ కి ఈ సినిమాతో సడన్ బ్రేక్ కాకపోయినా ఒక మాదిరి బ్రేక్ రావచ్చు. ఈ సాకుతోనన్నా దొంగ మొహం త్రిషని ఇంటికి పంపిస్తే నేను ఒక పెద్ద పండగ చేసుకుంటా. అసలు దమ్ము సినిమా సగం ఫ్లాపుకి సగం త్రిష కూడా కారణం. సరే ఈ విజయోత్సవంలో ఆ దిక్కుమాలిన సినిమా ఎందుకు అడ్డంగా! దమ్ము గురించి ఇంకొక విషయం చెప్పాలి, చిన్న ఎంటీవోడు నరుకుతుంటే ఎవడో ఉన్మాదిని చూసినట్టు కంపరం కలిగింది. పవన్ మామయ్య నరుకుడు ఎందుకో సమ్మగా అనిపించింది.
సినిమాలో అంత్యాక్షరి సీను నువ్వు ఎపుడూ చేస్తూ ఉంటావే కొబ్బరి పచ్చడి లాగా అదిరిపోయింది. నవ్వి,నవ్వి... సంకోచ,వ్యాకోచాలతో పొట్ట అతలాకుతలం అయిపోయిందంటే నమ్మండి! సరసమయిన పాత్రలో గాయత్రి కొత్తగా కనిపించింది, ఈ పాపకి ఇంకో అయిదు సినిమాలు గారంటీ! నెల్లూరు పిలకాయ్ అజయ్ కూడా బాగా చేసాడు. పిల్లోడికి విలన్ అంత సీన్ కంటే ఇలాంటి సానుభీతి సీన్లు ఒకే ఏమో!
పవన్ కి ఒక హిట్ వస్తే దాని తర్వాత ఫట,ఫటా నాలుగు ఫ్లాపులు అనివార్యం. మీకు లెక్కలు వచ్చు కాబట్టి మీరే లెక్క పెట్టుకోండి. కోతి మూక లాంటి మెగా పిలకాయలు మన గుండెల్లో దిగడానికి ఇంకా చాలా సమయం పట్టేట్టుంది, అంతవరకు బాబాయే ముడతలు సరి చేసుకుని రంగులు పూసుకోవాలి, తప్పదు!
11 comments:
dammu sagam flop ki sagam karanam trisha annav bane undi , kani ntr narukudu unmadila pawan narukudu samma gaa undi anadam lo nee partiality telustundi .. ( aina vaadu katti tho kosinaa samma gaa untundi adee kaani vadu gillinaa chiraakesthadi :P) ika mega pilakayala gurinchi baaga seppinav .... mottaniki .. nee pawan partiality rangarinchav kastha :P kikiki
కాలాస్త్రిగారూ, మీ రివ్యూలో diplomaticగా సినిమా బాగుందని చెబుతూనే(మీరు చెప్పకపోయినా అది సూపర్ హిట్టేనన్న విషయం మీకూ తెలుసు), మెగా ఫ్యామిలీమీద మీకున్న దురభిమానాన్ని చెప్పకనే చెప్పుకున్నారు మీరు. అసలు మెగా ఫ్యామిలీమీద మీకెందుకంత కక్షో వివరిస్తూ ఒక టపా రాయకూడదూ!
మెగా పిలకాయలు కోతిమూక! మరి మంచు, అక్కినేని పిలకాయలను కొండముచ్చు మూక అనొచ్చా!
దొం...గ...మొ....హం..... త్రిషా ???
హింతమాటనేసారేంటండీ మీరూ ??
మీరు డౌన్ డౌన్ ;)
డాళింగ్, నువ్వు శేఖర్ తో సినేమాలు చూసి గణేశుతో గొడవలు పడి మమల్ని కంఫూజ్ చేస్తే యెలా? ఇంతకీ పవన్ 'మన' లాంటి యూత్ కి బాబయ్యా? మావయ్యా?
యేది ఏవయినా నీ రివ్యూ క్యామెడి తో సిన్చేసినావు గదా అబ్బయ్యా.. :))
ఉన్నమాట చెప్పాను అనానిమస్సూ. మనకి ఎవరయినా ఒకటే! నేను నాగ చైతన్యని బాగా ఆడుకుంటానని తెలుసు కదా!
ఏదో నా దురభిమానం!
థాంక్స్ డాళింగ్! మన యూత్ కి కూడా రెండూ, సమయాన్ని బట్టి వాడేసుకోవడమే!
ఏమో, నాకలా అనిపించింది. నువ్వేమో నాది పార్షియాలిటీ అంటున్నావ్, కిందేమో వేరే విధంగా అంటున్నారు! ఏమిటో నా రాత!!
హ..హ...కెవ్వ్ మనే రివ్యు
కెవ్వు కెక... ఎది ఎమయినా మీకు కొంచెం తిక్కుంది... కాని దానికి ఒక లెక్కుంది... అది మాకు నచ్చింది... చివరి వాక్యం అదిరింది... నవ్వుల్లొ ముంచింది
సినిమా బాగానే ఉంది. కానీ చివరలో రూల్స్‌కి వ్యతిరేకంగా దొంగలకి పోలీస్ ఉద్యోగాలు ఇచ్చేస్తారా? అని ఆశ్చర్యం కలిగింది.
Post a Comment