Wednesday, June 20, 2012

పరుత్తి వీరన్ - ఒక ప్రేమ కథ



 

ఈ  సినిమా  పేరు వింటే మీకు ప్రియమణి గుర్తుకు రావాలి. ఆమెకి ఈ సినిమా ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డ్ లభించింది. అపుడపుడూ యూ ట్యూబులో కొన్ని సీన్స్ చూసాను. ప్రియమణి మేకప్ లేకుండా చాలా అందంగా కనపడింది. అమె నటన ఇంకా అందంగా కనపడింది. నిన్ననే వీలు చూసుకుని సినిమా మొత్తం చూసేసా.

ఈ సినిమా ద్వారా ప్రముఖ తమిళ నటుడు సూర్య తమ్ముడు కార్తిక్ పరిచయమయ్యాడు. కథ అంతా ఒక అపల్లెటూరిలో జరుగుతుంది. ప్రియమణి, కార్తిక్ చిన్న వయసులో కొన్ని సంఘటనల ద్వారా దగ్గరవుతారు. ఇద్దరి స్నేహం వాళ్ళతో పాటూ పెరుగుతుంది. కార్తిక్ జులాయిగా పెరిగి, ఊరిలో అందరితో గొడవ పడుతూ, తాగుతూ పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ప్రియమణికి మాత్రం కార్తిక్ అంటే చచ్చేంత ఇష్టం. వాడి మీదే మనసంతా పెట్టుకుని వాడిని పెళ్ళి చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది.

కార్తిక్ మాత్రం, ప్రియమణి ప్రేమని గుర్తించకుండా జులాయిగానే తిరుగుతూ ఉంటాడు. కార్తిక్ కోసం ప్రియమణి ఇంట్లో బాగా దెబ్బలు తింటూ ఉంటుంది. ఇద్దరూ పెళ్ళికి వరసే కానీ, కుటుంబాల మధ్య కొంచెం ఘర్షణ పెరిగి దూరంగా ఉంటూ వస్తారు. కార్తిక్ మాత్రం, ప్రియమణి ప్రేమని గుర్తించకుండా జులాయిగానే తిరుగుతూ ఉంటాడు. కార్తిక్ కోసం ప్రియమణి ఇంట్లో బాగా దెబ్బలు తింటూ ఉంటుంది. ఇద్దరూ పెళ్ళికి వరసే కానీ, కుటుంబాల మధ్య కొంచెం ఘర్షణ పెరిగి దూరాంగా ఉంటూ వస్తారు.

కార్తిక్ మొదటి సినిమానే అయినా చాలా బాగా నటించాడు. ఇక ప్రియమణి గురించి అయితే చెప్పడానికి మాటలు లేవు. రాయడానికి రాతలు లేవు. చాలా అద్భుతంగా నటించింది. ఇంత టాలెంట్ ఉన్న నటిని మనం తైతక్కలాడేదానికి వాడుకున్నామని తెలిసాక తెలుగు సినిమా మీద అసహ్యం వేసింది. 


గుండెలని పిండేసేలా నటించిన ప్రియమణికి జాతీయ అవార్డ్ ఇచ్చి ఆమెని గౌరవించి మనం చాలా మంచి పని చేసాం. ఊరిలో జరిగే జాతర, పెద్ద మనుషుల మధ్య తగాదాలు చాలా సహజంగా చిత్రీకరించారు. ఇక సంగీతం, యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి అద్భుతంగా కూర్చాడు.


7 comments:

ఆ.సౌమ్య said...

మంచి సినిమా.
>>ఇంత టాలెంట్ ఉన్న నటిని మనం తైతక్కలాడేదానికి వాడుకున్నామని తెలిసాక తెలుగు సినిమా మీద అసహ్యం వేసింది<<
తొందరపడకండి. అలా చేసింది తెలుగు సినిమా కాదు. స్వయంగా ఆవిడగారే! పరిత్తి వీరన్ దర్శకుడు అమీర్ ప్రియమణికి ఇంకో సినిమాలో ఇలాంటిదే ఇంకో అద్భుమైన పాత్రని అఫర్ చేస్తే అమ్మడు తిప్పి కొట్టింది. అంతే కాక ఇకపై నేనిలాంటి సినిమాలు చేయననీ, గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాననీ, కమర్షియల్ మాస్ మసాలా సినిమాలే చేస్తానని బల్ల గుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు చెప్పండి తప్పు తెలుగు సినిమాలదా?? ప్రియమణిదా??

నిషిగంధ said...

నేనూ ఈ మూవీ ప్రియమణి కోసమే చూశాను.. నిజంగా తను బ్రిలియంట్ యాక్ట్రెస్.. కానీ క్లైమాక్స్ నించి బయటకి రావడానికి చాలా రోజులే పట్టింది.. సహజత్వం గురించి చెప్పాలంటే, పక్కా తమిళ్ మూవీ అంటే చాలు :-)

శ్రీ said...

అవునా! అయితే తప్పు ప్రియమణిదే! నాకొక కొత్త విషయం చెప్పినందుకు నెనర్లు!!

Kottapali said...

యూట్యూబులో కొన్ని దృశ్యాలు చూశాను. Impressive.
మొత్తం సినిమా ఎక్కడ చూశారు?
అవును, ప్రియమణి స్వయంకృతాపరాధమే.

శ్రీ said...

ఈ కింది లింక్ చూడండి, ఇందులో 17 భాగాలు ఉన్నాయి. అన్ని భాగాలు ప్లే లిస్టులో ఉన్నాయి, మొదటిది ఓపన్ చేసారంటే ఒకదాని తర్వాత అదే తెరుచుకుంటుంది.
http://www.youtube.com/user/hqtamilvidz

Sujata M said...

తప్పు ఎవుర్దీ కాదు. డబ్బుది.

Sujata M said...

తప్పు ఎవుర్దీ కాదు. డబ్బుది.