Sunday, June 24, 2012

శగుని - తమిళ్ - పరవాఇల్లియే!


మహాభారతంలో మంచి పాత్రలు ఉన్నాయి, చెడ్డ పాత్రలు ఉన్నాయి. శకుని ఆశయం మంచిదే అయినా ధర్మ ప్రతిష్టాపన కోసం అతను చాలా నాటకాలు వేసి కౌరవులతో చెలగాటం ఆడుతాడు.  అతను ఎంచుకున్న మార్గం ద్వారా సమాజానికి అతను చెడ్డవాడుగా మాత్రమే తెలుసు. ఈ సినిమాకి ఈ మార్గం అవసరమొచ్చి శకుని పాత్రని మళ్ళీ మన ముందు తీసుకు వచ్చారు మన తమిళ సోదరులు.

కమల్ (కార్తిక్)  వాళ్ళకి కారైకుడిలో ఒక పెద్ద భవనం ఉంటుంది. ప్రతి రోజూ ఆ ఇంట్లో అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ఆ భవనం పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది, పెరిగిన ట్రాఫిక్ ని తగ్గించేందుకు ప్రభుత్వం ఒక ఫ్లై ఓవర్ ని కట్టాలని నిర్ణయిస్తుంది. అది కట్టాలంటే దానికి అడ్డూగా ఉన్న భవనాన్ని కూల్చాలి. అలాగని ప్రభుత్వం ఒక నోటీసు జారీ చేస్తుది. తరతరాలుగా వస్తున్న ఆస్తి, అన్నదానం సంప్రదాయం పోగొట్టుకోకూడదని కమల్ చెన్నై రావడం జరుగుతుంది. ఇక సినిమా అంతా ఇంటిని కాపాడుకోవడం కోసం కమల్ శకుని లాగా ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ సాగుతూ ఉంటాడు.

కమల్ చెన్నై వచ్చాక ఆటో డ్రైవరుతో (సంతానం) పరిచయమవుతుంది. ఇతని పేరు రజని అప్పాదురై. కమల్, రజనీ ... వీళ్ళిద్దరి మధ్య మంచి కామెడీ నడుస్తుంది.  ఫస్ట్ హాఫ్ అంతా పులిహారా కామెడీతో సరదాగా నడుస్తుంది. మధ్య, మధ్యలో హీరోయినుతో లవ్ ట్రాక్ అడ్డంగా నడిచి సెకండ్ హాఫులో అడ్రెస్ లేకుండా పోతుంది. దర్శకుడు ఇక్కడ కథకి ప్రాముఖ్యం ఇచ్చి హీరోయిన్ని దూరంగా పెట్టేసాడేమో!    


స్వామీజీ పాత్రలో నాజర్ సరదాగా ఉన్నాడు.  రాధిక, రోజా వాళ్ళ పాత్రలలో బాగా చేసారు. కార్తిక్ నటన బాగుంది. ప్రణిత ఓకే!  మొదటి పాటలో సైదాపేట, మురుకు, వడ చూసి నాకు సూళ్ళూరుపేట గుర్తుకు వచ్చింది. టైం పాస్ సినిమా, ఒకసారి చూడచ్చు.