Tuesday, July 10, 2012

మొదటి బెంచి నుంచి చెంగాయిజం.....



మనందరికీ వెనక బెంచీలో కూర్చుని అల్లరి చేసే వాళ్ళు తెలుసు. ముందు బెంచీలో నుండి కూడా అల్లరి చెయ్యొచ్చని నాకు మొన్న నాటా సభల్లోనే తెలిసింది.  ఇపుడు మీ అలోచనంతా అల్లరి మీద కాదు, ఏమిటి ఈ చెంగాయిజం ? అని అలోచిస్తున్నారని నాకు తెలుసు. ఒకవేళ మీరు అలోచించకపోయినా నేను చెప్పాలనుకున్నది ఇక్కడ చెప్పేస్తా.

చెంగాయిజం అనే మాట మా కాలేజీలో పుట్టింది. ఇంతకు ముందు ఉందేమో? పురావస్తు శాఖకే తెలియాలి! చెంగాయిజం అంటే ఇదొక అల్లరి, గలాభా, రౌడీయిజం (కామెడీ) లాంటిదనమాట. ఊరికి సెంటరులో కూర్చుని నలుగురితో కాఫీ, చాయ్ తాగుతూ సొల్లు మాట్లాడుతూ ఉంటే "ఏంది బా..చెంగాయిజం చేస్తున్నావా?" అంటారనమాట. ఈ చెంగాయిజం ఆఫీసులో చెయ్యచ్చు, స్కూలు, కాలేజీ, ఊరు నడిబొడ్డునా ఇలా ఎక్కడయినా చెయ్యచ్చు.

నాటా సభల్లో అవధానం గురించి మాట్లాడమని ప్రముఖ అవధానిగారయిన శ్రీ నరాల రామిరెడ్డిని వేదిక పైకి పిలిచారు. రామిరెడ్డిగారు తన అనుభవాలని చెబుతూ కొన్ని పద్యాలు పాడుతూ అందరినీ అలరించారు.

ఒకసారి ఒక సభలో రామిరెడ్డిగారు అవధానం చేస్తూ ఉండగా ఒకాయన "రెడ్డి గారు? జయప్రద, విజయశాంతి, ఇంకెవరో హీరొయిన పేరు చెప్పి...ఈ ముగ్గురు మీద ఒక కవిత చెప్పండి" అని అడిగారట.

రెడ్డి గారు ప్రశ్నని మనకి వివరిస్తూ "జయప్రద, విజయశాంతి, జమున (అనుకుందాం) లని వాడుకుని ఒక కవిత నన్నడిగారు" అన్నారు.

ఇది వినగానే ముందు వరుసలో కూర్చున్న శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు చటుక్కున "ఏమిటీ? ఆ ముగ్గురు హీరోయిన్లని వాడుకుని ఒక పద్యం రాయాలా? " అని రెడ్డిగారి మీదకి పంచ్ విసిరారు. రామిరెడ్డిగారు సరి దిద్దుకుని కవిత చెప్పారు.

పద్యాలు పాడి, పాడి నరాల రామిరెడ్డి గారి గొంతు ఎండిపోయిందేమో? వేదిక మీద తాగడానికి నీళ్ళు కనపడకపోయేసరికి ముందు వరసలో కూర్చున్న ఇంకొక అవదానిగారయిన వరప్రసాద్ గారిని "వాటర్" అని సైగ చేసి అడిచారు. రామిరెడ్డిగారి బాగులో వాటర్ బాటిల్ ఉందనమాట, కడిమెళ్ళ గారిని అడిగి తీసుకుందామని అనుకున్నారు.

కడిమెళ్ళగారు కూడా ఏమాత్రం తడుముకోకుండా బాగు తెరిచి "క్వార్టరా...వాటరా" అని అడిగారు.



7 comments:

@NagPingili said...

Hahahaa... good spontaneity :))
BTW, manam ERNDC lo chesina chengaaism gutochchindi :))

శ్రీ said...

హహహ....

Dr.Pen said...

I missed meeting you then. Are you on FB?

శ్రీ said...

Thanks

శ్రీ said...

I added you on facebook and google +

Rama Prasad said...

viragadeesaaru !

శ్రీ said...

థాంక్స్ మాస్టారూ...