Thursday, November 19, 2015

పెళ్ళి పుస్తకం - 2





అవి నాష్ విల్ లో ఒక సంవత్సరం అరణ్యవాసం ముగించుకుని మళ్ళీ డెట్రాయిట్ చేరుకున్న రోజులు. ఒక సంవత్సరం డెట్రాయిట్ కి దూరంగా ఉండడం ఒక రకంగా మంచిదే అయింది. రెండవసారి తిరిగి వచ్చినపుడు చాలావరకు ఆశాజనకంగానే జరిగిందని చెప్పచ్చు. పరిస్థితులు కూడా చక్కబడుతున్నాయని ఇంట్లో వాళ్ళు మళ్ళీ పెళ్ళి చేసుకోమని ప్రోత్సహించడం జరిగింది. నాకూ ఒక తోడు అవసరమనిపించి నాకు సరిపడే జోడిని వెతుక్కునే పని మొదలుపెట్టాను.

నేను ఒకటో తరగతిలో ఉన్నపుడు మా కుటుంబం నెల్లూరు నుండి పొదలకూరు రావడం జరిగింది. ప్రభుత్వం మాకు ఇచ్చిన ఇంట్లో అన్నీ సర్దుకుని స్కూళ్ళలో చేరాక మా పెద్దక్కను తనతో పాటూ చదువుతున్న ఒక అమ్మాయి "మీరు ఏమట్లు?" అని అడగడం జరిగింది. దానికి మా అక్క "మేము సూపర్వైజర్లు" అని చెప్పడం జరిగింది. ఈ సంభాషణ నాకు అర్థమవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మా నాన్న ఉద్యోగరీత్యా అన్ని ఊర్లు తిరుగుతుండడంతో మేము ఒక సామాజిక వర్గానికి చెందిన వారుగా గుర్తించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అందరూ మనవాళ్ళే అన్న వాతావరణంలో పెరగడం కూడా దీనికి తోడ్పడింది.

అందుకే పెళ్ళి విషయం గుర్తు వచ్చేసరికి నేను చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు నా భవిష్యత్తుని నేను ఎంచుకునేలా చేసింది. అప్పుడు నాకు అంతర్జాలం ద్వారా షాలిని పరిచయం అయింది. కాన్సాస్ లో చదువుకుంటూ ఉన్న షాలినిని ఒకసారి చూసి ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. ఇంట్లో వాళ్ళకి షాలిని గురించి చెప్పడం వాళ్ళు సరే అనడం జరిగిపోయింది. కులాంతర వివాహానికి మా ఇంట్లో పెద్ద అడ్డు చెప్పలేదు. షాలిని వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద ఇబ్బంది లేకుండానే పెళ్ళికి ఒప్పుకోవడం జరిగింది.

ఇద్దరం అమెరికాలోనే ఉన్నాము కాబట్టి ఇక్కడే పెళ్ళి చేసుకుందామని అనుకున్నాము. మా ఊరిలోనే పంతులు గారిని కలిసి మంచి ముహూర్తం పెట్టించుకుని స్వామి నారాయణ్ గుడిలో నవంబరు 19th 2005 లో పెళ్ళి చేసుకోవడం జరిగింది. మా పెళ్ళి సరదాగా స్నేహితుల మధ్య జరిగింది. సింగపూరులో ఉన్న మా మూడో అక్క, కాలిఫోర్నియా నుండి రెండో బావ పెద్ద తమ్ముడు రావడం జరిగింది. షాలిని తమ్ముడు, బంధువులు కూడా బాగానే వచ్చారు. కొత్తపాళీ గారు కూడా సతీసమేతంగా రావడం జరిగింది.

ఈరోజుకి మా పెళ్ళి పుస్తకానికి పది సంవత్సరాలు నిండాయి. ఈ పది సంవత్సరాలు నల్లేరు మీద బండి లాగా సాఫీగా ఏమీ వెళ్ళలేదు. అలాగని బండికి అడ్డంకులు కూడా ఏమీ లేవు.

6 comments:

Kottapali said...

శుభం. మీకిద్దరికీ ఆశీస్సులతో కూడిన శుభాకాంక్షలు

శ్రీ said...

ధన్యవాదాలు అండీ!

kk said...

super

సుజాత వేల్పూరి said...

మీ ఇద్దరికీ వివాహ దినోత్సవ శుభాకాంక్షలండీ!

teresa said...

Many Happy returns Sri :)

శ్రీ said...

Thank you Sam, KK, సుజాత గారు, తెరెసా గారు!