Thursday, April 10, 2008

ప్రేమ - ఉన్మాదం

గత 10 సంవత్సరాలుగా ప్రేమోన్మాదుల అనాగరిక చర్యలు బాగా పెరిగాయి. నిన్న విజయవాడలో ఇంజినీరింగ్ 2 వ సంవత్సరం చదువుతున్న అమ్మాయిని గాయపరచి తన మీద ఆత్మహత్యప్రయత్నం చేసుకున్నాడు ఒక ఉన్మాది. కొన్ని నెలల ముందు అయేషా ని దారుణంగా హత్య చెసాడు ఒక (ఇంకా) గుర్తుతెలియని ఇంకొక ఉన్మాది. ఇలా ఈమద్య జరిగిన ప్రేమోన్మాద దుర్ఘటనలు ఈనాడు పత్రికలో వేసారు.

ప్రతి దుర్ఘటనలొ అమ్మాయిని కొన్ని నెలలుగా కాని, సంవత్సారాలుగా కాని వేధించడం జరిగింది. లేకపోతే అమ్మాయికి పెళ్ళి కుదరడం, ఇది వెంటపడిన అబ్బాయిని పిచ్చివాడిగా చేయడం జరిగింది. ఇటువంటి దుర్ఘటనలు ఇక పై జరగకుండా ప్రభుత్వం మహిళలకు తగిన భద్రత కలిగించాలని నేను, ఇల చాలా మహిళాసంఘాలు కోరుతున్నాయి.

ఇటువంటి దుర్ఘటన జరుగుతుందని ప్రభుత్వం ముందే ఊహించకపోవచ్చు. కాని తన వెంట పడుతున్న వెధవల గురించి అమ్మాయి మాత్రం జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. ఇటువంటి ఉన్మాదుల బారి నుండి తమను తాము రక్షించుకోవడానికి ఈ కింద జాగ్రత్తలు తీసుకోండి.

1) ముందుగా మీ వెంట పడుతూ, మిమ్మల్ని ఇబ్బందిపాలు చేస్తున్న వ్యక్తిని సున్నితంగా వారించండి.

2) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి గురించి మీ తల్లిదండ్రులకి తప్పకుండా చెప్పండి. మీ తల్లిదండ్రులకు మీ అందోళన వివరించండి. ఇది చాలా ముఖ్యమయిన విషయం.

3) మీరు చదువుతున్న స్కూలు హెడ్ మాస్టర్ కి లేదా మీరు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేయండి.

4) మీ పరిథిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని వేధిస్తున్న వ్యక్తి మీద ఫిర్యాదు చేయండి.

ఈ పై జాగ్రత్తలు తీసుకుంటే ఉన్మాదుల దుశ్చర్యలను అరికట్టవచ్చు.

ఇక తల్లిదండ్రులు కుడా తమ అమ్మాయితో అపుడపుడూ మట్లాడుతూ, స్కూలులో కాని, కాలేజీలో కాని అమ్మాయికి ఇబ్బందిగా ఉందేమో కనుక్కోవాలి. తమ అమ్మాయిని ఎవరన్నా యేడిపిస్తున్నారంటే ఆ అబ్బాయి వివరాలు కనుక్కుని వాల్లా తల్లిదండ్రులని కలిసి ఈ విషయాన్ని వాళ్ళ ద్రిష్టికి తీసుకెళ్ళాలి. వారి నుండి సరి అయిన సహకారం రాకపోతే ఇక లోకల్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వాలి. అంతే కాకుండా తమ కూతుర్ని రోజూ స్కూలులో కాని, కాలేజీ లో కాని దగ్గరుండి దింపే ప్రయత్నాలు చేయాలి.

31 comments:

Naveen Garla said...

ఈ పాపాలలో మన సినిమాలు, టీవీలకు భాగం ఉందనిపిస్తుంది

Anonymous said...

అన్నిటికన్నా ముందు మీరు అబ్బాయలిని రెచ్చగొట్టడం మానండి

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మీరు రాసిన జాగ్రత్తలు ఎవరికోసమో అర్థం కాలేదు. ఇందులో అమ్మాయిల పాత్ర ఎంతవఱకు ? అనేది ఇంకా పరిశోధించకుండా మిగిలిపోయిన అంశం. వారిలో బాధితురాళ్ళు ఉన్నట్లే బాధకురాళ్ళు కూడా గణనీయంగా ఉన్నారు.

౧. ఏ పరిచయమూ, స్పర్శా, చనువూ లేని అమ్మాయి మీద ఎవడికీ కసి ఉండదు. చంపడాలూ, దాడులూ ఎట్టి పరిస్థితుల్లోను సమర్థనీయం కావు. కాని ఇది మనం గట్టుమీద కూర్చున్నవాళ్ళం అనే మాట. ఆవేశానికి రాజ్యాంగాలు లేవు. అంత కసిగా చంపాలనిపిస్తోందంటే - ఆ అమ్మాయి అతన్ని నమ్మించి చేసిన ద్రోహం ఎలాంటిదో పరిశోధనీయం.

౨. అమ్మాయిలకు స్వేచ్ఛ పెరిగాక ఈమధ్యకాలంలో వాళ్ళలో కొందఱు అవసరానికి మించి దేశముదురులైన వాస్తవాన్నినిర్లక్ష్యం చెయ్యలేం. ఇక్కడ ఏం జరుగుతోందంటే - అబ్బాయి అమ్మాయిని నమ్మించి మోసం చేస్తే దానికి మౌనపోరాటం అంటూ పెద్దయెత్తున పబ్లిసిటీ లభిస్తోంది. అదే, అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఆ అబ్బాయిలు దాడులకు పాల్పడుతున్నారు.

౩. మనం పరిస్థితిని నిజంగా నిజాయితీగా చక్కదిద్దాలంటే, ప్రేమలూ, ప్రేమపెళ్ళిళ్ళూ విజయవంతం కావాలంటే ముందు అబ్బాయిల పట్ల మన ఆలోచనాకోణం మారాలి. వాళ్ళని మోటపశువుల్లా ఏది జరిగినా దులుపుకుపోయే దున్నపోతుల్లా చూడకుండా మనసున్న మనుషుల్లా హ్రుదయమున్న ప్రేమికులుగా చూడాలి. వాళ్ళ సెన్సిబిలిటీస్ ని సక్రమంగా అర్థం చేసుకోవాలి. ఆ వాతావరణం లేనప్పుడు ఒక చదువుకున్న అబ్బాయిని ఉన్మాది అని ముద్రవేసి అతని నోరునొక్కెయ్యడం, తన తరఫున తాను చెప్పాలనుకున్న తన వెర్షన్ చెప్పనివ్వకపోవడం మానవత్వం కాదు. అంతకుముందురోజు వఱకూ మంచివాడుగానే చెలామణీ అయిన కుఱ్ఱవాడు హఠాత్తుగా ఉన్మాది అయిపోడు. ఒకవేళ అయ్యాడంటే దానికి కారకులు/కారకురాళ్ళు తప్పకుండా ఉంటారు. This branding is trial by media. ఇది అంతిమంగా ఆడపిల్లలకే మంచిది కాదు.

స్త్రీపురుష సంబంధం రెండువైపులా పదునున్న కత్తి. ఆ విషయం అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి. ఊరికే అబ్బాయిలకి నీతులు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు.

శ్రీ said...

నవీన్ గారికి,
అవును నవీన్ గారు సినిమాలు, టీవిలకు భాగం ఉంది.
అనానిమస్ గారికి,
అమ్మాయిలు రెచ్చగొడితే అబ్బాయిలు సమ్యమనం పాటించాలి.
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారికి,
నేను 'అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి' అని రాసానండీ! మీరు మరి కొన్ని మంచి విషయాలు చెప్పారు! చాలా సంతోషం!

సుజాత వేల్పూరి said...

ఇలా అమ్మయిలపై దాడులు జరగడం ఎప్పటినుంచి మొదలైందో గమనించండి! దాదాపుగా పదేళ్ళ నుంచి! పదేళ్ళ క్రితం ఎందుకు జరగలేదు? ఎందుకంటే, పదేళ్ళ క్రితం అమ్మాయిలకి, ఇప్పటి అమ్మాయిలకి ఎంతో తేడా ఉంది కాబట్టి! ఎంతో మార్పు వచ్చింది. అనారోగ్యకరమైన మార్పు.

తోటి మగ విద్యార్థులతో 'ఏరా' 'పోరా ' అంటూ అతి చనువు ఇవ్వడం, దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకునే అవకాశం ఇవ్వడం.....చివరకు దాన్ని కేవలం 'స్నేహంగా' తీసుకోవాలనడం...ఇవన్నీ తల్లిదండ్రులు గమనించి వారించవలసిన విషయాలు.

ఇక పట్టించుకోవలసిన ఇంకో విషయం...వస్త్రధారణ!దీన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.సగం అనర్థం ఇక్కడే మొదలవుతుంది.

ఆ అమ్మయి నమ్మించి చేసిన నమ్మక ద్రోహం ఎలాంటిదో పరిశోధనీయం! నిజమే! జెమిని న్యూస్ రీడర్ కేసులో ఇదే జరిగింది.
నమ్మక ద్రోహానికి తగిన శాస్తి జరగాలంటే వాళ్లని ఏకంగా చంపి పారేయడమే పరిష్కారం కాదు. కర్నాటకలో భార్యా బాధితుల సంఘం ఉంది తెలుసా! అలాగే మీరూ సంఘాలు పెట్టండి, మిమ్మల్ని మోసం చేసిన అమ్మాయిల్ని బయటకు లాగండి! వాళ్ల తప్పుంటే వాళ్ల మీద కేసు పెట్టి పరువు తీయండి! ఒకసారి ప్రాణం తీస్తే ..మళ్ళీ పోయగలుగుతారా? వాళ్ల సంగతి అలా ఉంచి...మీ భవిష్యత్తుని ఏం చేయదల్చుకున్నారు? మీ జీవితానికి విలువ లేదా? ఒక అమ్మాయి కోసం....మీకు ఫ్యూచర్ లేకుండా చేసుకుంటారా? మీ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల నోట్లో మట్టేనా?

ఇలాంటి వెర్రిబాగుల వాళ్లని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వీళ్ళ తొందరపాటుకి వీళ్ళకి కూడ శిక్ష పడిందని సర్ది చెప్పుకోవాలి.

కాకపోతే, సమాజంలో ఆడపిల్ల శీలానికి విలువ అపారం కాబట్టి, ఆడపిల్లలు, వాళ్ళ తల్లి దండ్రులు జాగ్రత్తగా ఉండి తీరాలి. మగపిల్లలకు దూరంగా ఉండమని కాదు, స్నేహానికి, ప్రేమకు, మధ్య ఉన్న సన్నని తెరను అర్థం చేసుకోవడం పిల్లలకు నేర్పాలి.

Ray Lightning said...

అమ్మాయి వస్త్రధారణదా తప్పు !!? ఒకసారి యూరపులో అమ్మాయిల వస్త్రధారణ ఎలాఉంటుండో చూడండి. ఇలాగ హత్యలు ఏమన్న హత్యలు జరుగుతాయా ? మనదేశంలో మనిషి ప్రాణానికి విలువలేదు. రోజుకి ఎంతమంది దిక్కుమాలినచావులు చావట్లేదు ? పేపర్లకెక్కేవి పదిశాతం కూడా కాదు.

అందులోనూ ఆడవాళ్ళంటే ఏమంత గౌరవం లేని సమాజం మనది. తక్కువ కులాలవాళ్ళంటే పట్టింపు లేదు. వారి ఆడవాళ్ళంటే మరీ విపరీతమైన చులకన. సిగ్గుపడాల్సిన విషయాలు బోలెడున్నాయి.

వీటన్నింటినీ వదిలేసి, "అమ్మాయిలు రెచ్చగొడుతున్నారు, కవ్విస్తున్నారు, కనుక ఎవడొ తిక్కవెధవ రెచ్చిపోయి హత్యచేస్తే, అది వాడి తప్పు ఎందుకవుతుంది ? "

ఇలాగ అడగడానికి మనసెలా ఒప్పుతుందో నాకు అర్థం కావట్లేదు !

Anonymous said...

@ కిరణ్ ఉరఫ్ Ray Lightning
యూరోపులో అమ్మాయిలు, పిఱుదుల్ని అడ్వర్టైస్ చేసుకోవడంలో అర్థం వుంది. ఎందుకంటే అక్కడ వారు సెక్సుకు తయ్యారు కాబట్టి. వాళ్లు ఇచ్చే యాడ్లో, మీకు దొరికే ప్రాడక్టునే చూపిస్తున్నారు.

కానీ మన భారతీయ అమ్మయిల ఆలోచన నాకు అంతుపట్టుటలేదు. Why do they flaunt their *&^%$ asses when they dont want to get laid ? అలాంటివి అప్పటికే పెద్దమనుషులయ్యి పదేళ్ళయిన అబ్బాయిల్ని ప్రేరేపించడమే అవుతుంది. అలా అని వాళ్లని చంపేయడం పరిష్కారం అవదు.

నేను ఇక్కడ అందరు అమ్మాయిల్ని తప్పు బట్టట్లేదు. పైగా ఉత్త అమ్మాయిల్ని మాత్రమే తప్పుబట్టట్లేదు. భారతీయులే ఈ విషయమై చాలా తికమకలో వున్నారు. ఆ తికమక దారిలో మన అమ్మాయిలే మన ముందు నడుస్తున్నారు.

long live fair and lovely !

Anonymous said...

రాకేశ్వర రావు,
మన టీవీ సీరియళ్ళు చూసి మన సంస్కృతి మీద అభిప్రాయం ఏర్పర్చుకుంటే ఎంత బాధ వేస్తుందో, మీ అభిప్రాయాలు చదువుతుంటే నాకు అటువంటి బాధే వేస్తోంది.
తాడెపల్లి వారి దృష్టి కోణం బాగా పరిచయమైనదే.
అన్ని చోట్లా, అన్ని రోజులలలో, ఆడా, మగా అందరిలో అన్ని రకాల వారూ ఉన్నారు, ఉంటారు.
సుజాత గారడిగిన ప్రశ్న సబబనిపించింది. అలా చేశాక మీ భవిష్యత్తు మాత్రం ఏమౌతుందనుకుంటున్నారు? అని.
ఒకటి మాత్రం నిజం, ఎంత విచ్చలవిడిగా ఉంటారు అనుకున్నా, ప్రాచ్యమైనా, పాశ్చాత్యమైనా, మగ పిల్లలకు మనం నేర్పుతున్నది మటుకు అమ్మాయికే ఎక్కువ నష్టం జరుగుతుంది అని. ఆడ పిల్లల విషయంలో గర్భం రావడం అన్నదే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అనీనూ. అమ్మాయిలకు ఒక రకమైన వ్యాధులకు టీకాలు ఇక్కడ కొన్ని రాష్ట్రాలలో mandatory. దాని వల్ల అమ్మాయిలకైనా అబ్బాయిలకినా చెప్తున్నది ఇటువంటి వ్యవహారాలలో జాగ్రత్త తీసుకోవల్సింది అమ్మాయిలే అనే కదా? బురఖాలైతేనేమి, టీకాలైతేనేమి పాఠం అదే. అబ్బాయిల మీద నిజంగా నిజంగా సహృదయం కలిగిన వారంతా దయ చేసి అబ్బాయిలకు విలువలు నేర్పండి.

సుజాత వేల్పూరి said...

కిరణ్,

వస్త్రధారణ గురించి నా అభిప్రాయాన్ని మరో సారి నొక్కి చెప్తున్నానండి, వస్త్రధారణ అనేది మన సంస్కారాన్ని ప్రతిబింబించాలి, గాని ఇంక దేన్నో కాదు. అందునా ఆడపిల్లల వస్త్రధారణ చూడగానే, తేలికగా, చులకనగా అనిపించనే కూడదు! దాని వల్ల, లలిత గారు, తాడేపల్లి గారు చెప్పినట్టు అది ఆడపిల్లలకే నష్టం. నేనేదో శతాబ్ద కాలం నాటి అభిప్రాయలు చెప్తున్నాననుకోకండి....ప్రాక్టికల్ గా చెపుతున్నాను. హైదరాబాదులో కొంత మంది అమ్మాయిల వస్త్ర ధారణ చూసి, నేను సిగ్గుతో తల వంచుకున్న సందర్భాలు కోకొల్లలు. బెంగుళూరు సరే సరి!(అందరూ అలా ఉంటారని నా అభిప్రాయం కాదు)

ఆడవాళ్లంటే యే మాత్రం గౌరవం లేని సమాజం మనది అని మీరెలా అనగలుగుతున్నారో నాకర్థం కావట్లేదు. గౌరవించదగినట్లు ఉంటే గౌరవిస్తారు. అదే నేను పైన చెప్పింది.

హత్యలు చేసే వాళ్ళని ఎవరూ సమర్థించరు. కాని, ఆ హంతకులు 'వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టారు ' అనే కారణం చెప్పడానికి అవకాశం ఇవ్వొద్దని మాత్రమే అమ్మాయిలకు సలహా!

మీరు వంద చెప్పండి, ఫైనల్ గా నష్టపోయేది అమ్మాయిలు అని తెలిసినపుడు, అల్టిమేట్ గా జాగ్రత్త పడాల్సింది వాళ్ళూ, వాళ్ళ తల్లి దండ్రులూను.

Anonymous said...

శ్రీ గారికి,
మీ పోస్టు విషయం పక్క దారి పడ్తున్నట్టైతే క్షమించండి.
గత పదేళ్ళుగా మాత్రమే అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయా, లేక ఆ విషయాలు ఎక్కువగా వార్తలలో వస్తున్నాయా?
నా వ్యాఖ్యలో అసలు నేను చెప్పదల్చుకున్నది అమ్మాయిలకు ఎక్కువ నష్టం అన్నది నిజం కాదు, ఇద్దరూ నష్టపోతారు అని.
గర్భం రావడంకంటే ఉపద్రవాలు చాలా ఉన్నాయి విచ్చలవిడి ప్రవర్తనతో. అవి అబ్బాయిలకీ, అమ్మాయిలకీ కూడా. అమ్మాయి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు సమాజం అడుగుతుంది, లేదా ప్రోత్సహిస్తుంది, లేదా ఆశిస్తుంది. అబ్బాయిలకు నష్టం లేదు, లేదా ఎక్కువ నష్టం లేదన్న భావం ఆ విధంగా పరోక్షంగా వారికి కలుగుతుంది. అది తప్పు అని, అబ్బాయిలు తమ జీవితానికీ విలువ ఉన్నది అని, బాధ్యత అమ్మాయి వస్త్రధారణ మీదో మరో దాని మీదో వేసి సమాజం చేతులు దులుపుకున్నా అబ్బాయి జీవితం అక్కడ పాడౌతుందనీ ఎక్కువ తెలియజేయాలి అని.
అత్యాచారాలు ఒక విధంగా బట్టలు వేసుకునే వారి మీదే జరుగుతున్నాయని ఎక్కడైనా నిరూపణ అయ్యిందా? అమ్మాయిలు తమ మీద వేలెత్తకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి సరే. ఎన్ని తీసుకుంటే సరిపోతుంది? ఏదైనా అమ్మాయిని అనడానికి, అసలేం జరిగిందో అన్న అనుమానమతో అభాండాలు వెయ్యడానికి సమాజం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. సీతనే అవమానించగల వారు ఉండగా ఏం చేస్తే అమ్మాయిని తప్పు పట్టకుండా ఉంటారు?
అంటే ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోమని నా ఉద్దేశం కాదు.
మన సినమాలు చూడండి. గ్రంథాలయం లేని చోట్ల కూడా సినిమా థియేటరు ఉంటుంది. అందులో చూపించే విలువలు, రెచ్చగొట్టే పాటలు చూస్తూ కూడా అమ్మాయిలది తప్పు, అవి చూసి అమ్మాయిలు చెడిపోతున్నారు, అబ్బాయిలతో ఎక్కువ కలివిడిగా ఉంటున్నారు, ఇలా ఎలా అనగలుగుతున్నారు?
ఇక పాశ్చాత్య దేశాలలో కూడా అమ్మాయిలు అబ్బాయిల expectations కి తగ్గట్టుగానే తయారవుతుంటారు. popular గా ఉండడం కోసం అబ్బాయిలూ, అమ్మాయిలూ తాపత్రయపడుతుంటారు.అక్కడ ఇలాంటి దాడులు ఎక్కువే.
అమ్మాయిలకు ఎన్ని చెప్పినా అబ్బాయిలు can go scotfree అన్న మనస్తత్వం ఉన్నంత కాలం సగం ఫలితాలే ఇస్తాయనడంలో సందేహమా?
ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించుకోవడం కాదు.
అమ్మాయైనా, అబ్బాయైనా ఆత్మ గౌరవం ఉన్న వారు ఇలాంటి పనులు చెయ్యరు. అమాయకత్వం, మార్గదర్శకత్వం లేక పోవడం, వాతావరణ ప్రభావం, ఒక్కోసారి మానసిక అసమతుల్యత ఇలాంటి వాటికి కారణాలు.
ఎవరి జాగ్రత్తలో వారుందాం. తగిన జాగ్రత్తలు నేర్పుదాం. పిల్లలకు మనం available గా ఉందాం. చుట్టు పక్కల గమనించుకుంటుందాం. మనం చెయ్య గలిగినంత, మన చేతుల్లో ఉన్నంత మనం చేస్తూ ఉందాం.

Anonymous said...

నా అభిప్రాయం ప్రకారం.. అమ్మాయిల వస్త్రధారణ వలననే యిలా మొత్తం జరిగి పోవండి..అది ఒక భాగం మాత్రమే.. పెద్ద రోల్ కూడా కాదు..ఎలా అంటే నిన్న మినా కుమ్మరి విషయమే తీసుకోండి..మద్య తరగతి అమ్మయి, ఆ అమ్మయి యేమంత ప్రత్యేక వస్త్ర ధారణ చేసింది చెప్పగలరు..అలాగె అయేషా వ్రుత్తాంతం కూడా.. నా వుద్దేశ్యం జరుగుత్న్న సంఘటనలక ి వస్త్ర ధారణ కి వున్న సంభంధం చెప్పడమే..

యిది అంతా ఒక ఆకర్షణ..హార్మోనుల ప్రభావము..సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేక పోవడము.. అమ్మయి అంటె కేవలం సెక్స్ మాత్రమే అని తరచు తరచు గా తరిచి తరిచి చూపించే మన ఎలెక్ట్రానిక్ మీడియా.. కేవలం ఆకర్షణ తో నే మొదట రెలేషన్ స్తార్ట్ అవుతుంది.. తరువాత నిజా నిజాలు, జీవితం, కెరీర్ అని చూసుకుంటే అయ్యో తప్పు చేశామా అనిపిస్తుంది..అప్పుడు దాన్ని సరిదిద్దుకునే భాగం లో ఎత్తులు, పై ఎత్తులు మొదలవుతాయి.. యి ఎత్తుల లో యెవరు ఎక్కువ నష్ట పోతె వాల్లు వున్మాదులు గా మారి పోతారు..యిక్కడ అమ్మాయిల ది, అబ్బాయిలది యిద్దరది తప్పు వుంది..కాని దాన్ని వాళ్ళ తప్పు అనడము కన్నా, అందుకు ప్రోత్సహించిన చుట్టూ వున్న పరిస్తితులుదే అవుతుంది..అదె అల ప్రేమిస్తూనే , కెరీర్ గురించి, చదువుల గురించి అలోచించిన వాళ్ళ ప్రేమ లు బాగానే వుంటాయి..

అందుకే ప్రతి తల్లి దండ్రులు వాళ్ళ వాళ్ళ పిల్లల కి జీవితం విలువ, ఆ జీవితాన్ని వాళ్ళు ఎలా గడపాలి అనుకుంటున్నారో తెలుసుకొని, ముందు నుండే వారికి ఒక అవగాహన కల్పిస్తు..దిశా నిర్డేశం చేయాలి..అదే సమయం లో ప్రేమ గురించి కూడా చెప్పాలి.. ప్రేమించడము అనేది యే నేరాలు-ఘ్హోరాలు కాదు..అది ఒక బాగం మాత్రమే అని చెప్పాలి.. అంతే.. యిందుకు మన స్కూల్స్ ని ముందు నిందించాలి..మన దేశం లో వున్న విద్యాలయల్లో యే ఒక్కరైనా పుస్తకాల లో వున్న సైన్స్, షోషల్, లెక్కలు తప్పించి , ఎక్కువ ఒక్క ముక్క చెపుతారా?? జీవితపు విలువలు యెవరైనా చెపుతారా?? మన అద్రుష్టం బాగుండి, మన తరగతి లో యెవరైనా ఒక్క విద్యార్థి యిలా కాస్త మంచి విలువలు తో వుంటే, వాళ్ళని చూసి మనం నేర్చుకోవడము తప్పించి.. అందుకే, అక్కడ నుండి మారాలి..ఇంకా , చాలా చేయాలి, యివి అన్ని మనమ్ చేయగలిగినవి, మన చేతుల్లొ వున్నవే.. యి సమస్య కి యెవరో ఒకరని నిందిచడము తగదు.. అందరము కారణమే, మీరు, నేను..యిలా అందరము.. మారాలి..

దీని మీద వీలు చూసుకొని కూలంకుషం గా స్టడి చేసి ఒక టపా రాయాలని వుంది.. త్వరలోనే స్వీకారం చుడతాను..

Naveen Garla said...

పోలీసు శిక్షణలో మొదట ఈ విషయం చెబుతారంట, "నేరం చేసిన ప్రతి వ్యక్తి ఏదో ఒక కారణం చెబుతాడు...". కారణం ఏదైనా కానీ, వ్యక్తిగత దాడి (శారీరికంగా కానీ / మానసికంగా కానీ)సమర్థనీయం కాదు. వారికి శక్షణ, శిక్ష రెండూ కావలసిందే.
ఎదుటి వాళ్ళు బట్టలు ఇప్పుకు తిరిగారని, ప్రేమను తిరస్కరించారని దాడులు జరిపితే, మనిషికీ కుక్కకి తేడా ఏమిటి?

సుజాత వేల్పూరి said...

కేవలం వస్త్రధారణ వల్ల హత్యలు జరుగుతాయని కాదు. నేను సరిగా చెప్పలేదో, నా అభిప్రాయం సరిగా అర్థం చేసుకోలేదో కాని...విషయం అది కాదు! అసభ్యకరమైన వస్త్రాల వల్ల అవతలి వాళ్ళ(ముఖ్యంగా ఆడపిల్లల) పట్ల చులకన భావం కలగకూడదు. అదే నేను చెప్పింది. ఆడపిల్లల ఆలోచనా ధోరణిలో కూడా అనారోగ్యకరమైన మార్పు వచ్చింది. ప్రతి దాన్నీ ఈజీగా తీసుకోవడం! పురుష స్నేహాల పట్ల జాగ్రత్త వహించి అవి ప్రమాద కరంగా పరిణమించకముందే అందులోని mitive ని గ్రహించాలని నా అభిప్రాయం.

అసలు జీవితం పట్ల సరైన అవగాహన తల్లిదండ్రులు కలిగించకపోవడమే మూల కారణం అనిపిస్తుంది! దీని మీద ఇలా బ్లాగుల్లో కాదు, ఇంకా విస్త్రుతమైన చర్చ జరగాలి.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...
This comment has been removed by the author.
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

నేనిక్కడ వస్త్రధారణ గుఱించి రాయలేదు. అది అసలు వార్తల కెక్కిన సంఘటనతో సంబంధించినది కాదు.

కాని సుజాతగారిని వ్యతిరేకిస్తున్నవారి అభిప్రాయంలాంటిది నేను చాలాకాలం నుంచి వింటున్నాను. మేము అలా డ్రెస్ చేసుకుంటే మీరు రెచ్చిపోవాలా ? అని ! అందరూ రెచ్చిపోవడంలేదేం, సదరు క్రిమినల్ తప్ప ! అని. ఒక పాలు తాగే పసిపాప అడగాల్సిన ప్రశ్న ఎదిగామనుకుంటున్న ఆడవాళ్ళు అడుగుతున్నారు.

క్రిమినల్స్ ఎక్కణ్ణుంచో ఊడిపడరు. వాళ్ళు మనమధ్యలోంచి వచ్చినవాళ్ళే. మనలో అణచుకోబడే భావాలు వాళ్ళల్లో అణచుకోబడవు. అంతే తేడా ! (పరిస్థితులు అనుకూలిస్తే రేపు మనం కూడా క్రిమినల్స్ అవుతామేమో ! ఏమిటబ్బా అంత ధీమా ?) అందరూ అణచుకుంటారని, అణచుకోవాలనీ ఎందుకనుకుంటున్నారు ? అందరినీ ఒకేలా పుట్టించాడా దేవుడు ? ఒళ్ళు కనపడేలా డ్రెస్ చేసుకున్నదాని వాలకాన్ని సెక్సుకు ఆహ్వానంగా భావిస్తాడు మగవాడు. ఇందులో మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి అనే తేడా లేదు. ఇది అర్థం కానట్లు ఫెమిస్టులు నటించడం వాళ్ళు వేసే మగవేషాల్లో ఒక భాగం

సుజాత వేల్పూరి said...

తాడేపల్లి గారు,

మీ అంత ఓపెన్ గా చెప్పడానికి సంకోచించాను.

Ray Lightning said...

> పాలు తాగే పసిపాప అడగాల్సిన ప్రశ్న
ఉట్టికెక్కిన ముసలివాళ్ళలా ఆలోచించాలేమో మరి.

మన సమాజం మారుతోంది. దీనికి తగ్గట్టు మన అలవాట్లు, ఆలోచనలు మారాలి. ఆడవాళ్ళకి ఒకప్పుడు ఆర్థిక హక్కులు లేవు. ఉద్యోగం చేసేవారు కాదు. ఇంట్లో మగడికి, అత్తమామలకి ఎదురుచెప్పే అవకాశం లేదు. ఇప్పుడు వారు ఉద్యోగం చేస్తున్నారు. వారి ఇష్టం వచ్చినట్లు వారు ఉండగలరు. బట్టలు ఎలా వేసుకోవాలో, ఎవ్వరితో ఎలా మాట్లాడాలో అది పూర్తిగా వారి ఇష్టం.

నువ్వెలో ఉన్నావో అని ఆలోచించడం వరకే నీ వంతు. మిగతావాళ్ళ గురించి పట్టింపు, బాధ ఎందుకు!?

బట్టలు ఎలావేసుకున్నా, ఎంతదూరంగా మగ్గినా, రేపులు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. హత్యలు చేసేవాళ్ళు చేస్త్తూనే ఉంటారు. పదేళ్ళ పసిపాపల్ని కూడా అత్యాచారం చేసి చంపివేసిన కేసులున్నాయి మనదేశంలో. ఈ పాపాయలు మరి ఎలా కవ్వించారో నేరగాళ్ళని.

ఈ నేరాలని అరికట్టాలంటే ఎలా ముందుకెళ్ళాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కాలాస్త్రి గారు మంచిగా వివరించారు. మధ్యలో అమ్మాయిల కవ్వింపులు, వస్త్రధారణలు అంటు లొసుగులు వెదికింది ఆలోచనలో పరిపక్వతా ? లేక అమాయకత్వమా ? లేక సంకుచిత మనస్తత్వమా ?

Anonymous said...

Ray lightening gaaru

ఈ మొత్తం టపాలనూ గమనిస్తున్నాను. వాళ్ళు ఎత్తి చూపినవి లొసుగులు కావు. మూల కారణాలు. సమాజంలో వచ్చే మార్పుల కారణంగానే మనుషుల్లో నేర స్వభావం పెరుగుతుంది. అశ్లీలత అనేది నేరాన్ని ప్రేరేపించే స్వభావం కలిగిఉందా లేదా ఆలోచించండి. కేవలం బట్టల వల్లే రేపులు, హత్యలు జరుగుతాయని సుజాత గారి అభిప్రాయం కాదేమో ఆలోచించండి. తాడేపల్లి గారు చెప్పిన పచ్చి నిజాని ముసుగులు లేకుండా అంగీకరించడమే మన మగాళ్ళు చేయాల్సిన పని.

స్త్రీల పట్ల తేలిక భావం ఎప్పుడు ఏర్పడుతుందో, వారి జీవితాల పట్ల కూడా తేలిక భావం ఏర్పడుతుందని తమరు గుర్తించారు. ఆర్థిక స్వాతంత్ర్యం వల్ల స్త్రీలు పెంచుకోవలసింది ఆత్మ విశ్వాసం. లోపల దాచుకోవలసిన వాటిని బయట పడెసే బట్టలు కాదు.

స్త్రీలు అశ్లీలమైన బట్టలు వేసుకుంటే చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు రాయవలసిన వ్యాఖ్యలు మీలాంటి చదువుకున్న వాళ్ళు రాస్తుంటే, ఆడపిల్లల తండ్రిగా బాధ వేస్తోంది.

Ray Lightning said...

నేను ఎవ్వరిని ఎలా ఉండాలో చెప్పట్లేదు. ఎవరి జీవితానికి సంబంధించి వారికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్పాను అంతే. ఆడవాళ్ళంటే తల్లిదండ్రుల, భర్తల రక్షణలో బ్రతకాలి - అని నేను నమ్మను. వారి గురించి వారు ఆలోచించుకోగలరు అని నా నమ్మకం. లోపలదాచుకోవలసినవి ఏమిటో, బయటకి పెంచుకోవలసినవి ఏమిటో డిక్టేటు చెయ్యడానికి నేనేమీ శ్రీకృష్ణపరమాత్మున్ని కాను. అది వాళ్ళిష్టం.

ఆడవారిమీద నేరాలు చెయ్యకుండా, చట్టం ప్రకారం వారికి ప్రభుత్వమే రక్షణ కల్పించాలి, మామూలు పౌరులకి మళ్ళే. ఈ బాధ్యతని కుటుంబంలోని భర్తల, తల్లిదండ్రుల మీదకో, బజ్రంగదళాల మీదకో నెట్టివేయకూడదు.


నాకు సంబంధించి నేను ఎంత స్వేచ్ఛగా ఉండాలనుకుంటానో, మిగిలినవాళ్ళు కూడా అంతే స్వేచ్ఛగా ఉండాలి అని నా అభిలాష.

ఈ విషయంపై నా బ్లాగులో వివరంగా ఒక టపా ప్రయత్నిస్తాను. కాళాస్త్రి గారి బ్లాగుని హైజాక్ చెయ్యడం ఎందుకు.

రాధిక said...

బ్లాగరు చెప్పినదానిలో తప్పేముంది?ఆయన మగవాళ్ళకు దూరం గా వుండమనలేదు.వేధించే వాళ్ళకు దూరం గా వుండమన్నారు.
ఏదన్నా ఘోరం జరిగినప్పుడు తప్పు రెండువైపులా వుండివుండొచ్చు.లేదా అవతలి వాళ్ళదే అయి వుండొచ్చు.అంత మాత్రం చేత నరికేయడాలు,యాసిడ్ పోసేయడాలు ఎంతవరకు సమంజసం?
అతిగా ప్రవర్తించేవాళ్ళూ ,అభ్యంతరకరం గా బట్టలేసుకునేవాళ్ళూ మాత్రమే వేధింపులకు గురవుతున్నారా?
ఇంతకుముందు స్త్రీ లు చాలావరకూ ఇంటికి మాత్రమే పరిమితమయిపోయేవారు.అప్పట్లో ఇంట్లోకి చొరబడి మరీ అత్యాచారాలు చేసిన కధలు,వార్తలు చాలానే విన్నాము.ఇప్పుడు స్త్రీ పొద్దట లేచినదగ్గరి నుండీ పురుషునితో సమానం గా సంఘం లో తిరగవలసి వస్తుంది.రెండేళ్ళ పిల్లలకి కూడా భద్రత లేదు.పోనీ అరవయ్యేళ్ళవాళ్ళకన్నా వుందా అంటే లేదనే చెప్పాలి.మొన్నే టీవీలో చూపించాడు. క్రైం సినిమాలు చూడొద్దని కట్టడి చేస్తుందని బామ్మని చంపేసాడు ఒక మనవడు.
ఆడవాళ్ళ సమస్యలను గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఫెమినిస్టులెలా అవుతారో నాకు అర్ధం కావట్లేదు.ఇప్పుడు టాపిక అది కాబట్టి తప్పు ఏవైపుందో అని మాట్లాడుతున్నాము.రేపు టాపిక్కు మగాడయితే అతని కొ0అణం లోంచి మాట్లడేవాళ్ళు కూడా చాలామంది వుంటారు.వాళ్ళని ఏమంటారో? అయినా ఇలాంటి హింసా ధోరణులు మగవాళ్ళలోనే ఎక్కువగా ఎందుకుంటుందో?
అయినా చీరలో లేని అసబ్యత,నిండుగా కప్పి వుంటే చుడీదార్లలోను,జీన్స్ లోను వుందా?
పిల్లవాడికి పాలిచ్చే తల్లిని కూడా వేరే దృష్టితో చూసేవాళ్ళనుండి స్త్రీకి భద్రత ఎప్పుడో?

krishna rao jallipalli said...

1) ముందుగా మీ వెంట పడుతూ, మిమ్మల్ని ఇబ్బందిపాలు చేస్తున్న వ్యక్తిని సున్నితంగా వారించండి.

2) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి గురించి మీ తల్లిదండ్రులకి తప్పకుండా చెప్పండి. మీ తల్లిదండ్రులకు మీ అందోళన వివరించండి. ఇది చాలా ముఖ్యమయిన విషయం.

3) మీరు చదువుతున్న స్కూలు హెడ్ మాస్టర్ కి లేదా మీరు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేయండి.

4) మీ పరిథిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని వేధిస్తున్న వ్యక్తి మీద ఫిర్యాదు చేయండి.
========
అమ్మయలూ ... ఫై వాటిని ఏమి పాటించాల్సిన అవసరం లేదు. మీరు కూడా తిరగబడండి. మీ బ్యాగ్ లో ఒ కత్తి ఉంచుకొని .. నా కొడుకులను పోడిచేయ్యండి. మనోహర్, మీనా కుమారి ని పొడిచిన ఆ నా కొడుకు (లంజ కొడుకు పేరు గుర్తుకు రావడం లేదు).. ఇటువంటి లంజా కొడుకులను.. ఏరి పారెయ్యండి.. ఒక దొంగ నా కొడుకి మెడ కోస్తీ మిగతా లంజా కొడుకులకి కొంచం భయం ఏర్పడు తుందేమో చూద్దాం..

Srinivas said...

ఒక కొత్త విషయం తెలిసింది. అబ్బాయిలలో కొంతమంది వాళ్ళ భావోద్వేగాల్ని అదుపుచేసుకోలేరు కనక వారు రెచ్చిపోకుండా ఉండేందుకుకు గాను అమ్మాయిలంతా బురఖాలు కప్పుకు తిరగవలసిందిగా చట్టాన్ని తీసుకురావడమే గొప్ప పరిష్కారం.

అదే విధంగా మీ దగ్గర డబ్బు ఉన్నందునే దొంగలు దోచుకుంటారు కనక మీరు చిరిగిపోయిన దుస్తులు/బురఖాలు వేసుకు తిరగండి. బజార్లవెంట తిరిగి అవీ ఇవీ కోంటూ డబ్బు తీసి చూపుతూ పాపం బలహీన మనస్కులను ప్రేరేపించకండి.

అన్నిటికంటే ఉత్తమం మీరు ఇల్లు కదలకపోవడం. అలాక్కానీ ఉంటిరా ఇక ఏ నేరాలకీ మీరు కారణమవరు. మిమ్మల్నెవరూ ఏమీ చేయరు.

శ్రీ said...

అందరికి నమస్కారం! అందరి విలువయిన అభిప్రాయాలను చదివాను. మారుతున్న కాలంబట్టి అమ్మాయిలని మీరు చిన్న చిన్న డ్రెస్ లు వేసుకోవద్దు అని చెప్పలేము. వాళ్ళు సంపాదిస్తున్నారు, ఇక టీవీ, సినిమా చూసి మోడరన్ గా ఉందామని అనుకోవచ్చు. ఇక అబ్బాయిలు తగినంత రీతిలో సమ్యమనం పాటించక తప్పదు. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే డ్రెస్ వేసుకున్నారు అని మనం రెచ్చిపోకుండా దాని పర్యవసనాలు బేరీజు వేసుకోవాలి. లేకపొతే అబ్బాయిల బంగారు భవిష్యత్తుకే ఇది ప్రమాదం.

Anonymous said...

ఏవిటండీ, అందరూ అమ్మాయిలు రెచ్చగొట్టడం రెచ్చిపోవటం గురించి మాట్లాడుతున్నారు, జనాలందరూ రెచ్చగొట్టకపోతే నోట్లో వేలేసుకునే పాపాయిల్లా మాట్లాడతారూ? so called అసభ్యంగ బట్టలేసుకుంటేనే అబ్బాయిలు రెచ్చిపోతారు, మిగతా అప్పుడు బుద్ధిమంతులు అంటున్నవారు అసలు నిజంగ ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టి ఎప్పుడైన అమ్మాయిగా ఎలాంటి harassment face చెయాల్సివస్తుందో చేసారా అనిపిస్తుంది. నేను 9th class లో ఉన్నప్పుడు మా tution master నా పొట్ట గిల్లాడు. ఎందుకు నేను అసభ్యంగా మడాల పైకి skirt వేసుకున్నాననా, లేక tutionకి వెళ్ళటమే అసభ్యం అంటారా? 10th లో book shopవాడు చిల్లర ఇస్తూ చేయి గిల్లాడు. ఎందుకు, నేను అసభ్యంగా చుడీదార్ చున్నీ నిండా కప్పుకున్నాననా, లేక shopకి వెళ్ళటం తప్పంటారా? సినిమా హాల్లో వెనకాల నుంచి తంతారు (సినిమాలకి ఆడవాళ్ళం వెళ్ళి మగవాళ్ళని రెచ్చగొట్టొద్దంటారా?). గుడుల్లో లైన్ లో నడుంపట్టుకుంటారు.. అందితే కుదిరితే ఇంకా చాల పట్టుకుంటారు (గుడికి వెళ్ళద్దంటారా). అబ్బా ఒకటనేమి చెప్పాను.. ఎన్నని చెప్పను. ఛీ.. చదువుతో వయసుతో వస్తుంది సంస్కారం అనుకుంటే లేదు. మమూలుగ మనం ఇళ్ళల్లో తీసుకుని online friendsతో share చేసుకోవటానికి పెట్టిన ఫొటోస్.. అమ్మ, పిన్ని, పెద్దమ్మ వయసుండే ఆడవాళ్ళ చీరల్లోంచి కనిపించే నడుములు గురించి ఫొటోలతో సహా బూతు discussions online forumsలో (చీరలే కట్టుకోవద్దంటారా?), US వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ, పెళ్ళాం పిల్లలున్న అంకుల్స్ కొత్తగా జాబుల్లో జాయిన్ అయిన అమ్మాయిలకి లైన్‌లు వేయటాలు, ఇది నాది, అది నీది అనుకోవటాలు, మొహమ్మీదే indirect/direct గా double/direct meaning మాటలు (అసలు ఉద్యోగాలే చేయొద్దంటారా).. ఓహ్ ఎన్ని??? నేనే కాదు, ప్రతీ అమ్మాయి అడగడుగునా ఇలాంటి ఎన్ని చూస్తుందంటే.. ఇవన్నీ normal పట్టించుకోకూడదూ.. excite అవకూడదు, చేసినవాడి మీద గట్టిగా అరవకూడదు, లాగిపెట్టి గూబగుయ్యిమనిపించకూడదు, ఎన్నని parentsకి చెప్తాం.. అక్కడ్నుంచి వాళ్ళు కంగారు పడటం తప్ప, మనదారిన మనం పోవటమే అని అమ్మాయిలు ఒకళ్ళకొకళ్ళం చెప్పుకునేంత, అమ్మాయిలే రెచ్చగొడతారు.. అబ్బాయిలు పాపం రెచ్చిపోతారు.. తప్పు వాళ్ళది కాది అని మీరు చెప్పేంత.

disclaimer 1: అసభ్యం అనేది పూర్తి relative. చీరలు కట్టుకునే వాళ్ళ మధ్యలో skirt వేసుకోవటం అసభ్యం. skirtలు వేసుకునే వాళ్ళ మధ్య shorts, deep neck-sleeveless shirt వేసుకుని తిరగటం అసభ్యం, అవి వేసుకునే వాళ్ళ దగ్గెర ఇంకా చిన్నవి వేసుకోవటం/వేసుకోకపొవటం అసభ్యం.

disclaimer 2: అబ్బాయిలందరూ ఒకటే రకంగా అలోచిస్తారు, chance వస్తే ఎవరైన ఒకే లాగ behave చేస్తారు అని నేను అనను. నాకూ అన్నదమ్ములూ, గౌరవం ఇచ్చిపుచ్చుకునే మగస్నేహితులూ ఉన్నారు. అమ్మాయి వంగితే చాలు ఎం కనిపిస్తుంది అని లొట్టలు వేసుకుని చూసేవరు కూడా తెలుసు.

disclaimer 3: అమ్మయిలందరూ కప్పుకునే తిరుగుతున్నారు, అబ్బాయిలదే దృష్టిలోపం అంతా అని కూడా నేను అనను. నా ఫ్రెండ్స్లోనే పొట్టిగా (రెలేటివ్‌గా అసభ్యంగా) వేసుకునేవాళ్ళున్నరు, which I'm not not okay with, btw.

I totally totally agree with lalitha gari comment. కృష్ణారావుగారు ఐతే అద్దరగొట్టారు. రాధికగారు, శ్రీనివాస్ గారు కూడా.

Anonymous said...

సుజాత గారు, మీకొక విజ్ఞప్తి:

కుర్రాళ్ళ discussion forumsలో కాలక్రమేణ జరిగిన మార్పులు:
2002లో: రోడ్డు పైన ఒకరో ఇద్దరో కాస్త 'హాట్' గా డ్రస్ వేసుకున్న అమ్మాయిల ఫోటోలు అక్కడక్కడా కనిపించేవి. అందరూ సంభ్రమాశ్చర్యాలతో రిప్లై ఇచ్చేవారు.

2004లో: కెమెరాలు కాస్త అందుబాటులోకి వచ్చాయి. అమ్మాయిలు కూడా చుడీదార్ల పైన చున్నీలు వేసుకోవడం తగ్గించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం ప్రారంభించారు. ఇలాంటి అమ్మాయిల ఫోటోల కోశం full threads రావడం మొదలు పెట్టాయి. కేవలం అమ్మాయిల ఫోటోలే కాకుండా కాస్త 'హాట్' గా రోడ్డు పైన తిరుగాడే ఆంటీల ఫోటోలు కూడా దర్శనమివ్వసాగాయి

2006లో: సెల్ ఫోన్ల వాడకం పెరిగింది. అందరి చేతుల్లో కెమెరాలు ఉన్నాయి. ప్రతి చిటీకి చెందిన 'హాట్ హైదరబాద్ గరల్స్ ' 'బిగ్ బజార్ ఆంటీస్ ' తరహా threads కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఎక్కడ చూసినా టైట్ జీన్సులు వేసుకున్న అమ్మాయిలు, బెడ్ రూం వస్త్రధారణతో రోడ్డు పైన తిరుగాడే ఆంటీల ఫోటోలే!!!

2008లో: కెమెరాల్లో మెమొరీ పెరగడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోలే, అది కూడా ఒక్కో నగరానికి కొన్ని threads!!

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే: చున్నీలు తీసేసిన, టైట్ షర్ట్- ప్యాంట్ వేసుకున్న అమ్మాయిలు, లో-కట్లు వేసుకొన్న ఆంటీలు మీరు ఇలా డ్రస్సుల గురించి నిజాలు మాట్లాడడం చదివి.. నిండుగా, పద్దతిగా వస్త్రధారణ చేసుకోవడం మొదలు పెడితే ఆ discussion forums చూసే వేలాది మంది పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా?

కాబట్టి దయచేసి బట్టల సంగతి పక్కన పెట్టి, ఆడువారు ఎంత రెచ్చకొట్టే విధంగా వస్త్రధారణ చేసుకున్నా మగవారు ఎటువంటి భావోద్వేగాలకు లోను కాకుండా ఎలా ఉండాలో చర్చిద్దాం.

సుజాత వేల్పూరి said...

అసభ్యంగా బట్టలు వేసుకోకండర్రా అని అమ్మాయిలకు చెపితే, చాలా మంది వివిధ రకాలుగా ఆవేశంగా స్పందించారు. నా కామెంట్స్ అనీ మొదటి నుంచి వరసగా చదివితే నా భావం మీకర్థమవుతుందేమో ఒకసారి ప్రయత్నించండి. బట్టలు అసభ్యంగా వేసుకున్న వాళ్ళు మాత్రమే అత్యాచారాలకు గురైతే, ఈ పాటికి అందరూ నిండుగా కప్పుకు తిరుగుతుండే వారేమో! అమ్మాయిల్లో ఆధునికత పేరుతో వచ్చిన మార్పుల్లో ఇదొక భాగమని నేనన్నాను. అందువల్ల అందరూ బురఖాలు వేసుకుని తిరగమనీ కాదు. ఆడపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటే మగపిల్లల తల్లి దండ్రులు విర్రవీగమనీ కాదు. (ఇదెలా ఉందంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే, చిన్న భార్య చెడ్డదనేగా అర్థం అన్నట్లుంది)

విలువలనేవి ప్రతి తల్లిదండ్రీ పిల్లలకు (ఆడా మగా తేడా లేకుండా) తప్పక నేర్పాల్సినవే! వాటితో పాటే అమ్మాయిలకు 'ఎక్స్ ట్రా ' జాగ్రత్తలు తల్లులు నేర్పాల్సి ఉందనుకుంటున్నాను.

Badugu గారు,

మీ వ్యంగ్యం, నిరాశ నాకర్థం అయ్యాయి. 'నిజాలు ' మాట్లాడుతున్నానని మీరే అన్నారుగా! చాలు! నిజమెప్పుడూ చేదుగానే ఉంటుంది. నిజం చెపితే నేరమా అని నేనొక పోస్ట్ రాయాల్సి వచ్చేట్టుంది విడిగా! కిరణ్ గారు చెప్పినట్లు, కాలాస్త్రి గారి బ్లాగుని హైజాక్ చేయడం దేనికి, ఎవరి బ్లాగులో వాళ్ళు దీని గురించి చర్చిస్తే సరి!

కాలేజీ రోజుల్లో నేను 'అశ్లీలతా ప్రతిఘటన వేదిక ' అని ఒక స్వచ్చంద సంస్థలో పని చేసాను. గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడిచే 'గాంధీ స్మారక సమితి ' అనుబంధ సంస్థ అది. గాంధీ ఆశయాలని, జీవిత విధానాన్ని విద్యార్థులకు తెలియచేసే క్లాసులు నిర్వహించినప్పుడు, అశ్లీలతకు అసభ్యతకు తావివ్వని వస్త్ర ధారణ, సమ్యమనం పాటించడం ('రెచ్చిపోకుండా' ఉండటం ) వంటి నైతిక విలువల పాఠాలు కూడా ఉండేవి. బహుశా కాలేజీ వదిలి చాలా రోజులైనా, వేదిక వాసనలు ఇంకా వదిలినట్లు లేదు నన్ను.

Anonymous said...

నాకైతే చాలా అంశాలు గుర్తుకొస్తున్నాయి:
- ఏమాత్రం అడ్డూ అదుపూ లేని టి.వి. యాంకర్ల ఆహార్యం
- వాటిని ఆనందిస్తున్న పిల్లలను వారించని పెద్ద్దలు
- చెప్పటానికి కూడా వీలు లేని పేర్లున్న సినిమాలు, వాటిలో నటించే వాళ్ళ చేతలు
- కనీస నైతిక విలువలు, కామన్ సెన్స్ బోధించని మన విద్యాశాలలు (ముఖ్యంగా కార్పొరేట్)
- కుటుంబాలు ప్రతిరోజూ కొంతసేపు కూడా నాణ్యమైన సమయం గడపకపోవడం
(వికారాలు కొద్దిగానైనా దీనివల్ల తగ్గుతాయి)
- అనారోగ్యకరమైన గారాబం, పిల్లలకు మితిమీరిన స్వేచ్చ ఇవ్వడం (కంప్యూటర్ గేమ్స్, బట్టలు, కొంగ్రొత్త పోకడలు)
- కుటుంబంలో పెద్దలు అర్థంలేని ఆరాటాలతో బిజీగా పిల్లలు ఏంచేస్తున్నారో కూడా పట్టించుకోకపోవడం

ఉన్మాదుల్ని తిట్టడం వల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని భావించలేం. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కొద్దిగానైనా మార్పు వస్తే రాబోయే తరాలు కొద్దిగానైనా ఆరోగ్యంగా ఉంటాయి. అది మనందరం తప్పించుకోలేని బాధ్యత అని నేను భావిస్తున్నా.

krishna rao jallipalli said...

నిండుగా బట్టలు కట్టు కొన్నా .. గ్యారంటీ ఏమి లేదు.

శ్రీ said...

కాలాస్త్రి బ్లాగు హైజాక్ అవుతుందేమోనని కిరణ్ గారు, సుజాత గారు వ్యక్తపరిచారు. మీ అభిప్రాయాలని వెల్లడించడంలో యేమాత్రం అలొచించవద్దండీ! నా బ్లాగు మీకు మంచి చర్చా వేదిక అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. అమ్మాయిల హత్యలు చదివి నాకు తొచినంత నేను రాద్దామనుకున్న. మీరందరూ మీ అభిప్రాయాలని స్వేఛ్ఛగా వెల్లడిస్తున్నారు. ఈ చర్చ కొంతమందికయినా మేలు కలిగిస్తే అంతకన్నా ఆనందం యేముంది!

Kapu Kings said...

మొత్తానికి ఈ బ్లాగ్ వలన సుజాత గారి ఉన్నత భావాలను చదవగలిగాను ఈ బ్లాగ్లో సుజాత గారు కీ రోల్ పోషించారు. సుజాత గారు చెప్పింది అద్బుతంగా ఉంది ముందుగా ఈ బ్లాగ్ కలస్తి గారికి ధన్యవాదాలు అంతకంటే సుజాత గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీలైతే మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు.

శ్రీ said...

@ రామా... గారు, చాలా పాత టపాని వెతికి చదివారు. చాలా సంతోషం!