శుక్రవారం మధ్యాహ్నం శైలూ వంటల వెబ్ సైటు చూస్తూ రొయ్యల కూర చేస్తూ ఉంటే ఫోను మోగింది. షికాగో నుండి గణేష్ మాట్లాడుతూ మా లైనులొకి ఇంకొక వ్యక్తిని కలిపాడు.
కొత్త వ్యక్తి నాకు హలో చెప్పి "బాగున్నావా" అన్నాడు. అతని పాత గొంతు గుర్తుకు వచ్చి కాసేపు మాటలు రాలేదు.
కళ్ళ ముందు బాష సినిమాలో రజనీకాంత్ గెటప్పులో "జయచంద్ర" విద్యానగర్ సెంటరులో నడుచుకుంటూ వస్తున్నాడు. వెనక గణేష్, రూపేష్, పురుష్ ...ఇలా పాత స్నేహితులంతా నా కళ్ళముందు మెరుపులా మెదిలారు.
కాలేజీ వదిలాక మధ్యలో ఒకటి, రెండు సార్లు మాట్లాడానేమో? మళ్ళీ ఇపుడే జయచంద్ర గొంతు వినడం. మ ఊరికి వచ్చాడట, వారాంతం మా ఇంటికి రావాలని పట్టుబట్టాను.
శనివారం రాత్రి పదికి మా ఇంటికొచ్చి తలుపు తట్టాడు. సమరసింహారెడ్డి గెటప్పులో దవళ వర్ణపు కుర్తా, పైజామాలో జయచంద్ర దర్శనమిచ్చాడు.
ఎక్కడో కింద పడి నలిగి నిద్రపోతున్న జ్ఞాపకాలని నిద్ర లేపి మరీ పలకరించాము. కాలసముద్ర మధనం చేసి జ్ఞాపకాలని బయటకి తోడాం. ఒకటా, రెండా? మా జ్ఞాపకాలకి ముమైత్ ఖాన్ (పోకిరి నాటికి) వయసుంటుంది. నేను కాలేజీ రోజుల్లో ఇప్పటిలాగే చాలా సున్నితంగా ఉండేవాడిని. గొడవల్లో పెద్దగా తల దూర్చేవాడిని కాదు, అలాగని టూ మచ్ చదివేసేవాడిని కూడా కాదు. కాలేజీలో జయచంద్ర చేసిన చిలిపి పనులన్నీ గుర్తు తెచ్చుకుని నవ్వుకున్నాం. వెనక బెంచిలో కూర్చుని "బాలసుబ్రహ్మణ్యం" ని ఏడిపించడం, కోటలో సినిమాలకి వెళ్ళడం, సెంటరులో "చెంగాయిజం" చేయడం నెమరు వేసుకుని పడీ, పడీ నవ్వుకున్నాం.
ఆ రోజుల్లోనే మాకు ఘన పదార్ధం, వాయు పదార్ధం, ద్రవ పదార్ధానికి తేడాలు తెలిసాయి. అప్పటివరకు సంప్రదాయపు కట్టుగోడల్లో పెరిగిన మాకు ఒక్కసారి చేతిలోకి స్వాతంత్ర్యం రాగానే కొంచెం అల్లరి, ఇంకొంచెం చిల్లరగా తిరిగాం. సెంటరులో ఎగ్గు దోశలు, కాఫీలు, టీలు, కోటలో బీర్లు, కాలేజీలో ప్రేమాయణాలు, పెళ్ళిళ్ళు, గొడవలు, రాగింగులు ఇలా అన్ని పేజీలు తిరగేసాం.
జయచంద్రకి పదవతరగతిలో ఆరో రాంకు వచ్చింది. కాలేజీ చేరిన మొదటిరోజుల్లో జయచంద్రని కొంచెం వింతగా, గొప్పగా, గౌరవంగా చూసేవాడిని. బాగా సరదాగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటూ ఉండేవాడు క్లాసులో. పనిలో పనిగా మా క్లాసులో మిగతా స్నేహితులని కూడా గుర్తుకు తెచ్చుకున్నాం. నా ఆటోగ్రాఫ్ సినిమాలో పాటలాగా "మోటు బావిలో మిత్రుడి మరణం" లాగే మా క్లాసుమేట్ కూడా ఒక దుర్ఘటనలో మరణించాడు. అతన్ని గుర్తు చేసుకుని కొంచెం చింతించాం.
కాలగమనంలో మాలో వచ్చిన మార్పులు, చేర్పులు, కూర్పులని విప్పుకున్నాం. కాలేజీ తరువాత మేము కొత్తగా చేసుకున్న అలవాట్లని ఒకరికొకరం పరిచయం చేసాం. ద్రవ పదార్ధాలతో మా గొంతులు తడుపుతున్న వేళ మాతో పాటు ఆ సాయంత్రం కిషోర్ కుమార్ గొంతు కలిసింది. నా బ్లాగు చిరునామా కూడా ఇచ్చా, ఖాళీగా ఉన్నపుడు చదువుకోమని.

13 comments:
"కాలసముద్ర మధనం చేసి జ్ఞాపకాలని బయటకి తోడాం. ఒకటా, రెండా? మా జ్ఞాపకాలకి ముమైత్ ఖాన్ (పోకిరి నాటికి) వయసుంటుంది."
బాగుంది, శ్రీ! ఆ రొయ్యల కూర నేనూ ప్రయత్నించాలి. కానీ, ఇక్కడ మీ వాక్యల్లో మంచి రొయ్యల కూరల వాసన!
థాంక్స్ అఫ్సర్ గారు!
కొత్తవ్యక్తి పాత గొంతు బాగుంది శ్రీ గారు. బాల్య స్నేహితులతో తరచుగా మాట్లాడుతూ టచ్ లో ఉండటం ఒకరకమైన ఆనందాన్నిస్తే అనుకోకుండా కలిసే ఇలాంటి మిత్రులు మరొకరకమైన ఆనందాన్ని ఇస్తారు..
అవును వేణు గారు.
బాల్యన్ని గుర్తు చేసుకోవడం ఎంత మధురమో కదా! బాల్య స్నేహితులు అమృతభాండాల లాంటివారు. సమయమెరుగని, అలుపెరగని, చెదరని తీపి గుర్తులెన్నో వారిలో నింపుకుని ఉంటారు. కలిస్తే జ్ఞాపకాలు ఊరుతూనే ఉంటాయి అక్షయపాత్రలాగ.
మీ సంబరం చాలా బాగుంది!
baasu.. photo amaina vunda.. vunte personal gaano leka public gaa bloite baguntundi. Jaya ni choosi 10 samvatsaralu ayyindi... ela vunnadu?
థాంక్స్ సౌమ్య గారు.
దేవా, మొన్న మాటల్లో ఫోటో విషయం మర్చిపోయా. మళ్ళీ కలిసినపుడు ఒకటి తీసి పెడతా.
జయచంద్ర ఇపుడు కూడా కాలేజీలో ఉన్నపుడు లాగే ఉన్నాడు, ఒక చిన్న పొట్ట తేడా.
>>>"ఒక చిన్న పొట్ట తేడా"
అంటే అప్పట్లో పెద్ద పొట్ట ఉండేదా? :D
>>>"మా జ్ఞాపకాలకి ముమైత్ ఖాన్ (పోకిరి నాటికి) వయసుంటుంది."
LOL
సూటిగా సిమ్పుల్ గా ఉన్నాయి ఙ్ఞాపకాలు
గీతాచార్య, హహహ....
మంచి టపా.. అంతకు మించి చక్కగా అతికినట్టు సరిపోయిన శీర్షిక!!
అన్నట్టు "మోటబావిలో మిత్రుడి మరణం" అండీ, "మోటు బావి" కాదు....
థాంక్స్ మురళి గారు.
Meeru nbkrist lo ee batch? I was from 1996-2000.
అవును, మాది 90-94 బాచ్.
Post a Comment