చాలా రోజులయింది, సినిమాలేవన్నా ఉన్నయా అంటే మా ఊర్లో బ్లేడ్ బాబ్జీ,ఆవకాయ్ బిర్యానీ మాత్రమే ఆడుతున్నాయ్. ఇప్పటికే మార్టిన్ లారెన్స్ మూవీ "బ్లూ స్ట్రీక్" సినిమా ఒక 5,6 సార్లు చూసి ఉంటా. ఈ సినిమా అభిమానం మీద హిందీ రీమేక్ "చోర్ మచాయే షోర్" సినిమా చూసి విసుగు పుట్టింది. ఇంక బాబీ డియోల్ సినిమాలు చూడకూడదని గట్టిగా తీర్మానించా. చిరిగిన 5 రూపాయల నోటన్నా మారుతుందేమో కానీ, ఈ బాబీ డియోల్ మాత్రం మారడు! ఒకే కథని ఎన్ని సార్లు చూస్తాం? అందుకే నా వోటు ఆవకాయ్-బిర్యానీ కి వేసా. అదీ కాక అనీష్ కురువిల్ల మొదటి సినిమా ఒక్క షో మాత్రమే ఆడించి తర్వాత తీసేసారట. ఆ సినిమా గొడవ అతని మాటల్లోనే ఇక్కడ చూడండి.
మాధ్యాహ్నం 4:15 కి సినిమా ఉంది, ఈ షో అంటే నాకు చాలా ఇష్టం! ఏ గొడవా లేకుండా హాయిగా సినిమా చూడచ్చు. అనుకున్నట్టే నేను థియేటర్ లోకి వెళ్ళాక చూస్తే ఎవరూ లేరు, ఒక్కడినే కాస్త హాయిగా కూర్చున్నాక సినిమా మొదలయ్యింది.
కమల్ కామరాజు వచ్చిన లడ్డు లాంటి అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేదనిపించింది. రామారావు మనవడో, చిరంజీవి అల్లుడో, నాగేశ్వర రావు మనవడో ఇలా వారసులు లేకుండా కొత్త నటుడికి అవకాశం ఏ పుష్కరానికో రాదు. బిందు మాధవి మాత్రం పరవాలేదనిపించింది. ఈమె పూరీ సినిమాలో చపాతి (పూరీ తమ్ముడు) పక్కన హీరోయిన్ గా ఆల్రెడీ బుక్ చేసారట! సినిమాలో లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి. కురివిల్ల టేస్ట్ ఒక్క టైటిల్ పెట్టడంలో, లొకేషన్స్ వెతుక్కోవడంలో మరియూ హీరొయిన్ని సెలెక్ట్ చేయడంలో మాత్రమే బాగుంది. సినిమాలో రెండు, మూడు కథలున్నాయ్! తరువాత సినిమాకి వాడుకోవచ్చని తెలియదా బాబాయ్ కి? అనవసరంగా సాగదీసాడు సినిమాని అనిపించింది. పేర్లు పడుతున్నపుడు రావు రమేష్ పేరు చూసి "ఆహా" అనుకున్న. అతనికి సరి అయిన పాత్ర అందించడంలో కురువిల్ల ఫెయిల్ అయ్యాడు. అతని పాత్ర ఎందుకలా ప్రవర్తిస్తుందో నాకు అంతు పట్టలేదు! కొంప దీసి ఇతనికిచ్చిన పాత్ర మందు పాత్రా?
అసభ్యత, కుళ్ళు జోకులు లేకుండా మంచి సినిమానయితే అందించాడు అనీష్. ఎంతయినా శేఖర్ కమ్ముల స్కూలు కదా? కొన్ని కొన్ని తప్పులు సరిదిద్దుకుని ఈసారి మంచి సినిమా తీస్తాడని నమ్మకమయితే కలిగించాడు. మంచి అరోగ్యకరమయిన సినిమా అందించిన కురువిల్లని నేను నా బ్లాగ్ ముఖంగా అభినందిస్తున్నాను.
16 comments:
>>చిరిగిన 5 రూపాయల నోటన్నా మారుతుందేమో కానీ, ఈ బాబీ డియోల్ మాత్రం మారడు!
hahah bhale cheppaarandee :)
>>చిరిగిన 5 రూపాయల నోటన్నా మారుతుందేమో కానీ, ఈ బాబీ డియోల్ మాత్రం మారడు!
ఇరగదీసింది, పడీ పడీ నవ్వుకున్నా,
ఈ సారి మీ రివ్యూని పైలైను డామునేచేసింది,
చాలా బావుంది ఆ లైను
మీ సమీక్ష భలేగుంది. I enjoyed it.
ఈమె పూరీ సినిమాలో చపాతి (పూరీ తమ్ముడు) పక్కన హీరోయిన్ గా ఆల్రెడీ బుక్ చేసారట!....
ha..haa. bagaa chepparu.
"చిరిగిన 5 రూపాయల నోటన్నా మారుతుందేమో కానీ, ఈ బాబీ డియోల్ మాత్రం మారడు!" ఒకే ఒక్కేటున అతగాడి పీక థెగ్గోసి పారేసారు.
అమ్మో శ్రీ! చమత్కారాలు మిరియాల్లాగా పేలాయిగా! సెబాసో!!
మధు, అశ్విన్, మహేష్, చైతన్య, చదువరి, కొత్తపాళీ గారికి నెనర్లు!
ఈ చిరిగిన నోటు డైలాగ్ నా ప్రియ మిత్రుడు త్రిలోక్ చంద్రారెడ్డికి ఊత డైలాగ్ అన్నమాట! మీకందరికీ నచ్చినందుకు సంతోషం. జనరంజకమయిన డైలాగ్ ని నాకందించినందుకు త్రిలోక్ కి నా నెనర్లు!
ఇక పూరీ తమ్ముడి పేరు గుర్తు లేదు, బాగా పండుతుందని "చపాతీ" అని పేరెట్టేసాను!
మీ సమీక్షలో మాత్రం ఉప్పు సరిగ్గా సరిపోయింది.
బాగుంది.
థాంక్స్ భవాని గారు.
పూరీ తమ్ముడి పేరు సాయిరాం శంకర్ అనుకుంటా.సమీక్ష బాగుంది.అయితే మీరు వీ ఐ పీ షో చూసారన్న మాట.మీ ఒక్కరి కోసం సినిమా వేసారన్న మాట.మేము వేసిన సినిమాకి అతి తక్కువ ప్రేక్షకులని చూసింది కురువి[తమిళ్]విజయ్ సినిమాకి.ఆరుగురొచ్చారు.అక్కడ ఒక్కరంటే పర్లేదు...మాకు ఎక్కువే వచ్చినట్టు లెక్క :)
రాధిక గారికి, అవును, సాయిరాం పూరీ తమ్ముడి పేరు. ఇప్పటికి ఒక 5 సినిమాలన్నా తీసి ఉంటాడు, పాపం ఒక్కటీ హిట్ అవలేదు.
వీకెండ్ లో కొంత మంది వచ్చి ఉండే ఉంటారు, నేను వీక్ డే లో చూడడం వల్ల మనుషులు లేరు. ఈ షోస్ ఎవరన్నా వస్తే తప్పితే వెయ్యరు, వీ.ఐ.పీ లాగే ఫీల్ అవ్వచ్చు. మీరు వేసిన సినిమా అంటే? మీరు ఎక్సిబిట్ చేసారా?
avunamDi.maavaaru wisconsin,bloomington,peoria vestuntaaru[exibit cestaru].ippudu king,nenimtea viiTitoa paaTuu minniopolis kuuda vestunnaaru.
meeru ekkkado pappu lo kalesaru,avakai biryani movie ok suchi subhramaina cinema ,meeru annattu rao ramesh ki saraina patra ivvaledu.edi aythenemmi Shekhar kammula NEAT cinemalu theesthadu.anduku garvapadali.sakutumba katha chitram .
meeru ekkkado pappu lo kalesaru,avakai biryani movie ok suchi subhramaina cinema ,meeru annattu rao ramesh ki saraina patra ivvaledu.edi aythenemmi Shekhar kammula NEAT cinemalu theesthadu.anduku garvapadali.sakutumba katha chitram .
ఓ! బాగుందండీ రాధిక గారు. నేను డెట్రాయిట్ లో ఎక్సిబిటర్ ని. డాన్, జల్సా, కొత్త బంగారు లోకం వేసాను ఇక్కడ. మీ తదుపరి సినిమాలకి అడ్వాన్స్ విషెస్!
జిష్న్ గారు, సినిమా కొంచెం సాగదీసినట్టు ఉంది. తప్పితే నీట్ గానే ఉంది.
Post a Comment