Thursday, February 5, 2009

కొత్తపాళీ,మహిళా బ్లాగర్లకి కాలాస్తి నైతిక మద్దతు

మహిళా బ్లాగర్లు, కొత్తపాళీ గారి మీద దాడులు జరుగుతున్నాయని తెలిసి వాటిని కాలాస్తి కూడలి ముఖంగా ఖండిస్తుంది.


ఈరోజు దుకాణం తెరవగానే తోటరాముడి టపా చదివి చాలా హాయిగా ఉన్న నాకు సుజాత గారి టపా చదివేసరికి చిర్రెతుకొచ్చింది. మహిళా బ్లాగర్ల పట్ల కొన్ని రోజులుగా ఎవరో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తెలిసి చాలా విచారం కలిగింది. ఈ సంఘటన వల్ల కొంత మంది బ్లాగు కూడా మూసేస్తున్నారని సుజాతగారన్నారు. మహిళా బ్లాగర్లతో పాటు కొత్తపాళీ గారి పట్ల కూడా ఇలా ప్రవర్తించడం విచారకరం. ఈ దాడిని నేను కూడలి పరంగా ఖండిస్తున్నాను. చాలా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఈ బ్లాగుల సమాజంలో ఇటువంటి చీడపురుగుల్ని తోటి బ్లాగరుగా ఏరిపారేయండని అందరికీ పిలుపునిస్తున్నాను.



అసభ్యకరంగా ప్రవర్తిచే అనామకులని తోక ముడిచి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను.


బ్లాగర్లందరూ ఒక కుటుంబం లాంటి వాళ్ళు. మహిళా బ్లాగర్లు ఎంతో హాయిగా తమ అభిప్రాయాలని బ్లాగుల ద్వారా వెల్లడిస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా. ఇంతకు ముందు ఒక టపాలో కొత్తపాళీగారన్నారు, బ్లాగు అనేది మనందరికీ ఒక వేదిక అని. అందరూ నిర్భయంగా, నిస్సంకోచంగా గొంతు విప్పి మన ఊహలని, అభిప్రాయాలని తోటి ప్రజలతో పంచుకునే ఒక అరోగ్యకరమయిన వేదిక అని.



మనమందరం మనపై ఎందరు అభాండాలేసినా, బురద చల్లినా వెనకడుగు వేయద్దని మహిళా బ్లాగర్లకి, కొత్తపాళీ గారికి విన్నవించుకుంటున్నాను.



ప్రముఖ రచయిత యండమూరి వేరేంధ్రనాథ్ ఒక నవల్లో ఇలా రాస్తాడు.



"పిరికి వాడు తనపై ఎవరన్నా రాళ్ళు వేస్తే పారిపోతాడు. తెలివయిన వాడు ఆ రాళ్ళతో ఒక దుర్గం కట్టుకుంటాడు" అని.

మనపై బురద చల్లిన అసమర్థుల పిరికి పుర్రెలు చిట్లిపోయేలా తొక్కుకుంటూ ముందుకు సాగుదాం.




12 comments:

తెలుగుకళ said...

చివరి రెండు పంక్తులూ అత్యద్భుతం.
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?
నా యిచ్చయేగాక నాకేటి వెరపు ?
అన్న దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మాటలు ముత్యాలమూటలు. మరి బ్లాగ్ మితృలు ఈ మాటలని గుర్తుపెట్టుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నాను.
ధన్యవాదాలు.

శ్రీ said...

నెనర్లు తెలుగుకళ గారు.

Vensy said...

తెలుగు బ్లాగులలో కనిపించే చాలా ఆరోగ్యకరమైన ధోరణి,బ్లాగరులు ఎక్కడెక్కడి వారో అయినా మనమంతా ఒక్కటే అనిపిస్తూ, ఆత్మీయత పంచుతున్న వాతావరణం చూసి నాలాంటి కొత్తవాళ్ళెందరో బ్లాగులు రాయడానికి సిద్ధపడుతున్నారు. కొత్తపాళీ గారు చాలా సున్నితంగా,ఎంతో సౌహార్ద్రతతో కనిపిస్తారు బ్లాగుల్లో..ఎవరినయినా ఎవరైనా ఎందుకు విమర్శించడం. మనకి నచ్చితే చదవడం, ప్రోత్సాహకరంగా ఓ కామెంట్ రాయడం, లేదా ముందుకు పోవడం అంతే ఎవరయినా చేయాల్సినది.
తెలుగు బ్లాగుల లో బ్లాగరుల మధ్య ఎప్పుడూ ఈ ఆత్మీయధోరణే ఉండాలని కోరుకుంటున్నాను.

శ్రీ said...

బాగా చెప్పారు సుధ గారు.

ఇటువంటి సంఘటనల వల్ల బ్లాగర్ల మధ్య అనుబంధం మరింతగా పెరగడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను.

చిలమకూరు విజయమోహన్ said...

ఇదే కామెంటును ’తెలు గోడు’గారి టపాలో రాశాను దాన్నే మళ్ళి ఇక్కడ రాస్తున్నాను.
ఈ ఇరవై రోజుల్లో ఏమి జరిగిందో తెలియదు ఎందుకంటే పంటల నూర్పిడిలో మునిగిపోవడంవల్ల విషయం తెలియలేదు జూన్లో బ్లాగుప్రపంచంలోకి ప్రవేశించాను.వచ్చినప్పుడున్న వాతావరణం ఇప్పుడులేదు.అయినా ఇదేంటండి బ్లాగులోకంలో అందరూ మంచి విద్యావంతులు,సంస్కారవంతులున్నారనుకున్నా,మా పల్లెటూరి ప్రజలే మేలు కదండి.అపార్థాలు పొడచూపినా త్వరగా మరచిపోయి మళ్ళీ కలిసిపోతూవుంటాము.అయినా ఎవరో ఏదో అన్నారని మనం బ్లాగులు మూసుకోవడమేంటండి.పొగడ్తల్నే కాదు విమర్శల్ను కూడా స్వీకరించే స్తితప్రజ్ఞత,మనస్తత్వం అలవరచుకోవాలి.ఇలా జరగడవల్ల మంచి బ్లాగర్లను కోల్పోయినవారమవుతాము.ఇప్పుడిప్పుడే తెలుగు బ్లాగులోకానికి పత్రికారంగంలో గుర్తింపు వస్తోంది,ఇలాంటి సమయంలో మంచి బ్లాగర్లు తమ బ్లాగులను మూసివేయడం తెలుగును ప్రపంచవ్యాప్తిచేయాలన్నమన ఆశయం నెరవేరదు.గత నెలలో దీనికోసం పుస్తక ప్రదర్శనలో మన బ్లాగు మిత్రులు కష్టపడినదంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా తయారవుతుంది.బ్లాగులను మూసివేయలన్న నిర్ణయాన్ని మరోసారి ఆలోచించమని నా విజ్ఞప్తి.

శ్రీ said...

విజయకుమార్ గారు, తొందరలోనే బ్లాగర్లు ఈ సమస్య నుండి బయటపడుతారని నేను కుడా ఆశిస్తున్నాను.

మనం మానవులం,సమస్యలలో పెరిగిన వాళ్ళం. ఇవే లేకపోతే మనిషి పుట్టుకకి అర్ధం ఏముందండీ?

Anonymous said...

నేను సైతం ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాను. నా నైతిక మద్ధతు, మహిళా బ్లాగర్లకు., కొత్తపాళీ గారికి.

Malakpet Rowdy said...

AT LAST .. FINALLY ... ONE POST stands for all the troubled people irrespective of the gender! I'm with you all!

But then, strategic silence in this regard is more powerful than going overboard with a series of condemnations!

Anonymous said...

శ్రీ గారు మీరు ఒక్కటి ఆలోచించండి.
ఆ దాడి మహిళాబ్లాగర్ల పై దాడి గా మలచి చూడటము ఎంత వరకు సబబు. ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి ని ఇంత పెద్దదిగా చేయటం.
వాళ్ళ కి వ్యక్తిగతంగా ఉన్న గొడవలు ఇలా బ్లాగుల వరకూ తెచ్చుకున్నారు.
గతంలో ఎందరో మహిళా బ్లాగర్స్ పై అనానిమస్ ల దాడి జరిగినా రాని వీళ్ళంతా ఎందుకని వీళ్ళకు జరగగానె ఇలా ఉద్యమం అంటున్నారో కూడా మనం ఆలోచించి తీరాల్సిన విషయం.
ఆ ఇద్దరిని మాత్రమే ఎందుకు వారు టార్గెట్ చేసారు అన్నది తెలుసుకొవలసిందే ఇక్కడ స్త్రీ పురుష విభజన అనవసరమైనది.

శ్రీ said...

నెనర్లు రవి గారు

నెనర్లు మలకపేట రౌడీ గారు. మీ పేరు రఫ్ గా ఉన్నా మీ రెస్పాన్స్ తియ్యగా ఉంది.

అనానిమస్ గారు,
దాడి ఒకరిద్దరికంటే ఎక్కువమంది మీదే జరిగిందండీ. వీళ్ళిద్దరూ తమకి జరుగుతున్న అన్యాయానికి గళం విప్పారు, సాటి బ్లాగర్లమయిన మేము స్వరం పెంచాం.

ఇంతకు ముందు కంటే ఇపుడు బ్లాగర్ల మధ్య సయోధ్య పెరిగింది, సంఘటిత శక్తి బలపడింది.

బ్లాగర్లు రాసింది అనానిమస్ కి నచ్చలెదనుకోండి,దాన్ని అరోగ్యకరంగా తెలియజేయండి.

బ్లాగింగ్ మనదరికీ ఒక ఆరోగ్యకరమయిన అలవాటు, దాన్ని సమాజానికి మేలు చేసే విధంగా మనం పాటుపడదాం.

చైతన్య.ఎస్ said...

క్షమించండి... ఆలస్యంగా మీ టపా చుశాను . దీన్ని ఖండించవలసిందే. మహిళా బ్లాగర్లకు, కొత్తపాళీ గారికి మద్దతు ఎప్పుడూ ఉంటుంది.

శ్రీ said...

ఆలస్యంగానయినా చూసి మద్దతు ఇచ్చినందుకు నెనర్లు చైతన్య గారు.