మిత్రుడు: సాయంత్రం "మిత్రుడు" సినిమాకి పోదామా?
నేను: అలాగే. నేను ఒక గంట యోగ చేసి వస్తాను.
మిత్రుడు: పరవాలేదు, అక్కడ చెయ్యచ్చు.
నేను: అలాగే.
అఫీసు నుంచి నేరుగా ఇంటికి పోయినా. రెండు చపాతీలు నోట్లో వేసుకుని, కూసింత రెడీ అయ్యా.
"ఏమండీ? ఇంకొక సారి అలోచించండి" అనింది మా ఆవిడ.
"పర్లేదు లేవే!" అని చెప్పా. లోపల నాకు కూడా కొంచెం గుబులుగానే ఉంది.
నన్ను ఆపడానికి ప్రయత్నిస్తూ "నవతరంగం లో సినిమా బాగా లేదని రాసారండీ!" అంది మా ఆవిడ.
నేను గడుసుగా "నవతరంగంలొనే ఇంకొక ఆయన బాగనే ఉందని రాసాడు లేవే!" అన్నాను.
ఈ లోపల మిత్రులు మిస్సెడ్ కాల్స్ ఇస్తున్నారు. అంటే వీళ్ళు దారిలో ఉన్నారనమాట, నేను కూడా కారెక్కి రోడ్డున పడ్డా. పార్కింగ్ లాట్ దగ్గర మిత్రులని కలుసుకుని హాలు లోకి వెళ్ళాము.
సినిమా విషయానికి వస్తే ఆదిత్య (బాలకృష్ణ) మలేషియాలో గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇందు (ప్రియమణి) మలేషియాలో చదువుకుంటూ ఉంటుంది. ఇందు ఆదిత్యని ప్రేమలో పడేసి పెళ్ళి చేసుకోవడంతో మొదటి సగం ముగుస్తుంది. ఇందుకి ఇంతకు ముందే ఒక బాయ్ ఫ్రెండు(దీపక్) ఉంటాడు. జాతకం ప్రకారం ఇందు భర్త 30 రోజులకి ఠపా కడుతాడని, అపుడు రెండవ పెళ్ళిగా దీపక్ ని చేసుకుందామని ఇందు పధకం. అమె పధకం పారి దీపక్ ని పెళ్ళి చేసుకుంటుందా? ఆదిత్య జాతకం ప్రకారం ఠపా కడుతాడా అనేది మీ వెండి తెర మీద చూడాల్సిందే!
బాలయ్య సినిమా కాబట్టి కొంచెం ద్వందార్ధాలు ఉండాలేమో? దాని కోసం ప్రత్యేకంగా శ్రీలతని పెట్టారు. ఈమె కామెడీ కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. బ్రహ్మానందం, కృష్ణ భగవాన్ కామెడీ కొంచెం సరదాగానే ఉంది. ఈ సినిమాకి సంగీతం నిజంగా మణిశర్మేనా అనిపించింది, పాటలన్నీ నీరసంగా ఉన్నాయి. బాలయ్యకి వయసు పైన బడి బాగా తెలుస్తుంది, మొహమంతా తెల్లగా సున్నమేసినట్టు మేకప్ వేసారు. ఒక దారుణమయిన విషయం ఏమిటంటే ఒక 10 ఏళ్ళ కుర్రాడు బాలయ్యని అన్నయ్య అంటాడు. బాలయ్య ఇక వయసుకి తగిన పాత్రలు చూసుకుంటే బాగుంటుంది. ప్రియమణి ముఖంలో మెరుపులు తగ్గాయి, విరామం తర్వాత ఫరవాలేదనిపించింది.
సినిమాకి నెగటివ్ పాయింటు ఏమిటంటే ఫ్లాష్ బాక్, ఇంచుమించు సినిమా అయిపోయేటపుడు మొదలవుతుంది. అనవసరంగా మనుషుల్ని చంపి అదేదో సెంటిమెంటు లాగా మనకి పూస్తారు. ప్రతి సినిమాకి ఫ్లాష్ బాక్ ఉండాలని రూల్ ఏమీ లేదు కదా, లేకుండా లాగించి ఉండాలి దర్శకుడు. లేదంటే కొంచెం మంచి ఫ్లాష్ బాక్ పెట్టి ఉంటే బాగుండేది. దర్శకుడు రాజమౌళి దగ్గర పని చేసాడంట, అందుకే ఏమో రమా రాజమౌళి దుస్తులు వేసి పెట్టింది సినిమాకి. సినిమా మొత్తం చూసినా బాలయ్య ఎవరికి మిత్రుడు అన్న ప్రశ్న నాలో అలాగే ఉండిపోయింది. ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పి కొంచెం పుణ్యం చేసుకోండి.
12 comments:
ఇంతకూ యోగా చేశారా లేదా? బాలకృష్ణ మీతో చేయించాడా?
"సినిమా మొత్తం చూసినా బాలయ్య ఎవరికి మిత్రుడు అన్న ప్రశ్న నాలో అలాగే ఉండిపోయింది.." అది తెలుసుకోడం కోసమే సినిమా తీసి ఉంటారని నా సందేహం. సినిమా వాళ్ళ సెంటిమెంట్లలో ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటనే కంక్లుజన్ కి మీరింకా రాకపోవడం దారుణం.. ఇంతకీ యోగా విషయం చెప్పనే లేదు..
@రవి యోగా చేయడానికి బాలకృష్ణ అవకాశం ఇవ్వలేదు. బాలకృష్ణ చేస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నా.
@ మురళి, ఎవరికి మిత్రుడు అన్న విషయం సినిమా తీసిన వాళ్ళకి తెలిసిందో,లేదో? యోగా విషయం పైన రాసాను చూడండి.
ఫ్లాష్ బాక్ లేకుండా సెంటిమెంట్ పెట్టలేమా?
http://thatstelugu.oneindia.in/movies/sameeksha/2009/05/mithrudu-movie-review-010509.html
నేను చెప్పింది నిర్మాతల సెంటిమెంట్ గురించండీ.. 'ఫలానా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండడం వల్ల అది హిట్ అయ్యింది. కాబట్టి మన సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఉండాల్సిందే..' ఈ రకంగా ఆలోచిస్తారు కదా మన నిర్మాతలు.
స్క్రీన్ ప్లే లోనే లోపం ఉంది కధ లో బలం లేదు .విశ్రాంతి తర్వాత ఫర్వాలేదని పించింది .టైటిల్ అతకలేదు .
@ అనానిమస్, రివ్యూ చదివాను. ఇదే రివ్యూని గురువు గారు నవతరంగంలో కూడా పోస్ట్ చేస్తారు.
@ మురళి, ఓ..అలా చెప్పారా...
@ పరిమళం, మూడు ముక్కల్లో బాగా తేల్చారు
మిత్రుడు చూసే సాహసం చేయలేదండి.... అన్నట్లు.. మీరు యోగా చెస్తారేమొ అనుకున్నా ;-) :-)
సాహసం నా ఊపిరి అండీ! అందుకే తడబడకుండా చూసేసా.ఇపుడు ఇంట్లో తప్పకుండా చేస్తున్నా యోగా.
ఫొటోలో హీరోకి ఫుల్ బట్టలేసి అమ్మాయిని అలా చూపించారేం? అదీ బొడ్డుకిందనుంచి బాగా అతుక్కుపోయే బట్టల్లో ... Not good :-(
చివరి అనోనిమస్ గార్కి - ఆ ఫోటూ తీసింది మనోడు కాదనుకుంటా? ఏన్నాయ్ శ్రీ, బాగచెప్పిన్నా?
పిల్లాట.
యోగా సేస్తున్నారా? ఎలా? ఎప్పుడు? ఎంత? మీవద్ద బాబా రావందేవ్ గారి వీడియోలు ఏమైనా ఉన్నాయా? కావాలా, నావద్ద ఉన్నాయ్?
ఓసారి ఈడో లుక్కెయ్యి -
http://ramakantharao.blogspot.com/2009/01/blog-post_22.html
@అనానిమస్, స్టూడెంట్ నం.1 లో అలీ,"ఎపుడూ అమ్మయిలేనా బొడ్డూ పైకి వేసుకునేది, మేమూ వేసుకుంటాం" అని బొడ్డు పైకి షర్ట్ వేసుకుంటాడు. ఇలాంటి బట్టలు అమ్మాయిలు వేసుకుంటేనే బాగుంటారు, అబ్బాయిలు కాదు. అయినా ఈ రోజుల్లో నిండుగా బట్టలు వేసుకునే హీరోయిన్ ఎక్కడ ఉంది చెప్పండి?
@ భాస్కర రామరాజు, బాగా చెప్పారు! నేను ఇంట్లోనే సదరన్ అయ్యంగార్ యోగ చేస్తాను. చిన్నపుడు మా మామయ్య నేర్పించాడు మాకు. రాం దేవ్ సీడీలు మా మామయ్య ఇండియా నుండి తెచ్చి మాకిచ్చారు. మీరు పంపిన యోగా లింకు చూసాను, బాగుంది.
Post a Comment